అడ్డతీగల, పెన్ పవర్
ఏజెన్సీ ప్రాంతమైన అడ్డతీగల గ్రామంలో 144 సెక్షన్ పటిష్టంగా అమలవుతుంది. ఉదయం 11 గంటల నుండి పోలీసులు సీతపల్లి సెంటర్ వద్ద గస్తి కాశారు. ఏ ఒక్కరినీ బయట తిరగ నివ్వలేదు. బయటకు వచ్చినవారికి కౌన్సెలింగ్ ఇచ్చి త్రిగి ఇళ్లకు పంపిస్తున్నారు . అడ్డతీగల లో రంపచోడవరం ఎఎస్పీ స్వయంగా పరిశీలించారు. సి ఐ , ఎస్ ఐ పర్యవేక్షణలో 100 శాతం కర్ఫ్యూ అమలవుతుంది. ఉగాది పండగ వాతావరణం అస్సలు కనపడలేదు. గ్రామస్తులు ఇళ్లలోనే ఉండి తమ పండగలను చేసుకున్నారు. వేటమామిడి, అడ్డతీగల మధ్య సీత పల్లి జంక్షన్ వద్ద రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్, టైర్లతో అడ్డు వేశారు.
No comments:
Post a Comment