తాళ్లపూడి మండలంలో విచ్చలవిడిగా తిరుగుతున్న పందులు
పెన్ పవర్ తాళ్లపూడి
తాళ్లపూడి మండలం లో ప్రక్కిలంక తాళ్లపూడి గ్రామాలలో పందులు
విచ్చలవిడిగా తిరుగుతున్న పందుల యజమానులు పట్టించుకోవడంలేదని గ్రామ ప్రజలు తెలిపారు. గ్రామ పంచాయతీ అధికారులు పందులు యజమానులతో మాట్లాడి పందులు ఊరిలోని కి రాకుండా గ్రామానికి దూరంగా పందులకు నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించినప్పటికీ గ్రామాల్లో పందులు స్వైర విహారం చెయ్యడం తగ్గలేదు. పందుల యజమానులతో గ్రామపంచాయతీ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ అధికారుల మాటలు పెడచెవిన పెట్టి పందులను ఊరిలోకి వదిలేయడంతో కరోనా వైరస్ విస్తృతంగా వస్తున్నందున గ్రామ ప్రజలు పందుల వలన ఏ వైరస్సో సోకి అనారోగ్యం వస్తుందో అని భయ బ్రాంతులకు గురవుతున్నారు. పంచాయతీ అధికారులు పందుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుని అయినా నా గ్రామాల్లో పందులు తిరగకుండా నిలువరించాలని కోరుతున్నారు.
No comments:
Post a Comment