Followers

45 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా కరోనా టీకా వేయించుకోవాలి..

 45 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా కరోనా టీకా  వేయించుకోవాలి..

రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్

వేములవాడ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రము  ను సందర్శించి డీఎం హెచ్ ఓ  తో మాట్లాడరు. ఈ సందర్భంగా మున్సిపాల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు  మాట్లాడుతూ పట్టణంలో పెరుగుతున్న కరోనా కేసుల దృశ్య ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఖచ్చితంగా మాస్కు ధరించాలని ప్రజలు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వ ఆస్పత్రిలో 45 సంవత్సరాలు దాటిన వ్యక్తులు కరోనా టికా ఇప్పించు కోవాలని అన్నారు  అదేవిధంగా మున్సిపల్ నుండి అన్ని వార్డులలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్ రావు , మున్సిపల్ కమిషనర్ శ్రీ శ్యామ్ సుందర్ రావు , గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

తర్వలో తాగునీటి సమస్యలు పరిష్కరం

 తర్వలో తాగునీటి సమస్యలు పరిష్కరం

కొత్తగా పైపులైన్ కోసం సర్వే 

పెన్ పవర్,  మల్కాజిగిరి

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదేశల మేరకు నేరేడ్మట్ డివిజన్ యాప్రాల్ బస్తిలోని నూతనంగా తాగునీటి పైపులైను ఏర్పాటు కోసం ప్రణళిక బద్దంగా కాలనీలో సర్వే చేసిన జలమండలి అధికారి జిఎం సునీల్, టి.ఆర్.ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మల్కాజిగిరి కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి. యాప్రాల్ ప్రాంతల్లో స్తానిక కాలనీ వాసులకు తాగునీటి సమస్యలతో ఇబ్బందులకు గురైతున్నారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి సిబ్బంది, సీనియర్ నాయకులు చెన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మధురానగర్ లో డ్రైనేజి సమస్యలతో ఇబ్బందులు

 మధురానగర్ లో డ్రైనేజి సమస్యలతో ఇబ్బందులు

సమస్యలు పరిష్కరించాలంటు స్దానికుల ఆవేదన

పెన్ పవర్,  మల్కాజిగిరి

నేరేడ్మట్ డివిజన్ లోని మధురానగర్ రోడ్డు నెం3లో డ్రైనేజి మురికినీరు పోంగి రోడ్డుపైకి వచ్చి దుర్వాసనతో ఇబ్బందులు ఎదురుకుంటున్నామని స్తానికులు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజి సమస్యలపై అధికారులకు పీర్యాదు చేసిన వారు స్పందించడం లేదని అందోళన వ్యక్తం చేశారు. స్తానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలంటు స్దానికులు కొరుతున్నారు.

సీఎం సహాయనిధి పేదలకు వరం

 సీఎం సహాయనిధి పేదలకు వరం 

తార్నాక , పెన్ పవర్ 

సీఎం సహాయనిధి పేదలకు వరం అని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. గురువారం నాచారం డివిజన్ లబ్ధిదారులకు  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి,    నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ లు అందచేసారు. రామకృష్ణ కు 60 వేల రూపాయలు , నరసింహాచారి 38 వేల రూపాయలు, భాగ్యమ్మ అరవై వేల రూపాయలు, సయ్యద్ ఇస్మాయిల్ 60 వేల రూపాయల చెక్కులను అందచేశారు.     ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, నాచారం కార్పొరేటర్ శాంతి  మాట్లాడుతూ, అత్యవసర ఆరోగ్య సమస్యలున్న వారికి అపన్న హస్తంగా సీఎం రిలీఫ్ ఫండ్  నిధి ఉపయోగ పడుతుందన్నారు. దీని ద్వారా అనేకమందికి   భరోసా కలిగిస్తున్నది అని  అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేఖర్, కట్ట బుచ్చన్న గౌడ్, సువర్ణ సుగుణాకర్  తదితరులు పాల్గొన్నారు

మిషన్ భగీరథ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం

 మిషన్ భగీరథ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం..!

 తొర్రూరు ఆర్ డి ఓ డి కొమరయ్య 

పెన్ పవర్, మరిపెడ 

మరిపెడ మండలం అబ్బాయి పాలెం గ్రామంలో మిషిని భగీరథ పథకానికి భూమి ఇచ్చిన భూ నిర్వాసితులకు అవార్డు మంజూరు అయినట్లు తొర్రూర్ ఆర్డిఓ డి కొమరయ్య తెలిపారు. గురువారం మరిపెడ తహసిల్దార్ కార్యాలయంలో భూమి కోల్పోయిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి  పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కృషితో అవార్డు ప్రకటన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ గ్రామంలో లో13 ఎకరాల 10 గంటల భూమి 23 మంది రైతుల నుండి భూసేకరణ చేసినట్లు ఆయన తెలిపారు. వారికి 2013 చట్ట ప్రకారంగా ఎకరానికి 8 లక్షల 96 వేలు రూపాయల నష్టపరిహారం నిమిత్తం అవార్డు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు మూడు రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  మరిపెడ తాసిల్దార్ జి రమేష్ బాబు, సీనియర్ అసిస్టెంట్ నంద నాయక్, ఆర్ ఐ నజీముద్దీన్, అబ్బాయి పాలెం గ్రామం సర్పంచ్ జినక మణి ఇద్దయ్య ,రైతులు డాక్టర్ రమేష్, జిన్నా బి క్షం, జినక వేంకన్న, మరో 20 మంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

మాస్కులు ధరించని వ్యక్తులకు జరిమనాలు

 మాస్కులు ధరించని వ్యక్తులకు జరిమనాలు

12 మంది పై కేసులు నమోదు


మంచిర్యాల,  పెన్ పవర్

మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  జైపూర్ సెంటర్ లో ఎస్సై రామక్రిష్ణ తన సిబ్బందితో కలిసి  గురువారం కిరాణా షాపుల్లో, హోటళ్లలో చికెన్, మటన్ షాపుల్లో  మాస్కులు ధరించకుండా విక్రయిస్తున్న 12 మంది యజమానుల మీద 188 ఐపిసి, 51(బి) డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద పెట్టీ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగాఎస్సై మాట్లాడుతూ, కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో జైపూర్ మండలంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించినా ఇకనుండి ఎవరైనా మాస్కులు ధరించనట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై రామక్రిష్ణ హెచ్చరించారు.

అనధికార గేట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాప్రా సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా

 అనధికార గేట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ  కాప్రా సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా

చర్లపల్లి కాలనీల సమాఖ్య ఆధ్వర్యంలో బైఠాయించిన కాలనీల వాసులు

అమూల్య హోమ్స్ ఇతర అధికార గేటెడ్ కమ్యూనిటీల పై చర్యలకు డిమాండ్

అక్రమ గేట్లపై చర్యలు తీసుకుంటాం...శంకర్ కాప్రా డిసి.

పెన్ పవర్,  మల్కాజిగిరి

కాప్రా సర్కిల్ పరిధిలో అనధికార గేటెడ్ కమ్యూనిటీల పేరుతో రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న గేట్లను తొలగించాలని చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న గేట్లను తక్షణమే తొలగించాలని నినదిస్తూ చర్లపల్లి కాలనీల సమాఖ్య  ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మా రోడ్లు మాకు కావాలి అమూల్య హోమ్స్ , భవాని నగర్ రోడ్ లను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న గేట్లను తొలగించాలి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ లు స్పందించి ఆక్రమణలకు పాల్పడుతున్న సంస్థలు వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనధికార గేట్లపై చర్యలు తీసుకోవాలంటూ చర్లపల్లి కాలనీల సమాఖ్య ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా చేపడుతున్న ఆందోళనలు గురువారం  కాప్రా సర్కిల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాకు ఉపక్రమించడం జరిగింది.  ఈ సందర్భంగా చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి మాట్లాడుతూ కాప్రా సర్కిల్ లో గేటెడ్ కమ్యూనిటీల విష సంస్కృతి అధికారుల నిర్లక్ష్యంతో పెట్రేగి పోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు ఏ మాత్రం తాత్సారం చేయకుండా అక్రమ గేట్లను తొలగించాలని లేనియెడల కాప్రా సర్కిల్ కార్యాలయంను ముట్టడించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన టిఆర్ఎస్, బిజెపి, టిడిపి పార్టీల నాయకులు మాట్లాడుతూ ఎవరికివారు ఇష్టానుసారంగా గేట్లను ఏర్పాటు చేసుకుని పోతే పక్క కాలనీలకు వెళ్లే మార్గాలు మూసుకుపోయి మానవ సంబంధాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అమూల్య హోమ్స్ గేట్లు మూసివేయడంతో కోవిడ్ పరీక్షలకు వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వెళ్లాలంటే జమ్మిగడ్డ దాని పరిసర అనేక అనేక కాలనీల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని జమ్మిగడ్డ, న్యూ వాసవి నగర్ వాసులు గగన్ కుమార్ మరియు చంద్రశేఖర్ లు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కిల్ కార్యాలయం ఎదుట జరుగుతున్న ఆందోళనలు స్పందించిన కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ కార్యాలయం బయటకు వచ్చి ధర్నా చేస్తున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అనధికారిక గేటెడ్ కమ్యూనిటీ లపై  న్యాయపరమైన సలహాలు తీసుకుని సాధ్యమైనంత త్వరలో వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆందోళన విరమించి తమతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మరి మోహన్ రెడ్డి,  గణేష్ ముదిరాజ్, రాములు యాదవ్, కొండూరి మురళి పంతులు, నీరుకబాబాబు,సతీష్ బాబు, లక్ష్మీనారాయణ,  బి జె ఆర్ కాలనీ అధ్యక్షులు రహీం, చక్రిపురం  అధ్యక్ష -కార్యదర్శులు మొగిలి రాఘవరెడ్డి,ఆంజనేయులు, మీనాక్షి నగర్, వైష్ణవి ఎంక్లేవ్ ల అధ్యక్షులు సురేష్ గుప్తా,గంప కృష్ణ, శివ సాయి నగర్ ఉపాధ్యక్షులు కాసుల సురేష్ గౌడ్ , శుభోదయ కాలనీ సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...