Followers

పానీపూరి అమ్మే వ్యక్తిపై ఆర్ఎంపీ డాక్టర్ దాడి

 పానీపూరి అమ్మే వ్యక్తిపై ఆర్ఎంపీ డాక్టర్ దాడి...


నార్నూర్, పెన్ పవర్

 పానీ పూరి అమ్మే వ్యక్తిపై ఓ ఆర్ఎంపీ డాక్టర్ దాడి   చేసి గాయపర్చిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి (కె) లో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా గ్రామంలో అద్దెకు నివసిస్తున్నామని అయితే తాము ఉంటున్న ఇంటిని ఖాళీ చేసేలా ఇంటి యజమాని పై ఆర్ఎంపీ డాక్టర్ ఇమ్రాన్ ఒత్తిడి తీసుకురాగా ఇలా ఎందుకు చేస్తున్నారని ఇమ్రాన్ ను అడగడానికి వెళ్లగా తమ దంపతులు ఇరువురుని కట్టెతో, చెప్పులతో దాడి చేసాడని వారు వాపోయారు. చిరు వ్యాపారం చేసుకునే మాపై కక్ష కట్టి దాడి చేసిన ఆర్ఎంపీ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.

శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

 శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం...


ఇంద్రవెల్లి, పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనగ కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ ప్రారంభించారు.ముందుగా కంటాకు మండల ప్రజాప్రతినిధులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం శనగ కొనుగోళ్ళను ప్రారంభించారు. తోలుత మొదటి రైతును శాలువాతో సత్కరించారు. అనంతరం ఇంద్రవెల్లి మరియు సిరికొండ మండలాలలోని 30 మంది అర్హులైన లబ్బిదారులకు మంజురైన కళ్యాణ లక్ష్మి చెక్కులను వారికి అందజేశారు.ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ మాట్లాడుతు తెలంగాణ ముఖ్యమంత్రి రైతులకు అండగా ఉంటు రైతు బందు రైతు భీమాతో పాటు నేడు రైతులు పండించిన పంటలను సైతం కొనుగోలు చేస్తు అదుకుంటున్నారని, నేడు ఇంద్రవెల్లిలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మండల రైతుల శనగలను కొనుగోలు చేయడం జరుగుతుందని, ఇక మరోపక్కా నేడు ఇంద్రవెల్లి మండలానికి చెందిన 27 మందికి, సిరికొండ మండలానికి చెందిన (3) ముగ్గురికి మొత్తం 30 మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించడం జరిగిందని, పుట్టిన ఆడబిడ్డ నుండి వారి పెళ్ళిళ్ళ వరకు తెలంగాణ ప్రభుత్వం,  రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని, కేసిఆర్ కిట్ తో పాటు కళ్యాణ లక్ష్మి,  షాది ముబారక్ పథకాలను ఆడపడుచులకు అందిస్తు ఆదుకుంటున్నారని,  ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలందరికి అందిస్తు ముఖ్యమంత్రి కేసిఆర్ అందరి బాందవుడిగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి సర్పంచ్ కొరెంగ గాంధారీ, జడ్పిటిసి అర్క పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్మెన్ రాథోడ్ మోహన్, ఇంద్రవెల్లి-ఉట్నూర్ పిఎసిఎస్ చైర్మెన్లు మారుతి డోంగ్రే,  ఎస్పి రెడ్డి, జడ్పి కో ఆప్షన్ సభ్యుడు అంజద్, ఇంద్రవెల్లి-ఉట్నూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పెందూర్ హరిదాస్, అజిమొద్దీన్, ఎంపిటిసిలు స్వర్ణలత మహెష్ కదం, అశాబాయి, పిఎసిఎస్ డైరెక్టర్ దిలిప్ మోరే, ఉప సర్పంచ్ టెహెరె గణేష్,మార్క్ ఫేడ్ డిఎం పుల్లయ్య, ఏఓ రాథోడ్ గణేష్, పిఎసిఏస్ సిఈఓ ధరమ్ సింగ్, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక రైతులు పాల్గొన్నారు.

కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

 కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ...

బోథ్, పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల  కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు 34  కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న గొప్ప కానుక కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకమని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ మెంబర్ తాహెర్ బిన్  సలాం, ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్, సర్పంచ్ సురేందర్ యాదవ్, వెంకట రమణ గౌడ్ ,ఉమేష్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.

ప్రయాణ ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభం

 ప్రయాణ ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభం...

బోథ్, పెన్ పవర్

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను శుక్రవారం బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావ్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాసం అనిల్ తన తల్లి జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అని సమాజ సేవలో యువత ఎప్పుడూ ముందంజలో ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాసం నారాయణ, మాసం అనిల్, సర్పంచ్ సురేందర్ యాదవ్, జడ్పి కోఆప్షన్ మెంబర్ తాహెర్ బిన్ సలాం, సిఐ నైలు, ఎస్ఐ పి. రాజు,గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్, ఎలక రాజు, వెంకటరమణ గౌడ్, ఆర్టీసీ కంట్రోలర్ సాయన్న తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ షర్మిల కు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గుప్తా

 వైఎస్ షర్మిల కు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గుప్తా

పెన్ పవర్,  మల్కాజిగిరి 

స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమర్తె వైఎస్ షర్మిల కు వై.ఎస్.ఆర్.సీపి రాష్ట్ర కార్యదర్శి తడక జగదీశ్వర్ గుప్తా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం లోటస్ పాండ్ లోని కార్యాలయంలో వైఎస్ షర్మిలను కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గుప్తా మాట్లాడుతూ క్రీస్తు చూపిన విధంగా సర్వ మానవ సౌబ్రాతృత్వము, సాటి మానవుల పట్ల ప్రేమ, దయ కలిగిన మహోన్నత వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి తనయగా షర్మిల సైతం అంతే ప్రేమ, దయ కలిగి ఉన్నారని అన్నారు. యేసు క్రీస్తు అనుగ్రహముతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ప్రజల కష్టాలను తొలగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

కెసిఆర్ పాలనలోనే తెలంగాణ బీడు భూములు అన్ని సస్య శ్యామలం

 కెసిఆర్ పాలనలోనే తెలంగాణ బీడు భూములు అన్ని సస్య శ్యామలం

ఎమ్మెల్యే రెడ్యా నాయక్

చిన్నగూడూరు,  పెన్ పవర్

చిన్న గూడూరు .మండల కేంద్రంలో శుక్రవారం నాడు దశాబ్దాలుగా ఎదురుచూసిన కాళేశ్వరం ప్రాజెక్ట్  ఆవిష్కృతమై తెలంగాణలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం అయ్యాయని డోర్నకల్ శాసన సభ్యులు రెడ్యా నాయక్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి సాగు, తాగు నీటితో తెలంగాణ సస్యశ్యామలం అయ్యేలా సంకల్పిస్తూ జాతికి అంకితం చేశారని కొనియాడారు.శుక్రవారం నాడు ఉగ్గం పల్లి గ్రామం పరిధిలోని వివిధ కాలువలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెర్రెలు బారిన తెలంగాణా బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక యజ్ఞంలా నిర్మించడం జరిగిందని అన్నారు. ఇది ప్రపంచం లొనే అతి పెద్ద సాగు,త్రాగు నీటి ప్రాజెక్టు అని అన్నారు. రైతుల గోసలు తెరిచేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టి స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది అని ఇది ప్రాణహిత,గోదావరి, నదుల సంగమం వద్ద కలిసే ఇంద్రవతి నాధుల్స్ సంగమాం వద్ద నిర్మితమైనది ఈ ప్రాజెక్గ్ అన్నారు. ఏర్పాటు చేశారని ఈ నదుల జలాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 195 టీఎంసీ ల్. నీటిని వెనుక బడిన ప్రాంతాలకు తరలించారని అన్నారు.అంతే కాకుండా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే స్వయంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నదని అన్నారు. రైతులు పండించిన పంట దళారుల పాలు కాకుండా ప్రతి గింజను కొనుగోలు చేసిన ఘనత తెరాస ప్రభుత్వ గొప్పతనమని కొనియాడారు.ఇవే కాకుండా సబ్బండ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని కొనియాడారు. వృద్దులకు వికలాంగులకు. ఒంటరి మహిళలకు ఆసరా పథకం ద్వారా నెల నెలా పెన్షన్ అందిస్తూ వారిని కన్న కొడుకు లా సీఎం కేసీఆర్ ఆదరిస్తున్నారని అన్నారు. కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకాలతో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు మేనమామ లాగా పెళ్లి కనుక గా లక్ష రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మరిపెడ మండల మాజీ కో అప్షన్ సభ్యులు ఆయుబ్ పాషా,చిన్న గూడూరు మండల తెరాస యూత్ మండల అధ్యక్షులు దుండి మురళి, వివిధ గ్రామాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ పోలీసుల విస్తృత తనిఖీలు

 ట్రాఫిక్ పోలీసుల విస్తృత తనిఖీలు

నిబంధనలు ఉల్లంఘించిన వారికి చర్యలు తప్పవు

ట్రాఫిక్ ఎస్ఐ నవత

పెన్ పవర్, జగిత్యాల 

జిల్లా కేంద్రంలోని ప్రధాన వ్యాపార కూడలివద్ద ఎస్ పి సింధుశర్మ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ ఐ.నవత ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘింపుపై తనిఖీ లు చేపట్టారు. నెంబర్ ప్లేట్స్ లేనివారికి నెంబర్ పెట్టించారు. మూడు చలాన్లకు మించి పెండింగ్ లో ఉన్నవాటిని చెల్లించిన తర్వాతనే ట్రాఫిక్ ఎస్.ఐ నవత సంబంధిత వాహనాలను వదిలిపెట్టారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...