Followers

డుంబ్రిగుడ మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఆకస్మిక మృతి

 డుంబ్రిగుడ మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఆకస్మిక మృతి 

అరకు, పెన్ పవర్

అరకు వేలి నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్.పి.టి.సి,అభ్యర్థి కొర్ర రుక్మిణి గుండెపోటు తో మంగళవారం అకస్మాత్తుగ మృతి చెందారు ఆమె భౌతిక కాయాన్ని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పాచిపెంట శాంతకుమారి సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పార్టీ నుండి వారికి ఎటువంటి సాయం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని తెలియజేశారు.అరకు వేలి మండలం ప్రెసిడెంట్ సోమెలి సన్యాసిరావు మండల నాయకుడు పాచిపెంట చిన్నస్వామి హుకుంపేట జెడ్పిటిసి అభ్యర్థి,గలుగు బోయిన కోటేశ్వరరావు, డుంబ్రిగుడ మండల కార్యదర్శి బిమరావు,కె హరిష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఆమెతో ఉన్నారు.

మంత్రి వనిత కు కృతజ్ఞతలు తెలిపిన వైసిపి పెద్దేవం

 మంత్రి వనిత కు కృతజ్ఞతలు తెలిపిన వైసిపి పెద్దేవం 

తాళ్లపూడి, పెన్ పవర్

వైయస్సార్సీపీ పెద్దేవం బూత్ కన్వీనర్ వేము రామారావు కరోనా తో బాధపడుతున్నప్పుడు విషయం తెలుసుకున్న  వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ   రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కు ఈ విషయం తెలియజేశారు. వెంటనే మంత్రి వనిత  స్పందించి రాజమండ్రి గవర్నమెంట్  హాస్పిటల్ లో బెడ్ ఇప్పించి సకాలంలో వైద్యం అందేలా  చూసారు. వేము రామారావు మాట్లాడుతూ మంత్రి వనిత ఆదేశాలమేరకు హాస్పిటల్ సూపరింటెండెంట్ తో అనుక్షణం ఫోన్ మాట్లాడుతూ, నాకు ఇంజెక్షన్లు కోర్స్ పూర్తి అయ్యేలాగా డాక్టర్ల తో మంత్రి వారి అడిషనల్ పియస్ మహాలక్ష్మి కుమార్   మాట్లాడారు. అలాగే మన ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోన పట్ల చేస్తున్న కృషి గవర్నమెంట్ హాస్పిటల్ లో చాలా బాగుంది అని అన్నారు. ఎవరు అపోహలు నమ్మవద్దు అని,హాస్పిటల్ లో ఇంజక్షన్ ల కొరత లేదు అని, అన్ని సదుపాయాలు చాలా బాగున్నాయి అని, అందుకు గాను నేను  సోమవారం నాడు కరోనా నుంచి కోలుకుని  ఇంటికి చేరుకున్నాను అని అన్నారు. నా వైద్యానికి సహాయం అందించిన  మంత్రి తానేటి వనిత కి, మంత్రి వారి అడిషనల్ పియస్ మహాలక్ష్మి కుమార్ కి,  వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి  తోట రామకృష్ణ కి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని తెలియజేశారు. అలాగే గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,14 రోజులు నా దగ్గర కి రావద్దు అని, నా  ఆరోగ్యం బాగుంది అని తెలియచేశారు.

కరోనా రోగుల పట్ల అమానుషం

 కరోనా రోగుల పట్ల అమానుషం

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో, ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా మృతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న వారిపై తక్షణం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటనలో కరోనా రోగుల పట్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని,కనీసం ప్రజలకు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేయించ లేకపోవడం విచారకరమని, కరోనా రెండవ దశలో కరోనా సోకిన వారికి సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని, కరోనా మెడిసిన్ కిట్లు కూడా ఎక్కడా ఎవరికీ ఇవ్వడం లేదన్నారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థల ఉనికి కూడా ప్రస్తుతం కనబడటం లేదన్నారు.ఆశా వర్కర్లు, ప్రభుత్వ వ్యవస్థను, యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించి ప్రజలకు సేవలు సకాలంలో అందేలా చూడాలని, వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదని, అందుకే రోగులను అరబయటే వదిలేస్తున్నారని, అదేవిధంగా మృత దేహాలను సైతం ఎటువంటి ప్రోటోకాల్ అనుసరించకూడా ఎక్కడ పడితే అక్కడ ఉంచేయడం సమంజసం కాదన్నారు. డాక్టర్లు కొరత ఉన్నందున తక్షణం యుద్ధ ప్రాతిపదికన డాక్టర్లను, సిబ్బందిని నియమించాలని, అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా వైద్యానికి చార్జీలను నిర్ణయించి వాటిని అమలయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ ని అరికట్టండి

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ ని అరికట్టండి

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం నగరంలో కోవిడ్ వ్యాధి అత్యవసర పరిస్థితిని ఆసరా చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంటున్నాయని సి.పి.ఎం జిల్లా కమిటీ విమర్శించింది. ఈ మేరకు సి.పి.ఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ ఒక ప్రకటన ద్వారా జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీని అరికట్టాలని కోరారు.ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకుండా లక్షల్లో దండుకుంటున్నారని, పైగా రెమిడేసిఫర్ ఇంజెక్షన్ రోగులు తెచ్చుకోవాలని తమకు సంబంధం లేదని తిప్పడం ఆ తరువాత బ్లాక్ లో లక్షలు గుంజటం ప్రైవేట్ ఆస్పత్రుల వ్యాపారంగా మారిందని మండిపడ్డారు.ప్రజలను ఆదుకోవాల్సిన ప్రైవేట్ వైద్యరంగం ఇలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి ని సొమ్ము చేసుకోవడం దుర్మార్గమని నగరంలో ఉన్న ప్రజా ప్రతినిధులు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు దీనిపై స్పందించాలని అరుణ్ కోరారు.అఖిల పక్ష పార్టీలు,సంస్థల సమావేశం జరిపి ఈ పరిస్థితి ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని కోరారు.

కోవిడ్ కేంద్రాన్ని నిర్వహించవద్దు అని అధికారులను కలసిన స్థానిక ప్రజలు

కోవిడ్ కేంద్రాన్ని నిర్వహించవద్దు అని అధికారులను కలసిన స్థానిక ప్రజలు

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం స్థానిక గోదావరి గట్టు సమీపంలో కరెంట్ ఆఫీస్ పరిధిలో త్యాగరాజు కళ్యాణ మండపంలో జైన్లకు సంబంధించి కోవిడ్-19 యాక్షన్ సెంటర్ ప్రారంభించవద్దు అని అక్కడ స్థానికులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఇటువంటి వి నగరానికి దూరంలో ఉండాలని టీ నగర్ 21 వ వార్డు స్థానిక ప్రజలు అందరూ ఒక్కమాట పై నిలబడి ,గతంలో కూడా కాతేరు శివారులో ఉన్న కన్వెన్షన్ సెంటర్ లో కొనసాగించారు.

ఈప్పుడు అలాగే ఉండాలి నగరానికి దూరం గా కోవిడ్ కేంద్రం నిర్వహించుకోవాలని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ వారికి మున్సిపల్ కమిషనర్ వారికి వినతి పత్రం అందించి వారు తమ గోడును విన్నవించుకున్నాము అని నల్లం శ్రీనివాస్ ఈ సందర్భంగా మీడియా మిత్రులతో తెలియజేసారు.నందెపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సమీపాన వచ్చిన సమస్య అధికారులు దృష్టి కి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కర మార్గం చేసే లాగా చేస్తాము అని ఆయన తెలిపారు. అనంతరం రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రాం ని స్థానికులు కలవగా ఆ కోవిడ్ శిబిరాన్ని అక్కడ స్థానికులు కోరిక మేరకు అక్కడ ఏర్పాటు చెయ్య వద్దు అని అధికారులకు సిఫార్సులు ఫోన్ ధ్యారా మాట్లాడారు.ఆయనను కలిసిన ప్రజలు ఎం.పి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

కరోనాతో ఇరిగేషన్ ఏ ఈ జగన్నాథ మృతి

 కరోనాతో ఇరిగేషన్ ఏ ఈ జగన్నాథ మృతి

మెంటాడ, పెన్ పవర్  

మెంటాడ మండలం, ఆండ్ర రిజర్వాయర్ పరిధిలోని ఇరిగేషన్ ఏ ఈ గా విధులు నిర్వహిస్తున్న టి. జగన్నాథం ఈ తెల్లవారుజామున కరోనాతో మృతి చెందినట్లు ఇరిగేషన్ డీఈ పాండు తెలిపారు. ప్రస్తుతము ఆయన దత్తిరాజేరు మండలం ఇరిగేషన్   ఏ ఈ గా విధులు నిర్వహిస్తున్నారని డి ఈ పాండు తెలిపారు. జగన్నాథం మృతి ఆయన కుటుంబానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధ తిరిగేసి అధికారులంతా సంతాపం తెలిపారు. వృత్తినే దైవంగా భావించి అనుదినం ఆయన విధులు నిర్వహించే వారిని అటువంటి వ్యక్తి చనిపోవడం బాధాకరమని పలువురు మండల స్థాయి అధికారులు, గజపతినగరం సబ్ డివిజన్ ఇరిగేషన్ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

అద్దె పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం

 అద్దె పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం

మెంటాడ, పెన్ పవర్

మెంటాడ మండలం లోని 30 గ్రామ పంచాయతీలు ఉండగా, ఈ ఏడాది చింతాడ వలస గ్రామం నూతన పంచాయతీగా ఏర్పాటయింది. సొంత పంచాయతీ భవనం లేకపోవడంతో వై ఎస్ ఆర్ సి పి సీనియర్ నాయకులు, సర్పంచ్ ప్రతినిధి గేదెల సతీష్ గ్రామంలో ఒక ఇంటిని అధిక తీసుకొని పంచాయితీ కార్యాలయంగా ఏర్పాటు చేశారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వారి వారి పనులు చేయడానికి గ్రామ పంచాయతీ కార్యాలయం లేకపోవడంతో తాత్కాలికంగా అద్దె భవనం ప్రారంభోత్సవం చేసినట్లు ఆయన తెలిపారు. ఇకమీదట గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి వచ్చి  సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు ద్వారా తన సమస్యలను చెప్పుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...