Followers

32 మంది జర్నలిస్టులకు బియ్యం, కందిపప్పు పంపిణీ


32 మంది జర్నలిస్టులకు బియ్యం, కందిపప్పు పంపిణీ



కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి



(పెన్‌పవర్‌, పొదిలి)



కరోనా వైరస్‌ నేపథ్యంలో అహర్నిశలు కష్టపడుతున్న జర్నలిస్టు మిత్రులకు 25 కిలోల బియ్యం, 2 కిలోల కందిపప్పును అందించే కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర నాయకులు కెవి రమణారెడ్డి, కంభం ఎఎంసి ఛైర్మన్‌ వై వెంకటేశ్వరరావు సంయుక్తంగా పూనుకున్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి జర్నలిస్టులకు నిత్యావసరాలు అందించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా గత 12 రోజులుగా లాక్‌డౌన్‌ కు ప్రధానమంత్రి పిలుపునిచ్చారన్నారు. గడిచిన 12 రోజులుగా ప్రింట్‌, ఎక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా, ఇతర మీడియా ప్రతినిధులు పోలీసు, వైద్యారోగ్యశాఖలతో సమానంగా తమ వంతుగా ప్రజలకు కరోనాపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారన్నారు. పొదిలి మండలంలో , పంచాయతీలో శానిటేషన్‌ సక్రమంగా అధికారులు నిర్వహించేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఎప్పటికప్పుడు ఏఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయో వాటిని అధికారుల దృష్టి కి తేవడంతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజల ప్రాణాలపై మీ స్థాయిలో ఎన్నో జాగ్రత్తలు తెలియజేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కీకపాత్ర పోషిస్తున్నారన్నారు. మీరు చూపిన సహకారం మరువలేనిదన్నారు. పాలకులు చెపుతున్న విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువ చేస్తూ వారికి మరింత అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించింది మీడియా అన్నారు. ప్రపంచంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారా జరిగిన నష్టాన్ని, జాగ్రత్త పాటించడం వలన కలిగే లాభాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించారన్నారు. ప్రతి ఒక్కరిని జాగృతి చేసేందుకు ప్రింట్‌ మీడియా పత్రికల్లో, ఎక్ట్రానిక్‌ మీడియా డిజిటల్‌ లో ప్రజలకు చూపారన్నారు. 24 గంటలు ప్రజల ప్రాణాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారన్నారు. కోవిడ్‌ ` 19 లో మీడియా సేవ వెలకట్టలేనివి అన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య వారధులుగా మంచి పాత్ర పోషించారన్నారు. పొదిలి పంచాయతీలో ముఖ్యంగా శానిటేషన్‌ విషయంలో ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే ఆ విషయాన్ని వాట్స్‌ఆప్‌ ద్వారా అధికారులకు సమాచారం చేరవేయడం, అధికారులు వెంటనే వాటి పై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మీడియా మిత్రులు ప్రజలకు చేసిన సేవను గుర్తించిన వివేకానంద డిగ్రీ కళాశాల యాజమాన్యం మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరికి 25 కిలో బియ్యం, 2 కిలో కందిపప్పును అందించినందుకు వారికి ప్రత్యేక అభినందలను ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కెవి రమణారెడ్డి, కంభం మార్కెట్‌ యార్డ్‌ చైర్మెన్‌ ఏలం వెంకటేశ్వర రావు, వివేకానంద డిగ్రీ కళాశాల అధ్యాపకులు పోలు శ్రీనివాసరెడ్డి, భక్తవత్సల రెడ్డి, అశోక్‌, సుబ్బారెడ్డి , నాగరాజు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...