స్టాఫ్ రిపోర్టర్ కాకినాడ, పెన్ పవర్
COVID 19 నివారణలో భాగంగా లో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా ఎస్పి అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఒరిస్సా బోర్డరు లో -1, చత్తిస్ ఘడ్ బోర్డరు లో -1, తెలంగాణ సరిహద్దులో 2 చోట్ల ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ లు మరియు జిల్లా సరిహద్దుల్లో 8 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి పకడ్బందీగా వాహనాల రాకపోకలు నిరోధించు చున్నారు. అదేవిధంగా ఎస్పి స్వీయ పర్యావేక్షణలో వాహనదారులకు ఇటువంటి సమయంలో బయటకు రాకూడదని చెప్పి వారికి కరోనా పట్ల అవగాహన కల్పించారు. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో మంగళవారం, బుదవారం కలిపి జిల్లా వ్యాప్తంగా 100 కేసులు నమోదుచేసి .ని అరెస్టు చేసి , 46 వాహనాలు సీజ్ చేశారు. అంతేకాకుండా మోటార్ వెహికల్ చట్టప్రకారం 3,160 కేసులు నమోదు చేసి , Rs. 15,88,000 జరిమానా విధించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి అద్నాన్ నయీం అస్మి గారు మాట్లాడుతూ , ఈ కరోనా మహమ్మారి నుండి మనల్ని మనమే కాపాడుకుంటూ, మన కుటుంబ సభ్యులు అందరిని కాపాడు కోవాలని, లేని యెడల ఇది అనేక మందికి వ్యాపించే ప్రమాదం ఉందని, కావున ప్రజలందరూ ప్రభుత్వ ఉత్తర్వులు పాటించి ఎవరు బయటకు రాకుండా పోలీసువారికి సహకరించాలని, ప్రభుత్వ ఉత్తర్వులు పాటించకుండా ఎవరైనా ఉల్లంగించి నట్లయితే వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు సిబ్బంది అందరూ చాలా అంకితభావంతో కష్టపడి పని చేస్తున్నారని, ఇది చాలా హర్షించదగ్గ విషయమని వారి సేవలను కొనియాడారు. అదేవిధంగా ఈ లాక్ డౌన్ ఉన్నంతకాలం ఇదే స్ఫూర్తితో మా జిల్లా పొలిసు శాఖ లోని అందరు మీ క్షేమం కోసం రాత్రి, పగలు సేవ చేస్తామని తెలియపర్చారు.
No comments:
Post a Comment