Followers

మాడుగుల సీ.డీ.పీ.ఓ.అనంత లక్ష్మికి ఉత్తమ అవార్డు

 మాడుగుల  సీ.డీ.పీ.ఓ.అనంత లక్ష్మికి ఉత్తమ అవార్డు

మాడుగుల,పెన్ పవర్

మాడుగుల ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు అధికారిణి అనంత లక్ష్మి ఉత్తమ అధికారి అవార్డు వరించింది.సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధికారి గా ప్రశంసాపత్రం మెమోంటోను అందుకున్నారు. సీడీపీఓగా విధినిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఆమె సేవలకు ఎస్. డి.సి.జిల్లా స్త్రీ-శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.సీతా మహాలక్ష్మి చేతుల మీదుగా పీఓ. ఉత్తమ అవార్డు స్వీకరించారు. అలాగే  ఐసిడిఎస్  ఉద్యోగులు బి. లక్ష్మి  వి రమాదేవి సరోజినిలు కూడా అవార్డు లు అందుకున్నారు.

ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కు వినతి పత్రం

 ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో  ఎంపీడీవో కు వినతి పత్రం

గొల్లపల్లి, పెన్ పవర్

 జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ (0706) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి పనుల గురించి తనిఖీ చేయుట నిమిత్తం అనుమతించాల్సిందిగా ఎంపీడీవో కు వినతి పత్రం అందించిన సమాచార హక్కు చట్టం (0706) గౌరవ అధ్యక్షులు జంగిలి సత్యం, అధ్యక్షుడు భూమయ్య సభ్యులు ఆవుల వెంకటేష్ యాదవ్ మామిడాల లింగన్న ముస్కు అభిషేకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

మున్సిపాలిటీ సిబ్బంది దందా...

మున్సిపాలిటీ సిబ్బంది దందా...

 దుండిగల్,పెన్ పవర్

 దుండిగల్ మున్సిపల్ కమీషనర్ కార్యాలయం ముందు బహుదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీ వాసుల దర్నా.. ఇష్టానుసారంగా ఇంటిపన్నులు వసూలు చేస్తున్నారని బాధితుల ఆరొపణ.మున్సిపల్ సిబ్బందికి డబ్బులు ఇస్తె 50%. డబ్బులు ఇవ్వకపోతె 100% పన్నులు వసూలు చేస్తూ పక్షపాత దోరణితో వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది బహిరంగంగానే బెదిరిస్తున్నారని.కాలనీవాసులు కమీషనర్ కు పిర్యాదు చేశారు.

మొటేషన్ లో పేరు మార్చిన అధికారులు.ఆమ్యామ్యాలు ఇవ్వలేదని తిరిగి 7 నెలలకు పాత యజమాని పేరుతోనే ఇంటిపన్నులు.. అధికారుల అగాయిత్యాలపై స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మెన్ పద్మారావు కు పిర్యాదు. సమస్య పరిష్కరిస్తానన్న కౌన్సిలర్ పద్మారావు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ

 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ

విశాఖపట్నం,పెన్ పవర్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ చేసి తీరుతామని,ఇందులో ఎలాంటి సందేహం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను ఖండిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం అల్లిపురం నాలుగు రోడ్ల జంక్షన్ లో రాస్తా రోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగల ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను నేడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడానికి సన్నాహాలు చేస్తూనే తాజాగా వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ చేసి తీరుతామని కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించడం చూస్తే బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ నిర్ణయాన్ని ఆడ్డుకోవాల్సిన రాష్ట్ర అధికార పక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండు గోరంగా వైఫల్యం చెందాయని ఆరోపిస్తూ మరో పక్క జనసేన పార్టీ నాయకత్వం కూడా బీజేపీ నిర్ణయాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారని విమర్శించారు. రేపు జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో పై పార్టీల వారికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కృషి చేయలేని వారు ఓట్లు అడిగే నైతిక హక్కును కోల్పోయారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు జి కాసులరెడ్డి, స్థానిక నాయకులు చామన విశ్వేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పెట్రోలు బంకుపై చర్యలకు సిద్దమైన జీహెచ్ఎంసి

 పెట్రోలు బంకుపై చర్యలకు సిద్దమైన జీహెచ్ఎంసి

కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ సూరారం కట్టమైసమ్మ చెరువు కట్ట బఫర్ జోన్ ఆక్రమిస్తూ నిర్మంచిన పెట్రోలు బంకుపై చర్యలకు సిద్దమైన జీహెచ్ఎంసి.. రెవెన్యూ.ఇరిగేషన్ మూడు శాఖల అధికారులు.బంకులో గాజులరామారం ఉపకమీషనర్ రవిందర్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక విబవాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ గణేష్. సెక్షన్ అధికారి నరేష్. రెవెన్యూ అధికారులు సర్వేయర్ సునిత.

విఆర్ఓ బాలరాజు మరియు డిమాలిషన్ స్క్వాడ్ తో బంకు వద్దకు చేరుకొని.డాక్యుమెంట్లు పరిశీలన. అనంతరం సీజ్ చేసిన అధికారులు. పెట్రోలు బంకులో క్రయవిక్రయాలు జరపకూడదని బంకు సిబ్బందికి హెచ్చరికలు చేసిన అధికారులు నోటీసులు జారీ.

పక్షి ప్రేమికురాలు గంధం రిషిత

 పక్షి ప్రేమికురాలు గంధం రిషిత-వేసవి కాలంలో పక్షుల దాహం తీరుస్తున్న రిషిత--రిషిత ని పలువురు ఆదర్శంగా తీసుకోవాలి

లక్షెట్టిపెట్,పెన్ పవర్


 పట్టణానికి చెందిన గంధం రిషిత పక్షుల పట్ల చాలా మక్కువ చూపుతుంది.వేసవి కాలం రాగానే రోజు ఉదయాన్నే లేచి తన ఇంటి డాబా పై పక్షులకు నీళ్లు,పక్షులు తినే గింజలు వేస్తు పక్షుల ఆకలి తీరుస్తుంది.వేసవికాలంలో నీళ్లు దొరకక పలుచోట్ల పక్షులు మరణిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలా పక్షులు అంతరించి పోతున్నాయి. చిన్న తనంలోనే పెద్ద మనస్తత్వం కలిగి ఉండడం రిషిత గొప్పతనం గత నాలుగు సంవత్సరాల నుండి వేసవికాలం ప్రారంభం కాగానే పక్షులకు క్రమం తప్పకుండా రోజు ఉదయాన్నే లేచి పక్షులకు నీళ్లు పెడుతూ ఉంటుంది. అంతేకాకుండా చదువులో ముందంజలో ఉంటూ ఇలా ముగజీవుల పట్ల శ్రద్ద చూపిస్తుంది. అటూ రిషిత తండ్రి గంధం సత్యనారాయణ కూడా పలు సేవా కార్యక్రమాలు చెపడుతూ పలువురికి అదర్శనంగా నిలుస్తున్నారు.గత ఐదు సంవత్సరాల నుండి గంధం సత్యనారాయణ గిరిజన గ్రామములైన తాండలలో గిరిజన నిరుపేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.తండ్రి బాటలో కూతరు రిషిత కూడా సేవ కార్యక్రమంలో ముందు ఉంటుంది. ఈ తండ్రి కూతుర్లను ఆదర్శంగా తీసుకోవాలని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

 విధులు బహిష్కరించిన న్యాయవాదులు-న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని కల్పించాలి-లక్షెట్టిపేట న్యాయవాదుల డిమాండ్

లక్షెట్టిపెట్,పెన్ పవర్

తెలంగాణ న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే కల్పించాలని లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేతిరెడ్డి భూమరెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.అనంతరం పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తున్న న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు 41-ఎ సీఆర్ పీసీనీ వెంటనే రద్దు చేయాలన్నారు.న్యాయవాదుల రక్షణ చట్ట సాధనకై ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం ఏర్పాటయ్యేదాకా పోరాటం సాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, ప్రసన్నకుమార్,కారుకూరి సురేందర్,అక్కల శ్రీధర్,కొమ్మిరెడ్డి కుడెల్లి అశోక్,సత్తన్న,అఫ్జల్ బియాబానీ,ఎస్.ప్రదీప్ కుమార్,వేల్పుల సత్యం,రెడ్డిమల్ల ప్రకాశం,సుమన్,తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...