Followers

భారీగా పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే అదుపు చేయాలి...సి.పి. ఐ. డిమాండ్

 భారీగా పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే అదుపు చేయాలి...సి.పి. ఐ. డిమాండ్ 

మహారాణి పేట, పెన్ పవర్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన పప్పులు, ఉప్పులు,వంటగ్యాస్,వంటనూనె,కాయగూరల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ  ఉ.10గంటలకు రైతు బజార్ సీతమ్మధార జంక్షన్లో సి.పి.ఐ. ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సి.పి.ఐ.నగర కార్యవర్గ సభ్యులు జి.వామనమూర్తి  మాట్లాడుతూ బి.జె.పి.ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రజల వాడే నిత్యవసర వస్తువుల ధరలు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 78 నెలలు గడిచినా పేద మధ్యతరగతి ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఇప్పటికైనా భారీగా పెంచిన పప్పులు బియ్యం కాయగూరలు వంటగ్యాస్ ధరలను నియంత్రించే ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అడ్డు అదుపులేకుండా పెట్రోల్ ధరలు పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను జి.ఏస్.టి. పరిధిలోకి తేవాలని సెస్,వ్యాట్ పన్నులను రద్దు చేయాలని ప్రజలకి ఆదాయ వనరులు చూపించలేని ప్రభుత్వం ధరల పెంచే అధికారం ఎవరిచ్చారని ప్రజలు ప్రశ్నించాలని కోరారు.

పెంచిన పాలు, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని లేని పక్షంలో ప్రజాగ్రహానికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.పేద మధ్యతరగతి ప్రజలపై ధరల పెంచుతూ బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ ప్రజలపై వేస్తున్న ఆర్థిక భారాలను త్రిప్పు కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సి.పి.ఐ. హెచ్.బి,కోలనీ శాఖ సభ్యులు ఎన్.మధు రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి ప్రజల తేరుకో లేక కరెంటు బిల్లులు,ఇంటి అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి ధరలు పెంచి ఆర్థిక భారాలు వేయడం ప్రభుత్వానికి తగదన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్.ఏ.నాయుడు, ఏస్.సూరిబాబు,ఎన్.గణేష్,ఏస్.సన్యాసిరావు, డి.అప్పలరెడ్డి,చిట్టి వెంకట్ నాయుడు,రావి కృష్ణ, దేవుడు,ఏస్.రాము తదితరులు పాల్గొన్నారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

 విశాఖ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో  విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ సమక్షంలో  జయంతి వేడుకలు నిర్వహించారు.ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ ఆనాడు మన దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో  రాష్ట్ర,పార్లమెంట్,సిటీ నాయకులు, కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు,వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు,సభ్యులు,బి.సి కార్పొరేషన్ డైరెక్టర్లు,బూత్ కన్వీనర్లు మరియు సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అరుంధతి సంఘం వారి ఆధ్వర్యంలో బాబూ జగ్జివన్ రామ్113 వ జయంతి

అరుంధతి సంఘం వారి ఆధ్వర్యంలో బాబూ జగ్జివన్ రామ్113 వ జయంతి    వేడుకలు






అనకాపల్లి, పెన్ పవర్

నేడు అనకాపల్లి పట్టణంలో రైల్వే స్టేషన్ దగ్గర భీముడి గుమ్మం జంక్షన్ వద్ద అరుంధతి సంఘం వారి ఆధ్వర్యంలో  డాక్టర్ బాబూ జగ్జివన్ రామ్114 వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  తెలుగుదేశంపార్టీ విశాఖజిల్లా ఉపాధ్యక్షులు మళ్ళ సురేంద్ర  పాల్గొని ముందుగా బాబూ జగ్జివన్ రామ్  విగ్రహానికి పూలమాల వేసి అలంకరించారు. ఈ సందర్భంగా  మళ్ళ సురేంద్ర  మాట్లాడుతూ డాక్టర్ బాబూ జగ్జివన్ రామ్ తొలి దళిత ఉపప్రధానమైన వ్యక్తని వారు చేసిన సేవలు నేటికీ కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్బవరపు గణేష్, పిట్ల మహాలక్ష్మి నాయుడు, చావేటి అచ్యుతరావు, కట్టుబొడి మంగరాజు, ఏల్లబెల్లి కనకరాజు, ఏలిల రాజు, వేగి కృష్ణ, బత్తుల శ్రీనివాసరావు, ఎండికుర్తి అప్పలరాజు, సదరం శివఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.

నగర కాంగ్రెస్ అధ్వర్యంలో 'బాబు జగ్జివన్ రామ్' 113 జయంతి

 నగర కాంగ్రెస్ అధ్వర్యంలో  'బాబు జగ్జివన్ రామ్' 113 జయంతి

మహారాణి పేట, పెన్ పవర్

నగర కాంగ్రెస్ అధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు, సంస్కర్త, దళిత నాయకులు భారతదేశ మాజీ  ఉప ప్రధాని 'బాబు జగ్జివన్ రామ్' 114 జయంతి సందర్భంగా సోమవారం ఉదయం నగర కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో అయన చిత్ర పటానికి పూలమల వేసి నివాళులు అర్పించారు,ఇందులో పాల్గొన్న వారు, గాజువాక ఇంఛార్జి గొల్లకట సుబ్బారావురాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ముల.వెంకటరావు,పిసిసి కార్యదర్శి సుధాకర్,ఇంటక్ తమ్మినిడు,యూత్ కాంగ్రెస్ శివకుమార్,కార్పొరేటర్ అభ్యర్ధులు ఎండీ షేక్,ఎండీ అర్షడ్ బాషా సర్వ శ్రీను, విపిన్ జైన్,వనం తాతారావు ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

బాలల విద్య,ఆరోగ్యానికి అధిక నిధులు కేటాయింపు కై మేయర్ కు విజ్ఞప్తి

బాలల విద్య,ఆరోగ్యానికి  అధిక నిధులు కేటాయింపు కై మేయర్ కు విజ్ఞప్తి

మహారాణి పేట, పెన్ పవర్

ఇటీవల జి.వి.ఎమ్.సి,2021:2022.బడ్జెట్ గాను 4255.35 కోట్లు గ నిర్ణయీంచారు.ఆరోగ్యానికి 516 విద్యకు 23 కోట్లు ఇచ్చారు.నగర జనాభా 20 లక్షలు బాలలు 40 శాతం  బాలల విద్యకు,ఆరోగ్యానికి ప్రాధాన్యత చెయూత ఇవ్వాలని మేయర్ కు బాల వికాస్ ఫౌండేషన్ కార్యదర్శి నరవప్రకాస రావు  విజ్ఞప్తి  చేశారు.ఆదివారం మేయర్ క్యాంప్ కార్యాలయం లో అ మీను మర్యాద పూర్వకంగా కలసి పత్రాన్ని అంద జెసారు. నరవ ప్రకాశరావు సమస్యలను వివరిస్తూ నగరం లో స్కూల్స్ 147, చదువుతున్న విద్యార్థులు 24517, టీచర్స్ 912 మంది బాలల సంఖ్య కు తగ్గట్టుగా స్కూల్స్ లేవు.ఈ నేపథ్యంలో ఎంతమంది బాలలు ఎన్ని స్కూల్స్ కావాలీ అనే అంశం గురించి సర్వే నిర్వహించాలని కోరారు.ప్రతి విద్యర్దికి ఆరోగ్య కార్డు అందజెసి స్కూల్స్ లో అరొగ్య పరీక్షలు చేయాలి బాలలు బడి లో వుండే విదంగా భరోసా తో కూడిన హామీ ఇవ్వాలని కొత్త  స్కూల్స్ కట్టడానికి ప్రదాన్యత ఇవ్వాలని మేయర్ ను  కొరెరు.వచ్చే కౌన్సిల్ సమావేశం లో మాట్లాడు తామని అన్నారు.విజ్ఞాపన పత్రాల కాపీలను విద్య మంత్రికి  మరియు ముఖ్య మంత్రికి పంపడం జరిగింది అని నరవ ప్రకాష్ రావు తెలిపారు.

పెదముషీడివాడలో టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించిన బండారు

పెదముషీడివాడలో టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించిన బండారు
పరవాడ, పెన్ పవర్
మండలం లోని పెదముషిడి వాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి&ఎమ్మెల్యే  బండారు సత్య మూర్తి చేతులమీద ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పయిల జగన్నాధ రావు,79 కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్,జడ్పిటిసి అభ్యర్థి  అట్ట సన్యాసిఅప్పారావు. 

ఎంపీటీసీ అభ్యర్థి ఓమ్మి వెంకటరావు,మాజీ సర్పంచ్ బంధం వెంకటరమణ,మాజీ ఎంపిటిసి గోవింద్,కోమటి వెంకట్ రమణ,మంత్రి ప్రసాద్,ఈ బోనంగి సర్పంచ్ బోద్దపు శ్రీనివాస్, బోండా రాము నాయుడు, బొడ్డుపల్లి అప్పారావు, పిల్ల అప్పారావు,రావాడ నాయుడు,ఇతర నాయలు,కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం ఎంపిటిసి,జెడ్పిటిసి అభ్యర్థుల తో బండారు సత్యన్నారాయణ   ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,జనసైనికులు గ్రామ పెద్దలు ఎంపిటిసిలు సర్పంచ్లు గ్రామ నాయకులు పాల్గొన్నారు.

మడలంలో టిడిపి&బిజెపి ల నుంచి వైసిపి లోకి భారీ వలసలు

మండలంలో  టిడిపి&బిజెపి ల నుంచి వైసిపి లోకి భారీ వలసలు

పరవాడ,పెన్ పవర్

మండలం లోని పెదముషీడి వాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆధీప్ రాజ్ ఆధ్వర్యంలో టిడిపి మరియు బీజేపీ పార్టీ ల నుంచి భారీగా వైసీపీ లోకి చేరికలు.అట్టహాసంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దముషిడి వాడనుంచి టిడిపి సర్పంచి అభ్యర్థి గా పరాజయం పొందిన బలిరెడ్డి అప్పారావు(కాంట్రాక్టర్) మరియు పరవాడ మాజీ జడ్పీటీసీ పెందుర్తి నియోజకవర్గ బీజేపీ లో కీలక సభ్యుడు బొద్దపు వెంకట రమణ, రమణమ్మ దంపతులు ఈ కార్యక్రమంలో వైస్సార్ తీర్ధం పుచ్చుకున్నారు.బొద్ధపు రమణ  బీజేపీ లో పెందుర్తి నియజకవర్గం లో  కీలక  నేత గా ఉన్నపటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల బీజేపీ కి రాజీనామా చేసి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పరిపాలన చూసి ఆకర్షితులమై వైసిపి పార్టీలో చేరుతున్నట్లు వీరు తెలియజేసారు.ఈ విషంలో అనుచరులు,అభిమానులు,కార్యకర్తల అభీష్టం మేరకే వై యెస్ జగన్ మోహన్ రెడ్డి   నాయకత్వం లో ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు పార్టీలో చేరడం జరిగిందని వీరు  తెలిపారు.ఈ సందర్భంగా మమ్ములును  పార్టీ లో కి ఆహ్వానించిన   పెద్దలుకు,కార్యకర్తలకు,అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు కి పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ కి అనకాపల్లి  శాసనసభ్యులు గుడివాడ అమర్నాద్ కి,రాష్ట్ర సి.ఈ.సి సభ్యులు పయిల శ్రీనువాసురావు కి జెడ్పిటిసి అభ్యర్థి పిఎస్.రాజు కు మరియు ఇతర ముఖ్యనాయకులకు,వైసీపీ కార్యకర్తలకు పరవాడ మాజీ జడ్పీటీసీ బొద్దపు వెంకట రమణ ,రమణమ్మ దంపతులు,బలిరెడ్డి అప్పారావు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...