Followers

ప్రజలు అందరూ సహకరించాలి



 


పెన్ పవర్, కూనవరం


జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్లోడ్ లో భాగంగా మండల తాసిల్దార్ ఏవిఎల్ నారాయణ, ఎస్ ఐ గుణశేఖర్, ఎంపీడీవో సత్యనారాయణమర్తి కూనవరం మండలంలోని రహదారులను  దిగ్బంధనం చేశారు .ప్రజలు అందరూ సహకరించాలని, ఎవరింటి వద్ద వారే ఉండాలని, దూర ప్రాంతాల నుండి కొత్తవారు గ్రామాల్లోకి వచ్చినట్లయితే గ్రామ వాలంటరీ లకు, పంచాయతీ సెక్రటరీలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఉగాది పర్వదిన జరుపుకోవాల్సిన ప్రజలు ఇళ్ల కే పరిమితం  కావడంతో మర్రిగూడెం లోని శ్రీ దేవి ముత్యాలమ్మ తల్లి జాతరకు భక్తులెవరు రావద్దని ముందు నుండే ప్రచారం చేయడంతో అమ్మవారి ఆలయం బోసిపోయింది. ఉగాది పర్వదినం నాడు ప్రతి ఒక్కరు ఉగాది పచ్చడి చేసుకోవడం మన సనాతన ధర్మం లో భాగం అప్పటికీ కోవిడ్19 వైరస్ కారణంగా ఎవరింటికి వారే పరిమితం కావడంతో ఉగాది పచ్చడి రుచి చూడక పోవడం గమనార్హం.  నిత్యవసర వస్తువులు అధిక ధరలకు అమ్మ కూడదని సామాన్లు పట్టిక షాపు ముందు ఉంచాలని దుకాణదారులకు తెలిపారు. కరోనా వైరస్,కోవిడ్ 19 వ్యాధి నివారించాలంటే ప్రజలందరూ వారి వారి గృహాలకు స్వీయ నిర్బంధం ఒకటే మందు అని ప్రజలకు తెలిసేలా ఆటో ద్వారా ప్రచారం చేశారు. వైరస్ సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చేతులను 2నిమిషాలు పాటు శుభ్రం చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రామ వాలంటరీ లు మండుటెండను లెక్కచేయకుండా రోడ్ల దిగ్బంధం చేయడంలో మరియు ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి కొత్తవారు ఎవరైనా వస్తున్నారని సమాచారం తెలుసుకోని అధికారులకు చేరవేయడంలో ముందున్నారు. జనతా కర్ఫ్యూ లో భాగంగా ప్రజలందరూ వారివారి ఇళ్లకు పరిమితం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రెవిన్యూ శాఖ, పోలీసు శాఖ, వైద్యశాఖ వారి వారి కర్తవ్యంను  నిర్వహించడం, ప్రజలకు సమాచారం చేరవేయడంలో ముందు ఉండడంతో ప్రజలందరూ ఆకర్షిస్తున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...