Followers

జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో కార్వాంటైన్ కేంద్రం ఏర్పాటు


 


మార్కాపురం, పెన్ పవర్


మార్కాపురం జార్జీ ఇంజినీరింగ్ కళాశాలలో కరోనా వైరస్   లక్షణాలు ఉన్నవారిని పరిశీలనలో ఉంచడానికి క్వారoటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ ఎం.శేషి రెడ్డి వెల్లడించారు. గురువారం మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని దరియమడుగు వద్ద జార్జీ ఇంజినీరింగ్ కళాశాలలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని పరిశీలనలో ఉంచడానికి ఏర్పాటు చేసిన క్వారoటైన్ వార్డ్ ను మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేషి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కో ఆర్డినేటర్ డ్రా.ఎస్.ఉషా, పరిశీలించారు.ఈ సందర్భంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ వ్యాపి చెందకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడము జరిగిందన్నారు.కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని మార్కాపురం డివిజనల్ కు సంబంధించి క్వారo టైన్ కేంద్రాన్ని జార్జీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.విదేశాల నుండి వచ్చి వారిని,మరియు వైరస్ లక్షణాలు ఉన్న స్థానిక ప్రజలను కరోనా వైరస్ వైద్య పరీక్షలు నిర్వహించి వారిని 14 రోజుల పాటు పరిశీలనలో ఉంచడము జరుగుతుందని ఆయన తెలిపారు. కరోనా వైరస్ నివారణకు ఏర్పాటు చేసి క్వారoటైన్ కేంద్రంలో వైద్య సేవలు అందించేందుకుడాక్టర్లు, మెడిసిన్స్ ,త్రాగునీరు,130 పడకల బెడ్స్ ను  ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.క్వారo టైన్ వార్డు లో డాక్టరు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. జిల్లాలో ఏప్రియల్ 14 వరకు లాక్ డౌన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మార్కాపురం డివిజనల్ లో కూడా ఏప్రియల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించడము జరిగిందన్నారు.కరోనా వైరస్ ప్రభలతున్న సందర్భంగా ప్రజలు ఎవ్వరూ కూడా బహిరంగము తిరగ కుండా ఇంటి వద్దనే ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో  మాత్రమే బయటకు రావాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం తహసీల్దార్ శ్రీ రమేష్, మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్ డ్రా.సుబ్బారెడ్డి, రాంబాబు, డ్రా.సురేష్, తదితరులు పాల్గొన్నారు. డివిజనల్ పౌర సంబంధాల అధికారి,మార్కాపురం,


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...