ఏలేశ్వరం, పెన్ పవర్ : నాటు పడవ మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ప్రత్తిపాడు సీఐ ఏ సన్యాసిరావు తెలిపిన వివరాల ప్రకారం....తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం, మర్రివీడు గ్రామానికి చెందిన మత్స్యకారుడైన నగెర శ్రీను వృత్తి లో బాగంగా ఏలేరు ప్రాజెక్ట్ లోకి చేపలు పట్టేందుకు గాను సుమారు ఉదయం 6 గంటలకు వెళ్ళాడని అన్నారు. వాతావరణం లో మార్పులు కారణంగా మబ్బులు కమ్ముకుని అతి వేగమైన గాలులతో అలలు రావడంతో నాటు పడవ మునిగి మరణించి ఉంటాడని తెలిపారు. ఇతనికి భార్య లక్ష్మి, కుమార్తె ఏంజెల్ ఉన్నారు. ఏలేశ్వరం ఎస్ ఐ కే సుధాకర్, విఆర్వో ఆర్ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పటల్ కు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు.
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...
No comments:
Post a Comment