తాణాo గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులను అందించిన లారస్ ల్యాబ్
పరవాడ, పెన్ పవర్
పరవాడ మండలo:జవహర్ లాల్ ఫార్మా సిటీ లోని లారస్ ల్యాబ్ యాజమాన్యం కరోనా లాక్ డవున్ కారణంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.కరోనా మహమ్మారి నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం విధించిన స్వీయ నిర్బంధం(లాక్ డవున్)కారణంగా నెలరోజుల నుండి ఎటువంటి ఆదాయ వనరులు లేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాణాo గ్రామ ప్రజలకు మానవతా దృక్పథంతో 1500 వందల కుటుంబాలకు లారస్ ల్యాబ్ యాజమాన్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేసినందుకు స్థానిక టిడిపి నాయకులు మాజీ జెడ్పిటిసి పయిల జగన్నాధ రావు,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కన్నూరి రమణ,జిల్లా టీ.ఎన్.టి.యు.సి జనరల్ సెక్రటరీ రొంగల గోపాలకృష్ణ,డి.ఎమ్.ఎల్.నాయుడు కంపెనీ యాజమాన్యాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.
No comments:
Post a Comment