Followers

ఆరోగ్య పరిస్థితి పై అన్ని గ్రామాల్లో సమగ్ర సర్వే 



ఆరోగ్య పరిస్థితి పై అన్ని గ్రామాల్లో సమగ్ర సర్వే 

 

ఆత్రేయపురం,  పెన్ పవర్

 

ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలం లోని అన్ని గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు హెల్త్ సిబ్బంది ద్వారా సమగ్ర సర్వే నిర్వహించి ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నట్లు  ఎంపీడీఓ నాతి బుజ్జి, వైద్యాదికారి శ్రీనివాస వర్మ తెలిపారు.వివరాలు తెలుపుతూ కరోనా లక్షణాలతో ఉన్న వ్యక్తులను గుర్తించి,  వివరాలు అప్డేట్ చేయుటకు క్రొత్త యాప్ 1.9 వెర్షన్ ను ప్రభుత్వం విడుదల చేయటం జరిగిందనీ,  కరోనా సర్వే ఇంతకుముందు పూర్తి చేసినప్పటికీ, మరల ప్రస్తుతము  కరోనా పరిస్థితి పై అన్ని కుటుంబాల వివరాలు  విదేశాల నుండి వచ్చిన వారి వివరాలను   ఈ యాప్ లో గ్రామ వాలంటీర్లు అప్డేట్ చేయవలసివుందన్నారు. అంతేగాకుండా వారు 14రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో వున్నారో లేదో కూడా పరిశీలిస్తున్నారు. . ఏఎన్ఎం,  ఇతర సచివాలయ సిబ్బంది,  గ్రామ వాలంటీర్లు మరియు ఆశా కార్యకర్తల ద్వారా  ఈ యాప్ లో ఆ వివరాలను రెండు రోజుల్లో అప్డేట్ చేస్తారని తెలిపారు. ‌సర్వే పాల్గొంటున్న సిబ్బంది అంతా వారి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజల వివరాలు సేకరించాలన్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఎంతో బాద్యతగా వ్యవహరిస్తున్న సిబ్బంది ని అభినందించారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...