Followers

కరోనా ఎఫ్ఫెక్ట్ తో.... రాష్ట్ర సరిహద్దుల్లో..."హై అలర్ట్"


-కరోనా  వ్యాధిపై కుగ్రామాల్లో అవగాహన 





-అధికారుల అవగాహనతో అలర్ట్ అయిన గ్రామ ప్రజలు

 

- తహశీల్ధార్ ఆధ్వర్యంలో మండలంలో పోలీస్ రిక్కీ

 

-వాహనాలను అడ్డుకొని అవగాహన పరుస్తున్న ఎస్ ఐ లు

 

-కొత్తగా వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్న వైద్యులు, తహశీల్ధార్

 

-ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు

 

-కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో కట్టుదిట్టమైన లాక్డౌన్

 

-మండలానికి కొత్తగా వచ్చిన వారిని గుర్తింపు, రక్త నమూనాలు సేకరణ

 

-,మన్యం మండలాల్లో పిఓ సుడిగాలి పర్యటన

 

- మండల అధికారులతో పాటు సచివాలయ, రెవిన్యూ, వాలంటీర్లు సేవలు

 

వి.అర్.పురం ( పెన్ పవర్),  కరోనా దెబ్బకు పట్టణ, పల్లెలు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడే లాక్డౌన్ అయింది. ఇది కరోనా వైరస్ కాదు చైనా వైరస్ అంటూ ప్రజలు చైనా చేసిన తప్పుడు పనికి అన్ని దేశాలు ఇబ్బంది పడుతూన్నామని విద్య వంతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచదేశాల్లో భయపడుతున్న తీరును సోషల్ మీడియాలో, టీవీలలో చూస్తున్న ప్రజలూ ఎక్కడికక్కడే అలర్ట్ అవుతున్నారు. ఎవరో కొంతమంది వ్యక్తులు తప్ప మిగతా వారు తమ గ్రామాలకు సైతం ఎవరు రావద్దంటు రోడ్డుకు అడ్డంగా కంచెలు ఏర్పాటు చేసుకొని ప్లై కార్డులను ఏర్పాటు చేసుకుంటున్నారు. మండలంలో కొత్తగా వస్తున్న వారి వివరాలను సైతం సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రతి మండలంలోని గ్రామాలను తహశీల్ధార్ శ్రీధర్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ ఐ లు, చంటి, వెంకటేష్ పోలీస్ ,రెవిన్యూ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు సైతం క్షుణ్ణంగా గ్రామాలలో రక్కి నిర్వహించి ఎవరు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలపై జల్సా చేసే వ్యక్తులు కనబడితే పోలీస్ స్టైల్లో బుద్ధి చెప్పి పంపిస్తున్నారు.  

 

*ఇతర ప్రాంతాలనుండి వచ్చిన వారికి కౌన్సెలింగ్*

మండలంలో స్థానికులు కొంత మంది పక్క రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లి తమ గ్రామాలకు వచ్చిన వారిని గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితులపై మూడు శాఖల ఆధికారులు( వైద్యులు, పోలీస్, రెవిన్యూ) దృష్టి సారించి వారి వివరాలను సేకరిస్తున్నారు.  వారు ఏ ప్రాతం నుండి వచ్చారు. ఏ పని నిమిత్తం వెల్లారో  అడిగి తెలుసుకుంటున్నారు. జీడిగుప్ప ,రేఖపల్లి వైద్యులు సుందర ప్రసాద్, నాగార్జున కొత్తగా వచ్చిన వారి గ్రామాలకు వెళ్లి వైద్య చికిత్సలు చేశారు. రక్త నమూనాలను సేకరిస్తున్నారు.  వేరే చోట నుండి కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చిన వారు డిక్లరేషన్ ఫామ్ పూర్తి చేసి సంబంధిత  అధికారులకు అందించాలని, వైద్యులు చేసిన వైద్య పరీక్షలు అనంతరం  గ్రుహనిర్బంధంలో ఉండాలని, బయటకు రాకుండా వైధ్యుల పర్యవేక్షణలో ఉండాలని అధికారులు సూచించారు. కిరాణా షాపుల్లో నిత్యావసర వస్తువులు తీసుకోవాల్సిన వారు వెంటనే తీసుకొవాలని అధికారులు సూచనలు చేశారు. కొన్నింటికి మాత్రమే మినహా యింపు ఉందికాని అన్ని విషయాల్లో బయటకు రావద్దని పోలీస్ వారు హెచ్చరించారు. కొంతమంది మాములే జ్వరంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి వెళ్లాలని తెలిపారు. మండలంలో ఎవరైనా కొత్తగా వచ్చి అధికారుల దృష్టికి తీసుకు రాకుండా ఉంటే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

 

రేఖపల్లి సెంటర్లో తహశీల్ధార్ శ్రీధర్, ఎస్ ఐ లు మండుటెండలో విధులు నిర్వహించారు. వారికి తోడు పోలీస్, రెవిన్యూ సిబ్బంది, సచివాలయ ఉద్యోగస్థులు, సిబ్బంది వాలంటీర్లు అధికారుల సూచనలను పాటిస్తూ తమ విధులను నిర్వర్తించారు.  రేఖపల్లిలో వాలంటీర్లు ప్రజల సమస్యను గుర్తించి, మురికి కాలువ రోడ్డు పక్కన శానిటేషన్లో   భాగంగా  బ్లేచింగ్ చల్లడం జరిగింది. ప్రజా శ్రేయస్సు కోసం ఏపీ ముఖ్య మంత్రి ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఎనలేని కృషి ప్రజలకు అందిస్తున్నారు. 

 

మన్యంలో పిఓ సుడిగాలి  పర్యటన.....

 

మన్యం (విలీన) మండలాల్లో జరుగుతున్న లాక్ డౌన్ ఏవిధంగా ఉందొ తెలుసుకోవాడానికి చింతూరు ఐ టీడీఏ పిఓ ఆకుల వెంకట రమణ మన్యం మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. మండలానికి వచ్చి న ఆయన జరుగుతున్న విషయాలను తహశీల్ధార్ శ్రీదర్ని ఆడిగితెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో ప్రజలు బయటకు రాకుండా చూడాలని వారి అవసరాలు తగ్గట్టుగా సహకరించాలని పిఓ  అధికారులను ఆదేశించారు. 

 

బోర్డర్ అప్రమత్తం.... ఏపీ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఒరిస్సా, చాటిషుగడ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. చింతూరుకు సమీపంలో ఉన్న ఒరిస్సా బోర్డర్ లో కల్లేరు సచివాలయ సిబ్బంది ఒరిస్సా నుండి ఏపీ రాష్ట్రానికి రాకుండా చెక్ పోస్ట్ వద్ద లాక్డౌన్ నిర్వహించారు. పెద్ద వాహనాలను సైతం ఏపీలోకి చొరబడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అసలే నాలుగు కూడలిలో చింతూరు ప్రాంతం ఉండటం వల్లన ఎటు నుంచైనా ప్రమాదం వచ్చే అవకాశాలుండటం తో ఎవరిని ఏపీలోకి రానివ్వలేదు. ఇటీవల కల్లేరు ప్రాంతంలో బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్లన ఇతర రాష్ట్రాక వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్యకు చెక్ పెట్టడానికి సచివాలయ సిబ్బంది కట్టుదిట్ట మైన చర్యలు తీసుకున్నారు.


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...