మేము మారం.. మేంమింతే...
కరోనా గిరొనా...
విచ్చలవిడిగా గుంపులు...
దూరం ఎక్కడా..?
మండపేట, పెన్ పవర్
కరోనా రక్కసి కోరలు చాస్తూ దేశానికి సవాల్ విసురుతుండగా మండపేటలో జనం దీన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నారు. అందరూ కాదండోయ్... చాలా మంది ఎంతో నిష్ట గా స్వచ్ఛందంగా తమకు తాము నిర్బంధం విధించుకొని ఉత్తమ పౌరులు గా తమ బాధ్యత నిర్వహిస్తున్నారు.
అయితే కొందరు ఏదో తమకేం కాదు... అనే నిర్లక్ష్య ధోరణి కనబరుస్తూ అవహేళన చేస్తున్నారు. అధికారులు ఎంత అవగాహన కల్పించిన ఎవ్వరు ఏమాత్రం మారటంలేదు.
సామాజిక దూరం అంటే అర్థం మార్చేశారు. మండపేట రైతు బజార్లో కొద్దిగా ఈ నిబంధనలు పాటించినా వేగుళ్ళ వీర్రాజు మునిసిపల్ మార్కెట్ లో ఒకరినొకరు రాసుకుని పూసుకుని మరి కొనుగోలు చేశారు.
ఇది గురువారం చోటు చేసుకున్న వ్యవహారం. ఇప్పటికే మూడు రోజులు గడిచాయి.
అయిన ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఉండే వీరి చర్యలు ఎంతో పకడ్బందీగా పాటిస్తున్న వారి త్యాగం వృధాగా పోతోంది.
ఎవరిది లోపం.
ఎక్కడ దీనికి పరిష్కారం. ఎవరికి వారు నియంత్రణ చేపట్టాలి గాని ఎవరో వచ్చి ఎదో చేస్తారని చూడటం మూర్ఖత్వం అవుతుంది. ఉదయం 6 నుండి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు కొనుగోలు కు అవకాశం ఇస్తే... వీధుల్లో, కాలనీలో ప్రజలు గుంపులుగా సంచరిస్తూ వినోదం చేస్తున్నారు.
వీటన్నింటినీ మానుకోకపోతే త్వరగానే తగినమూల్యం అందరూ చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది..
No comments:
Post a Comment