Followers

నమ్మించి మోసం చేశాడని యువతి ఆత్మహత్య

నమ్మించి మోసం చేశాడని యువతి ఆత్మహత్య


పెదబయలు. (పెన్ పవర్)
మండల కేంద్రం సమీపంలో సీకారి పంచాయతీ  బంగారుమెట్ట గ్రామంలో యువతీ మృతితో  విషాదఛాయలు అలుముకున్నాయి ఇదే  గ్రామానికి చెందిన కటారి రామేశ్వరి (25) బి.ఎస్.సి నర్సింగ్, గ్రే హౌండ్స్  కానిస్టేబుల్ అయిన లకే నిలకంఠం  ప్రేమలో  పడింది. ఇటీవల తాను  ప్రేమించిన  ప్రియుడు మరో యువతీ కి పెళ్లాడా బోతున్నాడని మనోవేదనకు గురై గురువారం ఉదయం ఐదు గంటల సమయంలో ఎవరికీ తెలియకుండా మెయిన్ రోడ్డుకు సమీపంలో గల నీటీ బావిలో దూకి ఆత్మ హత్య చేసుకొంది  రామేశ్వరి. ఎంత సేపటికి ఇంటికి రాకపోవడం తో కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల వాకబు చేసారు  కుటుంబ సభ్యులు  గురువారం సాయంత్రం పోలీసుస్టేషన్ కు ఫిర్యాది చేయగా మిస్సింగ్ కేసుగా ఎస్ ఐ రాజారావు నమోదు చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అనుమానం ఎక్కువై పాడైన నిటీ బావిలో కర్ర తో పొడిచి గాలం వేశారు  బావిలో మృత దేహం కనిపించడంతో పోలీసులకు మరల ఫిర్యాదు చేశారు.  సంఘటన స్థలానికి ఎస్ ఐ చేరుకొని వివరాలను సేకరించారు  ఎస్ఐ  తెలిపిన వివరాల ప్రకారం సీకారి గ్రామానికి చెందిన మృతురాలు దూరపు బంధువునితో ప్రేమలో పడిందని  ప్రేమించిన వ్యక్తి ఇదే గ్రామానికి చెందిన మరో యువతీ తో వివాహం చేసుకొనడానికి సిద్దపడ్డాడని  ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదని మనోవేదనకు గురై ఆత్మ హత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారని తెలిపారు,  కారణాలు ఏమైనప్పటికి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అలాగే ఫోన్ కాల్ డేట  ఆధారాలతో కేసు నమోదు చేస్తామని ఎస్ ఐ రాజారావు తెలిపారు   మృతురాలు తల్లి  మాట్లాడుతూ బాధ్యత యుతమైన వ్యక్తి పోలీసు వృత్తిలో ఉండి తన కూతురిని ప్రేమించి మోసం చేసాడని కన్నీటి పర్వమయ్యారు.  మృతురాలు విశాఖపట్నం విమ్స్ హాస్పిటల్లో ప్రయివేటు ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా సహాయపడేదని, ఆమె మృతితో కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని  తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ బాద్యుల్ని పోలీసులు విచారించి చట్టపరమైన శిక్షవిధించాలని  ఎస్ఐ ముందు తెలిపారు.


 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...