Followers

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించాలి


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించాలి

 

మానవ హక్కుల కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు డా. వై సురేష్ కుమార్

 

రావులపాలెం , పెన్ పవర్                         

 

ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారిని  మనదేశంలో నిర్మూళించే ఉద్దేశ్యంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ సురేష్ కుమార్ కోరారు.ఈ మేరకు బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఎలాంటి పుకార్లు, వదంతులు, మూఢనమ్మకాలు నమ్మవద్దన్నారు.ఎవరూ ఇంటినుంచి బయటకు రాకూడదని తెలిపారు.కరోనాపై పోరాటానికి మన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయమని,ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించాలని కోరారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను అందరూ విధిగా పాటించి ఇళ్ళకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు.నిత్యావసర వస్తువుల కోసం ఉదయం 6 గంటల నుండి ఉదయం10 గంటల లోపే తెచ్చుకోవాలని తెలిపారు.ప్రజలు అనవసరంగా బయటకు వెళ్ళి ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించారాదన్నారు.కరోనా  బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు.144 సెక్షన్ అమలులో ఉన్నందున యువకులు అనవసరంగా తిరిగి పోలీసుల చర్యలకు గురికావద్దన్నారు.ఈ నెల 31 వరకు లాక్ డౌన్ కు సహకరించి ప్రభుత్వం చేపట్టిన కరోనా నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...