Followers

బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిరసన

 బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిరసన

పెన్ పవర్ , మల్కాజిగిరి 

గత మూడు రోజుల ముందు హుజూర్ నగర్ పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఐ.పి.ఎస్. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, స్వేరోలను కులం పేరుతో దూషించి కార్యకర్తలతో దాడి చేయించినందుకు నిరసనగా శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మిర్జల్ గూడ చౌరస్తాలో (టి.ఎస్.పి.ఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ఆనంద్ ఆధ్వర్యంలో ప్లకార్డు పట్టుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, స్వేరోలకు బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ ఆనంద్ మాట్లాడుతూ గురుకులల ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్న ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ పై కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం  అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో విద్యార్థిని జాహ్నవి, నర్సింగ్ రావు, మైత్రినాథ్, బిక్షపతి, జై భీమ్ రామచంద్రన్, పటేల్ నర్సింగ్, నర్సింగ్ రావు, అమర్, అరుణ్ కుమార్, కుమార్ షను, మనోజ్, ఇంతియాజ్, కవిత, లీలావతి, ఉపేందర్, ఎమ్మార్పీఎస్ రామచందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా షెడ్డు నిర్మాణం

 అక్రమంగా షెడ్డు  నిర్మాణం

పెన్ పవర్,  మల్కాజిగిరి

 నాగారం మున్సిపల్ పరిధిలోని నాగారం కమాన్ వద్ద అక్రమంగా షెడ్డు నిర్మాణించారు, కొద్ది రోజుల క్రితమే నాగారం మున్సిపల్ అధికారులు నిర్మాణ పనులను నిలిపివేయించారు. షెడ్డు యజమాని మళ్లీ యథేచ్చగా షెడ్డు నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. అక్రమంగా నిర్మాణం చేపడుతున్నా వారి పై అధికారులు కఠిన చర్యలు తీసుకొవాలని స్దానికులు కొరుతున్నారు.

సెల్ టవర్ వద్దని వినతిపత్రం

 సెల్ టవర్ వద్దని వినతిపత్రం

పెన్ పవర్,  మల్కాజిగిరి

 గౌతంనగర్ డివిజన్ లోని  జనావాసాల మధ్య సెల్ ఫోన్ టవర్ వద్దని  మల్లికార్జున నగర్ లో టి.ఆర్.ఎస్ నాయకులు రాముయదవ్  కాలనీవాసులు చీఫ్ సిటీ ప్లానార్ దేవందర్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. సెల్ టవర్  వద్దని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చిప్ సిటీ ప్లానార్ తో ఫోన్ లో మాట్లాడారు, సెల్ ఫోన్ టవర్ ద్వారా ప్రజలకు రేడియేషన్ తో, అనారోగ్యనాకి దారి తీసి ఇబ్బందులు ఎదురుకొనవలసి వస్తుందని వెంటేనే సెల్ టవర్ పనులు ఆపాలని అధికారులకు తెలిపారు.  ఈ కార్యక్రమంలో కాలని వాసులు నాయకులు పాల్గొన్నారు.

ఆడబిడ్డలందరికి పెద్దన్న కేసీఆర్

 ఆడబిడ్డలందరికి పెద్దన్న కేసీఆర్

లక్షెట్టిపెట్, పెన్ పవర్

పేదింటి అడబిడ్డలందరిని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నాల అందుకుంటున్నారు అని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు.పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద పట్టణంతో పాటు మండలంలోని లబ్ధిదారులకు మంజూరు అయిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏ ప్రభుత్వాలు చేయని పనులు దేశంలో ఎక్కడా లేని కొత్త కొత్త సంక్షేమ పథకాలు పెట్టి తెలంగాణ రాష్టంను అన్ని విధాలుగా అభివృద్ధి పథకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుపోతున్నారన్నారు. గతంలో ఆడపిల్ల పుట్టిందంటే తల్లిదండ్రులు తలబాదుకునే రోజులు ఉండేవని కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆడబిడ్డ పెండ్లికి తన వంతుగా కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకలు పెట్టి లక్ష రూపాయలు పైగా ఇవ్వడం జరుగుతుందన్నారు.ఏ రాష్టంలో లేని పథకం ఈ కళ్యాణ లక్ష్మి పథకం అన్నారు.బిడ్డ పుట్టిన నుండి చదువు పెండ్లి ఉదోగ్యం వరకు అడ్డబిడ్డలకు అనుకోని రీతిలో పథకాలు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని మన టీఆర్ఎస్ పార్టీది అన్నారు.ఒక కళ్యాణ లక్ష్మి కాకుండా రైతు బీమా,కుల వృత్తులను ప్రోత్సహించడం ఎన్నో పథకాలు పెట్టి రాష్టంను అంచలంచలుగా ముందుకు తీసుకుపోతుంటే గిట్టని పార్టీలు లేని పోనీ మాటలు అనడం సరికాదన్నారు. మాటలు జరుతున్న నాయకులకు ప్రజలు దేవుడే బుద్ది చెబుతారన్నారు.అనంతరం సుమారు వందుకు పైగా చెక్కలను లబ్దిదారులకు అందజేశారు.ఈ డీసీఎంఎస్ చెర్మాన్ తిప్పని లింగన్న, జెడ్పిటిసి ముత్తె సత్తయ్య,మున్సిపల్ చెర్మాన్ నల్మాస్ కాంత్తయ్య,వైస్ చెర్మాన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్,మార్కెట్ కమిటీ చెర్మన్ సంధ్యాజగన్మోహన్ రెడ్డి,తహసీల్దార్ రాజుకుమార్,డిప్యూటీ తహసీల్దార్ హరిత,కౌన్సలర్లు ఒరగంటి శ్రీకాంత్,మెట్టు కళ్యాణిరాజు,చాతరాజు రాజన్న,వివిద గ్రామాల సర్పంచ్లు ఎంపిటిసి లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

లక్షెట్టిపెట్, పెన్ పవర్

పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగం పట్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో గత సంవత్సరం కంటే విద్యారంగానికి నిధులు తగ్గాయన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి విద్యారంగానికి కేటాయించే కేటాయింపులు చూస్తే విద్యారంగం పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి అర్ధం అవుతుందని విమర్శించారు. ప్రతీ నియోజకవర్గనికి ఒక పాలిటెక్నిక్ కాలేజ్,ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్,రాష్టంలో ఒక ట్రైబల్ యూనివర్సిటీ,టెక్నీకల్ యూనివర్సిటీల అభివృద్ధి, గురుకులకు స్వంత భవనాల నిర్మాణాన్ని విస్మరించాలని అన్నారు.రాష్ట్ర బడ్జెట్ లో విద్యరంగానికి అన్యాయం జరుగుతుందని, విద్యారంగ అవసరాలకు ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్  ఏ మాత్రం  సరిపోదని,విద్యరంగానికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా  ఆందోళనలు చెపటునట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సంతోష్, నరేష్,ప్రవీణ్,సురేందర్, తదితరులు పాల్గొన్నారు. 

ఏరియా ఎస్టీ వెల్ఫేర్ నూతన కార్యవర్గం ఎన్నిక

 ఏరియా ఎస్టీ వెల్ఫేర్ నూతన కార్యవర్గం ఎన్నిక





మందమర్రి,  పెన్ పవర్ 

సింగరేణి సంస్థ మందమర్రి ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో ఏరియా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు బానోతు కర్ణ, ఉపాధ్యక్షులు తేజావత్ హీరియా, నాయకులు వి శివ, ఏరియా లైజన్ అధికారి మధుసూదన్ హాజరయ్యారు. మందమర్రి ఏరియా అధ్యక్షునిగా బుక్యా సుమన్, ప్రధాన కార్యదర్శిగా ఆమ్గోత్ రవికుమార్, ముఖ్య సలహాదారునిగా వి బిక్షమయ్య, సలహాదారులుగా కే తారాచంద్, గౌరవ అధ్యక్షులుగా బుక్యా రాంబాబు, బుక్యా దేశాయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బానోతు తిరుపతి, ఉపాధ్యక్షులుగా బుక్యా రాములు, పాయం వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులుగా బానోతు నాగేశ్వరరావు, కే సాయి తేజ, జాయింట్ కార్యదర్శులుగా మాలోతు బాలు, బుక్యా హరి నాయక్, జే కిట్టు, ఆర్ జీవన్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఐ నరేంద్ర కుమార్, ఎల్ బాలాజీ, కె హనుమంతు, బి రాజేందర్, కోశాధికారిగా జి బాలాజీ, జాయింట్ కోశాధికారి జే శ్రీనివాస్, ఆఫీస్ కార్యదర్శులుగా బి వీరు, జే రామదాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

భూర్కి గ్రామాన్ని సందర్శించిన రెడ్ క్రాస్ సొసైటీ బృందం సభ్యులు

 భూర్కి గ్రామాన్ని సందర్శించిన రెడ్ క్రాస్ సొసైటీ బృందం సభ్యులు...


ఆదిలాబాద్ , పెన్ పవర్ 

 ఆదిలాబాద్ మండలం భూర్కి గ్రామానికి గవర్నర్ ఆదేశాల మేరకు శుక్రవారం  రెడ్ క్రాస్ సొసైటీ బృందం పర్యటించరు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలకు తాగడానికి నీళ్లు ఊరి బయట ఉన్నటువంటి బావి నుంచి నీళ్లు తెచ్చుకొని తాగడంతో గర్భిణీలు, చిన్నపిల్లలు ఆ నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని రెడ్ క్రాస్ సొసైటీ బృందానికి గ్రామస్తులు తెలిపారు. గర్భిణీలు ఆస్పత్రికి వెళ్దాం అంటే రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కి  20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బూర్కీ గ్రామ ప్రజలు ఆసుపత్రులకు వెళ్దాం అంటే సరిగ్గా రోడ్డు సౌకర్యం లేక గర్భవతులకు గానీ చిన్న పిల్లలకు జ్వరం వస్తే వెళ్దాం అంటే బస్సు సౌకర్యం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆవేదన రెడ్ క్రాస్ సొసైటీ బృందానికి తెలియజేయడం జరిగింది.వారికి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎస్. గంగేశ్వర్,తో పాటు స్టేట్ ఎంసి మెంబర్ విజయ్ బాబు,మేకల వెంకటస్వామి,అడ్వైజర్ అయ్యుబ్,బేలా మండల్ కోఆర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి, అప్పాల కిషన్ రావు,దినేష్ గౌడ్, వారి సమస్యలు తెలుసుకుని గవర్నర్ దృష్టికి తీసుకువెళతామని వారికి రెడ్ క్రాస్ సొసైటీ బృందం భరోసా నిచ్చారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...