Followers

సి.డబ్ల్యు.సి. గోడౌన్ కార్మికుల ఉపాధిని పరిరక్షించాలి

 సి.డబ్ల్యు.సి. గోడౌన్ కార్మికుల ఉపాధిని పరిరక్షించాలి

పెన్ పవర్,తాడేపల్లిగూడెం

రాష్ట్రంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ కు చెందిన గోదాముల్లో పని చేస్తున్న జట్టు కూలీల ఉపాధిని పరిరక్షించాలని ఏ.ఐ.టి.యు.సి. జిల్లా గౌరవాధ్యక్షుడు డి.సోమ సుందర్ విజ్ఞప్తి చేశారు.స్థానిక సి.డబ్ల్యు.సి.గోడౌన్ లేబర్ యూనియన్ సర్వ సభ్య సమావేశం శుక్రవారం  గోదాముల ఆవరణలోని యూనియన్ ఆఫీస్ లో జరిగింది. యూనియన్ కార్యదర్శి ఎర్రగోగుల వీర్రాజు అధ్యక్షత వహించారు.డి.సోమ సుందర్ మాట్లాడుతూ కేంద్ర గిడ్డంగులసంస్థ గోదాముల్లో రాష్ట్ర  పౌరసరఫరాల సంస్థ   సరుకులను నిలవఉంచడం వల్ల ప్రభుత్వగోదాముల్లో పనిచేసే  జట్టు కార్మికులకు ఉపాధి లభిస్తున్నదన్నారు.అయితే కేంద్రగిడ్డంగుల్లో సరుకులు నిల్వఉంచే విధానాన్ని మార్చడానికి రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందని, దీనివల్ల కేంద్రప్రభుత్వ  గిడ్డంగుల్లో పనిచేసే జట్టు కార్మికులకు ఉపాధిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు.దీనిపై ఏ.ఐ.టి.యు.సి.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, ఉపప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో విజయవాడలో  కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నూ, ఇతర ఉన్నతాధికారులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లామని సోమసుందర్ వివరించారు. కార్మికుల ఉపాధికి దెబ్బ తగులకుండా స్టొరేజి విధానం ఉండాలని కోరారన్నారు.అధికారులు సానుకూలంగా స్పందించారని సోమసుందర్ తెలిపారు.ఉపాధిని కాపాడుకోవడానికి జట్టు కార్మికులు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని చేపట్టాలని కోరారు.ఏ.ఐ.టి.యు.సి. ఏరియా కమిటీ కార్యదర్శి ఓసూరి వీర్రాజు, మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తాడికొండ శ్రీనివాస రావు మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.యూనియన్ నాయకులు ఎర్ర గోగుల వీర్రాజు,  యాండ్రాపు  అర్జున, గోకా నాగరాజు, సురేష్, చంద్రరావు, ఏడుకొండలు, వెంకటేష్ తదితరులు మాట్లాడారు.

రోకలి బండతో భర్త ను కడతేర్చిన భార్య..

 రోకలి బండతో భర్త ను కడతేర్చిన భార్య..

ద్వారం వీధిలో దారుణం

 కుటుంబ కలహాలే హత్యకు కారణం అంటున్న పోలీసులు

 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న  వన్ టౌన్  ఎస్ ఐ

పెన్ పవర్,  విశాఖపట్నం

  కట్టుకున్న భార్య యే రోకలిబండతో భర్త  తలను పగులగొట్టి హత్య చేసిన సంఘటన  నగరంలో సంచలనం  లేపింది. వన్ టౌన్ పోలీసులు అందించిన వివరాలు  ఎలా ఉన్నాయి. నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో ద్వారం వారి వీధిలో గురువారం రాత్రి  భర్త తలపై భార్య రోకలిబండతో కొట్టి హత్య చేసింది. ద్వారం వీధిలో నివాసం ఉంటున్న పూసర్ల పుండరీకాక్షయ్య అతని భార్య సాయిరాం అలియాస్ పుణ్యవతి తరచూ ఘర్షణలు  వాడుతుండేవారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఇరువురు ఘర్షణపడ్డారు. ఘర్షణ తారస్థాయికి చేరడంతో  పుణ్యవతి రోకలి బండ తెచ్చి భర్త తలపై బలంగా మోగింది. ఈ సంఘటనలో  పుండరీకాక్షయ్య తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు సమాచారం అందడంతో వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి  పరిశీలించారు. స్థానికులను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు పుణ్యవతిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ హత్య వెనుక కారణాలు వెలుగు చూడాల్సి ఉంది. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నూతనంగా ఎన్నికైన మేయర్ గోలగాని హరి వెంకట కుమారికి పర్వీవ్ బాబీ సన్మానం

 నూతనంగా ఎన్నికైన మేయర్ గోలగాని హరి వెంకట కుమారికి పర్వీవ్ బాబీ సన్మానం

విశాఖ,పెన్ పవర్

విశాఖ ఇస్లామిక్ ఉమెన్స్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షురాలు పర్వీన్ బాబీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై  ప్రమాణ స్వీకారం చేసిన మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ని   మర్యాదపూర్వకంగా ఆమె నివాసంలో కలిసి మెమొంటో ఇచ్చి సన్మానించడం జరిగింది.

నగర అభివృద్ధి సేవా సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సిహెచ్ రాజు బాబు నియామకం

 నగర అభివృద్ధి సేవా సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సిహెచ్ రాజు బాబు నియామకం

మహారాణి పేట, పెన్ పవర్

ఆంధ్ర ప్రదేశ్ నగర అభివృద్ధి సేవా సంఘం (ఎన్.ఏ.ఏస్.ఏస్) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా విశాఖపట్నం నుంచి సిహెచ్ రాజు బాబు ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్ల భాషా ప్రకటించి ఒంగోలులో నియామక పత్రం అందజేసినారు.ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి ఎంతో కీలకమైన బాధ్యతలు అప్పజెప్పి నందుకు సిహెచ్ రాజబాబు అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో అభివృద్ధే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మరియు ముఖ్యంగా విశాఖపట్నం నగర అభివృద్ధికి కృషి చేస్తానని ఒక ప్రకటన ద్వారా తెలియజేసినారు.

జర్రెల సర్పంచ్ లలిత గుండె పోటుతో మృతి

 జర్రెల సర్పంచ్ లలిత గుండె పోటుతో మృతి

సకాలంలో అంబులెన్స్ రాక ఆమె మృతి చెందిందని బంధువుల ఆరోపణ..

సర్పంచైన నెలరోజులకే లలిత మృతితో శోకసంద్రంలో జర్రెల గ్రామం..

ముంచంగిపుట్టు, పెన్ పవర్

ముంచంగిపుట్టు మండలంలోని జర్రెల  పంచాయతీకి చెందిన నూతన సర్పంచ్ వంతాల లలిత (37) గుండె పోటుతో మృతి చెందారు.గురువారం రాత్రి పది గంటల సమయంలో ఆకస్మికంగా  గుండె పోటు రావడంతో ఆమె మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల అందించిన వివరా లు ఇలా ఉన్నాయి...గురువారం రాత్రి 10గంటల సమయంలో వంతాల లలిత(37)కు ఆకస్మికంగా గుండె పోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెెెెెెె వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అయితే సమాచారం ఇచ్చినప్పటికీ అంబులెన్స్ సకాలంలో రాలేదు. దీంతో గమనించిన కొంతమంది బంధువులు ఆగమేఘాలతో మండల కేంద్రానికి వెళ్లి ప్రైవేట్ ఆటో బుక్ చేసుకొని జర్రెల గ్రామానికి వెళ్లి సర్పంచ్ వంతాల లలితను హుటాహుటిన మండల కేంద్రంలో గల సిహెచ్ సి కు తరలించారు. అయితే అప్పటికి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.  అంబులెన్స్ అందుబాటులో లేకపోవడమే లలిత మృతికి కారణమని, సకాలంలో అంబులెన్స్ అందుబాటులో ఉంటే లలిత ప్రాణాలు కాపాడుకో గలవారని కుటుంబ సభ్యులు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 17న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ తరఫున పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించింది. జర్రెల సర్పంచిగా పదవి చేపట్టి కనీసం ఏడాది కాకుండానే అనంతలోకాలకు వెళ్లడం ఆ పంచాయతీ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సిపిఎం పార్టీ నుంచి ఎన్నో పోరాటాలు చేసి పంచాయతీ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి రెండు పర్యాయాలు సిపిఎం పార్టి నుంచి సర్పంచ్ గా గెలిచిన ఘనత ఆమెకె సొంతం.  నూతన సర్పంచ్ అకాల మరణంతో జర్రెల గ్రామం శోకసంద్రంలో మునిగి పోయింది.

శ్రీ వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు.. ఉచితంగా కరోనా వ్యాక్సిన్

 శ్రీ వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు.. ఉచితంగా కరోనా వ్యాక్సిన్

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ, వన్టౌన్లో ఉన్న శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ 50 మంది నిరుపేద వయోవృద్ధులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించింది.వీరితో పాటు వివేకానంద అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు కూడా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించింది.మరో 200 మంది నిరుపేద వయోవృద్ధులకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేయనున్నట్లు సంస్థ కార్యదర్శి వాసుపల్లి ఉమాదేవి మీడియా సమావేశంలో వెల్లడించారు.కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధులందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆమె తెలియజేశారు.

కరోనా వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహలు వద్దని, ఎటువంటి వద్ధతులను నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.పలువురు దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రముఖ సంఘసేవకులు జహీర్ అహ్మద్ ఆసుపత్రిలో వీరికి వ్యాక్సిన్ వేయించడం జరిగిందన్నారు.మనసున్న దాతలు మరికొంతమంది ముందుకు వస్తే..నిరుపేద వృద్ధులకు ఉచితంగా వ్యాక్సిన్ వేయించడం జరుగుతుందని దాతలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఒక్కో వృద్ధుడికి రెండు దఫాలుగా వ్యాక్సిన్ వేయించడానికి కేవలం 500 రూపాయలు ఖర్చు అవుతుందని అందుకు దాతలు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో భవాని, నాగమణి, సుజాత, రాణి తదితరులు పాల్గొన్నారు.

నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో గిరిజన గ్రామాలకు మోక్షం లేదా..

 నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో గిరిజన గ్రామాలకు మోక్షం లేదా..

పెన్ పవర్ బ్యూరో,విశాఖపట్నం

నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో గిరిజన గ్రామాల్లో గిరిజనుల సమస్యలుకు ప్రభుత్వ పూర్తిగా మోక్షం కలిగించాలని  ఆంధ్రప్రదేశ్ వ్వవసాకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి,వెంకన్న డిమాండ్ చేసారు  అయిన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు జిల్లా లోని నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో పోడు  పారేస్టు భూములకు పట్టాలు ఇవ్వకుండా గిరిజనులను ఆధికారులు ఆపీసులు చుట్టుతీప్పుతున్నారని తెలిపారు,మొదట  2020 ఆగస్టు తొమ్మిదో తేదీన  ఆదివాసుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ 11 మండలాలు తో పాటు నాన్ షేడ్యూల్డ్ఏరియా మండలాల్లో కూడా ఆదివాసులకు  అటవీ హక్కుల చట్టం ప్రకారం ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు,

వీరితోపాటు నాన్ షెడ్యూల్ ఏరియా మండలాలు అయిన  దేవరాపల్లి చీడికాడ వి ,మాడుగుల రావికమతం రోలుగుంట గోలుగోండ నాతవరం కోటవురట్ల నర్సిపట్నం  మండలాల్లో వేలాది ఎకరాల్లో గిరిజనులు అటవీ ఫారెస్ట్ భూములు సాగు చేస్తున్నారని తెలిపారు విరికి అందరికీ సర్వే పూర్తి చేసిన పట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని తెలిపారు దీని వలన ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు స్కీములు అందడం లేదన్నారు దీంతో అనేక గ్రామాలకు రోడ్లు సౌకర్యాలు లేక ఆనారోగ్యంతో బాధపడుతున్నవారికి డోలి మోతలు తప్పడం లేదన్నారు,ఇప్పటికి పూరీగుడిసెల్లో మగ్గిపోతున్నారని తెలిపారు,ఐదవషేడ్యూల్ చేరుస్తామి గ్రామసభలు పెట్టి నీరుగార్చారని అన్నారు దీని వలన 1/70 చట్టం వర్థించక పోవడం గిరిజన భూములుకు రక్షణ లేకుండా పోవడం ఉద్యోగాల్లోను ఉపాధి అవకాశాలుకు దూరమోతున్నారని అన్నారు వెంటనే నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాల్లో సమస్యలుకు వెంటనే మోక్షం కలించాలని వెంకన్న డిమాండ్ చేసారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...