Followers

20 వేల రూపాయల టెంట్ టేబుల్స్ బహుకరణ

 20 వేల రూపాయల టెంట్ టేబుల్స్ బహుకరణ

పెన్ పవర్,ఆత్రేయపురం

ర్యాలీ స్థానిక అనుస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి శనివారం  నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార కార్యక్రమానికి రావులపాలెం కి చెందిన కేఎస్ఆర్ టెంట్ హౌస్ అధినేత వెలగల కాశీ విశ్వేశ్వర  రెడ్డి 20 వేల విలువచేసే టెంట్ హౌస్ సామానం అందజేశారు అనంతరం స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద పడాల సూర్యనారాయణరెడ్డి సారధ్యం ర్యాలీ  జగన్మోహిని కేశవ స్వామి గుడికి కాలినడకన వచ్చే భక్తులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూఅల్పాహారము అందించారు ఈ కార్యక్రమంలో గొలుగూరి ఆదిరెడ్డి మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు.

32వవార్డులో దోమ తెరల పంపిణీ ముఖ్యఅతిథిగా వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు

 32వవార్డులో దోమ తెరల పంపిణీ ముఖ్యఅతిథిగా వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు

మహారాణి పేట, పెన్ పవర్


అల్లిపురం మార్కెట్ మేడపైన మలేరియా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శనివారం దోమ తెరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు హాజరయ్యారు ఆయన చేతుల మీదగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి మురికివాడలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దోమలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అలా పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తూ మరియు దోమతెరలు కూడా వాడాలని అందుకే ప్రభుత్వం వారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దోమతెరలు పంపిణీ చేపట్టిందని వీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మలేరియా డిపార్ట్మెంట్ వారు సచివాలయం సిబ్బంది మరియు పార్టీ కార్యకర్తలు వరలక్ష్మి ఉమా,జానకి, లారా,పుట్నాల రమేష్,నీల బాబు,కిషోర్  మొదలైన వారు పాల్గొనడం జరిగినది.

రెల్లి కులస్తులకు ప్రాధాన్యత కల్పిస్తోన్న సీఎం జగన్ కు ధన్యవాదాలు

 రెల్లి కులస్తులకు ప్రాధాన్యత కల్పిస్తోన్న సీఎం జగన్ కు ధన్యవాదాలు

విశాఖపట్నం, పెన్ పవర్

ఎన్నో ఏళ్లుగా దళితుల్లో దళితులుగా అణగారిన వర్గాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ  రెల్లి కులస్తులను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి రాజకీయరంగంలో సముచిత స్థానం కల్పిస్తో నందుకు రాష్ట్ర వ్యాప్త రెల్లి కులస్తుల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం  రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి, చిన్న వాల్తేర్ లోని రెల్లివీధి గ్రామ అధ్యక్షుడు డాక్టర్. చెన్నా గౌరీ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా రెల్లి కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పిటిసి, కార్పొరేటర్ టికెట్లను అధికశాతం తమ ఎస్సి రెల్లి కులస్తులకు కేటాయించడమే కాకుండా వారిని గెలిపించినందుకు రెల్లి కులస్తులు అందరూ వైఎస్ఆర్సిపి పార్టీకి రుణపడి ఉంటామన్నారు. ఇంతకు మునుపు వైయస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలోనే రెల్లి కులస్తుల అభివృద్ధి సాధ్యపడిందన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆదరిస్తున్న జగన్ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలుస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, విశాఖ నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఇతర సీనియర్ నాయకుల అండదండలతో రెల్లి కులస్తులకు మునుముందు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని డాక్టర్. చెన్నా గౌరీశంకర్ ఆశాభావం వ్యక్తపరిచారు.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

 ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

ఇటీవలే జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వై సి పి అత్యధిక వార్డులలో విజయం సాధించిన సందర్భంగా ఈరోజుఉదయం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు  ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా  కె కె రాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం మరియు విశాఖ అభివృద్ధి కి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వలనే జీవీఎంసీ ఎన్నికల్లో  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది మేయర్ పీఠం దక్కిందని, అలాగే యాదవ మహిళలకు మేయర్ పీఠాన్ని ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రికి దక్కుతుందని  అన్నారు. 

ఈ సందర్భంగా యాదవ నాయకులు మాట్లాడుతూ యాదవులలో మహిళకు ఈ మేయర్ ఇవ్వటం పై మేము పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేట్ లు,మాజీ కార్పొరేట్ లు వార్డు అధ్యక్షులు, గువ్వల చంద్రశేఖర్ యాదవ్,మరియు సీనియర్ నాయకులు,కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

చైర్మెన్, వైస్ చైర్మన్ మరియ పాలకవర్గానికి ఘన స్వాగతం పలికిన కమిషనర్ సుధాకర్

చైర్మెన్, వైస్ చైర్మన్ మరియ పాలకవర్గానికి ఘన స్వాగతం పలికిన కమిషనర్ సుధాకర్

పెన్ పవర్, కొవ్వూరు

 కొవ్వూరు పురపాలక సంఘ ఎన్నికలు జరిగిన తరువాత ఎన్నికయిన పాలక వర్గం మొట్ట మొదటి సారిగా కొవ్వూరు ము న్సిపల్ చైర్మన్ భావన రత్నకు మారి, కొవ్వూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మన్నే పద్మ , కౌ న్సీ లర్లకు పూర్ణ కుభంతో శనివారం మునిసిపల్ కమిషనర్ కే.టి. సుధాకర్ ఘన స్వాగతం ప లికారు. తదనంతరం పుర పాలక సంఘ సిబ్బంది, పాల కవర్గం తో రత్న కుమారి సమా వేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా రత్నకు మారి మాట్లాడుతూ కుల, మత, పార్టీలకు అతీతంగా కొవ్వూరు మునిసిపాలిటీ నీ అభివృద్ధి పథం లో నడిపిస్తా మన్నా రు.వార్డుల్లో పారిశుధ్య కార్మికుల తో ప్రతీ రోజు పారిశుద్ధ్య ము మెరుగు పరిచే విధంగా చర్య లు తీసుకుంటామని తెలిపారు. దోమలు రాకుండా ఎప్పటి కప్పుడు డ్రైనేజీ లను సుబ్ర పరిచే విధంగా చర్యలు తీసు కోవడం జరుగుతుందని అన్నా రు. త్రాగునీరు, వీధి దీపాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రజల కు ఏటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుం టామని అన్నారు. ఈ సందర్భంగా మునిసిపల్ వై.ఎస్. చైర్ పర్సన్, మన్నే ప ద్మ మాట్లాడుతూ సీనియర్ నా యకుల సలహాలు, సూచనలు తీసుకొని  మునిసిపా లిటిని సుందర పట్టణ ము గా తీర్చి ది ద్దు తామని అన్నారు.ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్, కే.టి.సుధాకర్, మా ట్లాడుతూ త్వరలో  4 కోట్ల రూపా యల ఔ ట్ ఫాల్ డ్రైన్ లు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కో విడు స్త్రయి న్ వైరస్ రాజ మండ్రి లో 13 కేసులు నమోదు అయ్యాయని, కొవ్వూరు లో 1 నమోదు అయ్యాయని అన్నా రు. ప్రజలు అప్రమత్తం గా ఉం డాలని అన్నారు. మాస్క్ సాని టేజ ర్, భౌతిక దూరం తప్ప నిసరి గా పాటించాలని అన్నా రు. ఈ కార్యక్రమములో వార్డు కౌన్సిలర్ల లు, మునిసిపాలిటీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నా రు. 

మాలసింగారం లో తాగునీటి సమస్య పై స్పందించిన ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి

 మాలసింగారం లో తాగునీటి సమస్య పై స్పందించిన ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి

 పరిశీలిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ ఏ.ఈ గ్రామపంచాయతీ సర్పంచ్

ధన్యవాదాలు తెలిపిన యువజన కాంగ్రెస్ నాయకుడు మొస్య ప్రేమ్ కుమార్

అరకు, పెన్ పవర్

 అరకువేలి మండలం చినలబుడు గ్రామపంచాయతీకి చెందిన మాలసింగారం గ్రామంలో తాగునీటి సమస్యపై అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి వారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో 18-03-2021న గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామ మహిళలు యువత నిర్వహించిన నిరసన కార్యక్రమన్ని పత్రిక ప్రకటనల ద్వారా సమస్యను గుర్తించి ఐ.టి.డి.ఎ ప్రాజెక్టు అధికారి వారు ఆర్డబ్ల్యూఎస్ ఏ.ఈ  మహేష్ ద్వారా మొస్య ప్రేమ్ కుమార్ మొస్య దేవదాసు ఆధ్వర్యంలో చినలబుడు గ్రామపంచాయతీ సర్పంచ్  ఉపేంద్ర  మాలసింగారం గ్రామంలో తాగునీటి అవసరాలకు కావలసిన పరిష్కార మార్గాలను పరిశీలించడం జరిగింది, తక్షణమే దీనిపై చర్యలు తీసుకుంటామని సర్పంచ్ గారు ఆర్డబ్ల్యూఎస్ ఏ.ఈ  గ్రామస్తులకు హామీ  ఇవ్వడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో భాగంగా పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వారిని ఆర్డబ్ల్యూఎస్ ఏ.ఈ ని గ్రామ పంచాయతీ సర్పంచి ని ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన వివిధ పత్రిక సోదరులకు (రిపోర్టర్స్)లకు గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరపున  యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ధన్యవాదాలు తెలపడం జరిగింది,ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్ మొస్య అర్జున్ సుంకరి బాలమురళి, మొస్య బుజ్జి బాబు, లోకోయి లక్ష్మణ్ రావు, గరం పూర్ణ,  కిల్లో నాగేశ్వరరావు, బీసోయి ముకుంద్, గ్రామ ప్రజలు మహిళలు యువత తదితరులు పాల్గొనడం జరిగింది.

జల సంరక్షణ - జన సంరక్షణ

 జల సంరక్షణ - జన సంరక్షణ 

పెన్ పవర్,ఆత్రేయపురం 

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చి 20 వ తేదీ నుండి పదిరోజులపాటు అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి జలవనరుల నిర్వాహణ కొరకు జలసంరక్షణ   కార్యక్రమాలను నిర్వహించాలని ఆత్రేయపురం ఎంపీడీఒ నాతి బుజ్జి  తాహశిల్దార్ ఎం రామకృష్ణ అందరు పంచాయతీ కార్యదర్శులు   సిబ్బందిని ఆదేశించారు.మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం  మండల  స్థాయిలో సిబ్బందికి అవగాహనా సదస్సులను, మద్యాన్నం ఆయా గ్రామ పంచాయతీలలో నూతన సర్పంచులు,  వార్డు సభ్యులకు  అవగాహన సదస్సు లు నిర్వహించామని వారు తెలిపారు. 

జల సంరక్షణ లో భాగంగా :గ్రామంలో మంచినీరు ఓవర్ హేడ్ టాంక్,మంచినీటి చెరువులు, వాల్వ్  చాంబర్లు శుభ్రపరుచుట, వద్ద తుప్పలు నరికించుట, గ్రామంలో పైప్ లైను లీకులు గుర్తించి రిపేర్ చేయించుట, అవసరమైన గేట్ వాల్వులు మార్చుట, గ్రామంలో అన్నిప్రాంతాలు నడిచి మంచినీటి పొదుపుపై  అవగాహన  శుక్రు వారం డ్రై డే పాటించుటపై అవగాహన, మంచినీటి కిట్ల వినియోగంపై అవగాహన  మంచి నీటీ పరీక్షలపై ప్రాథమిక అవగాహన, గ్రామంలో వివిద ప్రాంతాలలో కుళాయిలనుండి , చెరువుల త్రాగునీటి బోరింగ్ ప౦పుల నుండి సాంపిల్స్ సేకరించి కిట్లద్వారా ఎనిమిది ప్రామాణిక అంశాలపై పరిక్షలు హెల్త్  ఇంగినీరింగ్ అసిస్టెంట్ల ద్వారా చేయించి నీటి క్వాలిటీ పై అవగాహన పెంచుకొనుట తదితర కార్యక్రమాలను ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాదికారి డా.శ్రీనివాసవర్మ, పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్, ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ , పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...