గ్రామాల్లోని చెక్ పోస్టులు తొలగించండి
ఐటిడిఎ పి ఓ డీకే బాలాజీ
పాడేరు , పెన్ పవర్ : గిరిజన గ్రామాల్లోకి ప్రవేశించకుండా గ్రామస్థులు రోడ్డుకు అడ్డంగా రాళ్లు, కంచె వేసిన చెక్ పోస్ట్ లు తొలగించాలని ఇటీడీఏ పి.ఓ డి.కె.బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలియజేసారు. గ్రామాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయడం వలన అంబులెన్స్ లకు అత్యవసర వైద్య సేవలకు ,వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఏజెన్సీ నలుమూలల చెక్ పోస్టులు ఏర్పాట్లు చేసామన్నారు. అవి 24 గంటలు కొనసాగుతున్నాయని చెప్పారు. గ్రామాల్లో చెక్ పోస్ట్ లకంటే స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించడాని వైద్యం అందించడానికి సహకారాన్ని అందించాలని కోరారు.
No comments:
Post a Comment