అధికారుల సూచనలు పాటిస్తూ ఉగాది వేడుకలు జరుపుకున్న ప్రజలు
పెన్ పవర్, తాళ్లపూడి
పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో తెలుగు సంవత్సరాది ఉగాది
పండుగను సాంప్రదాయ బద్దంగా జరుపుకున్నారు . గ్రామదేవతలకు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగను ఎంతో వైభవంగా జరుపుకునే వారు ఈ సంవత్సరం కరోనా వైరస్ విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసు వారి సూచనలకు అనుగుణంగా ఒక్కొక్కరుగా ఆలయంలోకి వెళ్లి దేవతలను దర్శించుకున్నారు. ఉగాది పండుగకు ఏ సంవత్సరం ఈ విధమైన పరిస్థితులు లేవని తర్వాత వచ్చే పండుగను జనసమూహము తో అంగరంగ వైభవంగా జరుపుకునే విధంగా కరోనా మహమ్మారిని రూపుమాపాలని గ్రామ దేవతలను భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు.. ప్రతి సంవత్సరం కుటుంబాలతో ఎంతో అట్టహాసంగా చేసుకునే వాళ్లమని తప్పని పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఈ విధంగా జరుపుకోవాలసి వచ్చిందని స్థానిక భక్తులు తెలిపారు.
No comments:
Post a Comment