Followers

మలకపల్లి పి హెచ్ సి పరిధిలో కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన

మలకపల్లి పి హెచ్ సి పరిధిలో కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన

తాళ్ళపూడి,పెన్ పవర్ 

తాళ్ళపూడి మండలం తిరుగుడు మెట్ట గ్రామంలో మలకపల్లి పి హెచ్ సి డాక్టర్ సుష్మా చౌదరి ఆదేశాలతో గ్రామంలో  60 సంవత్సరాలు దాటిన వారికి మరియు  45  సంవత్సరాలు దాటి షుగర్, బీపీ ఇతర వ్యాధులు ఉన్నవారికి కోవిడ్ వ్యాక్సిన్ మలకపల్లి పి హెచ్ సి లో వేస్తున్నారని, ఇంటింటికి వెళ్లి తెలియపరచి, ఈ వ్యాక్సిన్ వేయించుకొనేల మోటివేషన్ చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో వి హెచ్ యస్ బి.శ్యామల, ఆశావర్కర్స్, మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు.

సమాజంలో మేకవన్నె పులులు ఉన్నాయి బాలికలు అప్రమత్తంగా ఉండండి

 సమాజంలో మేకవన్నె పులులు ఉన్నాయి బాలికలు అప్రమత్తంగా ఉండండి 

పెన్ పవర్,ఆలమూరు

   సమాజంలో మేకవన్నె పులులు ఉన్నాయని బాలికలు అప్రమత్తంగా ఉండాలని ఆలమూరు సివిల్ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ హెచ్ అమరరంగేశ్వరరావు, ఎస్సై ఎస్ శివప్రసాద్ అన్నారు. ఆలమూరు మండలం చెముడులంక ఎస్ టి ఎస్ ఎమ్ ఎమ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సుతోపాటు బాలికలకు మహిళా దినోత్సవాన్ని నిర్వహించి ప్రస్తుత సమాజంలో జరిగే పరిస్థితులపై బాలికలకు క్షుణ్ణంగా వివరించారు. అలాగే ప్రతి బాలికకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయమూర్తి అన్నారు. రాత్రి సమయాల్లో ఇంటి పెద్దలు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్ళవద్దని, అలాగే సెల్ఫోన్లలో అపరిచితులతో సంభాషణలు చేయరాదని హెచ్చరించారు. బాలికలు ఒంటరిగా ఉన్న సమయాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే 100  నెంబర్లకు ఫోన్ చేస్తే క్షణాల్లో రక్షించ పడతారని తెలిపారు. అనంతరం ఎస్సై శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "దిశ" యాప్ ను ప్రతి మహిళ, బాలిక తమ చరవాణిల్లో డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు.  చాలా మంది అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తున్నా,మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా  అలాగే మండలంలో ఏ ప్రాంతం నుండినైనా సరే 9440904849 నెంబరుకు ఫోన్ చేస్తే కేవలం అయిదు నిమిషాల్లో వచ్చి రక్షిస్తానని అన్నారు. మండలంలోని బాలికలతో పాటు మహిళలు ఈ నెంబరులను గుర్తు పెట్టుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ, ఆలమూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె సునీల్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు న్యాయవాదులు పాల్గొన్నారు.

పంచాయతీ సర్పంచ్ గండి రాంబాబు కి ఆర్ సి ఎం చర్చ్ సంఘస్తులు ఘన సన్మానం

 పంచాయతీ సర్పంచ్ గండి రాంబాబు కి ఆర్ సి ఎం చర్చ్ సంఘస్తులు ఘన సన్మానం

తాళ్ళపూడి, పెన్ పవర్

గజ్జరం గ్రామ సర్పంచిగా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న గండి రాంబాబు కి ప్రప్రథమంగా ఆర్ సి ఎం చర్చ్ సంఘస్తులు ఘనంగా సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమం చర్చ్ ఫాథర్ రేవ కళ్యాణ్ కుమార్  చేతుల మీదుగా చర్చ్ సంఘస్తులు, మహిళలు, యూత్, చిన్నారులు సమక్షంలో సర్పంచ్  గండి రాంబాబు ని పూలమాలలతో, సాలువాలతో సన్మానించి వారి ప్రేమాభిమానాన్ని చూపించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సర్పంచ్  గండి రాంబాబు  మాట్లాడుతూ ఇది అందరి సమిష్టి విజయం. నా విజయానికి ప్రత్యక్షoగా, పరోక్షంగా  గ్రామ ప్రజలు, అలాగే గ్రామ   వైయస్సార్ పార్టీ నాయకులు, గన్నిన రత్నాజీ, కాకర్ల చంద్రశేఖర్, యువ నాయకులు వల్లభనేని శ్రీహరి, గుంటూ చిన్నబ్బాయి, ఎల్లిన శ్రీను, ఘర్రే శ్రీను, తొరం పోసిబాబు, పార్టీ కార్యకర్తలు  చేసిన కృషి నేను మరువలేనిది అని అన్నారు.

ఆదిత్య బిజినెస్ స్కూల్ లో మహిళా దినోత్సవ వేడుకలు

 ఆదిత్య బిజినెస్ స్కూల్ లో మహిళా దినోత్సవ వేడుకలు

గండేపల్లి,పెన్ పవర్

గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్యా ప్రాంగణంలో గల ఆదిత్య బిజినెస్ స్కూల్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసంధర్భంగా మహిళా ఉపాధ్యాయ ఉపాద్యాయేతర సిబ్బంది కి విద్యార్థినులకు వివిధ పోటీలు నిర్వహించారు.విజేతలకు బహుమతులు అందజేశారు.డైరెక్టర్.డా.ఎన్.సుగుణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు జైశివ సంతోషి ఫాలిప్యాక్ సంస్థ యజమాని  అల్లు సత్యవతి, శ్రీరామ్ హెర్బల్ ఇండస్ట్రీస్.విజయనగరం సంస్థ కు చెందిన రమాదేవి, ట్రెండీ టిక్లింగ్ ప్రొప్రైటర్. ఎన్.శ్రీవల్లి,బి.జినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ డా.డి.ఆస్థాశర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈసంధర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీ పురుష లింగ బేధం లేకుండా మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు దూసుకు పోతున్నారనీ, అభద్రతా భావం విడనాడి ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారు అని విద్యార్థులకు వివరించారు.ఉన్నత లక్ష్యంతో ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయి కి చేరే వరకూ నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం ముఖ్య అతిథులుగా హాజరై వారిని ఆదిత్య యాజమాన్యం తరుపున జ్ణాపిక శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

జగ్గంపేట పెన్ పవర్

 తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఇ  ఐ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ తన సిబ్బందితో బుధవారం కంటి వైద్య సేవలు అందించారు. జగ్గంపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు అడపా వెంకటరావు అధ్యక్షతన జరిగిన ఈ కంటి వైద్య శిబిరంలో మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు అడపా వెంకట రావు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి కంటి వైద్య కేంద్రం వైద్యులు అందించిన సేవలు మరువరాని అని ఆయన అన్నారు. 

ప్రతి ఒక్క జర్నలిస్టు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సేవలను వారి కుటుంబ సభ్యులతో కలిసి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈనెల 16వ తేదీన జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు మరియు గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి ఈ ఐ జిల్లా కంటి వైద్య కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 13 సిహెచ్సి ల లో వైద్య కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన అన్నారు. దీనిలో భాగంగానే జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం  ఏర్పాటు చేసిన కంటి వైద్య పరీక్ష సేవలు మీడియా వారికి అందించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా పేద ధనిక వర్గాల తారతమ్యం లేకుండా తాము నిర్వహించే కంటి వైద్య సేవలను మీడియా ద్వారా అందరికీ తెలపాలని ఆయన కోరారు. అత్యాధునికమైన కంటి వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కరుణ్ కుమార్ సురేష్ కుమార్ క్రాంతి కుమార్ సుబ్రహ్మణ్యం వైద్య సేవలు అందించిన వారిలో ఉన్నారు.

పల్లా గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న యువ నాయకుడు.

 పల్లా గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న యువ నాయకుడు.


నెల్లికుదురు /పెన్ పవర్,



మహుబుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి వరంగల్ ఖమ్మం, నల్గొండ, తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ మండల లోని ఆలేరు,చిన్నముప్పారం, రాజులకొత్తపెల్లి, శ్రీరామగిరి గ్రామాలలో పర్యటించారు.ఈ సందర్బంగా వారు గ్రాడ్యుయేట్స్ ఉద్యోగఓటర్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పేదప్రజల బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికై అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మరియు రైతన్నల అభివృద్ధికై రైతుభీమా, రైతుబందు లాంటి పాలసీలు తీసుకువచ్చి రైతులకు మనోదైర్యం కల్పించిన ప్రభుత్వం అని వివరించారు. కావున తెరాస పార్టీ బలపర్చిన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి కి మొదటిప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ముప్పారం సర్పంచ్ చీకటి ప్రవీణ్ గౌడ్, ఎంపీటీసీ కదిరే జగన్ గౌడ్, శ్రీరామగిరి పి ఏ సి స్ చైర్మన్ గుండా వెంకన్న, ఆలేరు సర్పంచ్ కాలేరు శ్రీవాణి శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఎస్కె షరీఫ్, మండలయువనాయకులు పోరండ్ల గణేష్, మద్దెల రాజేష్ గౌడ్,గంగాధర్, శ్రీరామగిరి పార్టీ అధ్యక్షులు డొనికెని శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు డొనికెని అశోక్ గౌడ్, ఆదూరి కళాధర్రాజు, పోరండ్ల సోమయ్య, గండి శ్రీనివాస్ గౌడ్, ఎస్కే మధార్, ఉప్పలయ్య,తదితరులు పాల్గొన్నారు.

తహశీల్దార్ నరసింహమూర్తి టీచర్ ఎం యల్ సి పోలింగ్ కేంద్రం పరిశీలన

 తహశీల్దార్ నరసింహమూర్తి టీచర్ ఎం యల్ సి పోలింగ్ కేంద్రం పరిశీలన

తాళ్ళపూడి, పెన్ పవర్

మంగళవారం నాడు కలెక్టర్  ఆదేశాల మేరకు తాళ్ళపూడి తహశీల్దార్ మరియు సహాయ ఎన్నికల అధికారి ఎం.నరసింహమూర్తి ఆధ్వర్యంలో టీచర్ ఎం యల్ సి ఓటింగ్ జరిగే పరస పద్మ రాజారావు జిల్లా పరిషత్ హైస్కూల్ లో మొదటి ఈ శాన్య గది మరియు టాయిలెట్లు, ఫర్నిచర్, ర్యాంప్, లైటింగ్, హెల్ఫ్ డెస్క్ మొదలగు అన్ని సౌకర్యాలను పరిశీలించి తగు సూచనలు స్కూల్ ఉపాద్యాయులకు ఇవ్వడం జరిగింది. వీరితోపాటు ఎయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు, ఉపాద్యాయులు ఉన్నారు. 14-03-2021 తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందని, ఉపాద్యాయులందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఏ ఎన్నికల గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలన్న, మా కార్యాలయానికి వచ్చి సహాయ గణాంక అధికారి జోడాల వెంకటేశ్వరరావు ను సంప్రదించమని తెలియజేసారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...