Followers

కూరగాయలను రోడ్లపై పారబోస్తున్న  రైతులు


 


  గ్రామీణ కూరగాయల రైతులపై లాక్ డౌన్   ప్రభావం.
  కష్టపడి పండించిన పంట కొనే నాథుడు లేడు.
  కూరగాయలను రోడ్లపై పారబోస్తున్నరైతులు.
  రైతు బజార్ లకు   తరలించే అవకాశం కల్పించాలి.



పెన్ పవర్,  స్టాఫ్ రిపోర్టర్ మజ్జి శ్రీనివాస మూర్తి, విశాఖపట్నం

కరోనా మహమ్మారి  నియంత్రణలో అమలు  జరుగుతు న్న లాక్ డౌన్  ప్రభావం  గ్రామీణ  కూరగాయల  రైతుల పై పడింది. కష్టపడి   పండించిన  కూరగాయలు  అమ్మటానికి  మార్కెట్ కి  తెచ్చిన రైతులకు  కొనే నాథుడు కనిపించడం లేదు. వచ్చిన  ఒకరిద్దరు  వ్యాపారులు  తోచిన ధరకు  అడుగుతున్నారు. ఆధరకు   కూరగాయలు  అమ్ముకోలేక  తిరిగి  మూసుకొని  పోలేక  వాటిని  రోడ్లపై  పారబోస్తున్నారు. బుధవారం  జిల్లాలోని  దేవరపల్లి మండల కేంద్రంలో  జరిగే  కూరగాయల బజారులో  రైతులు   కూరగాయలను  పార బోసిన సంఘటన  చోటు చేసుకుంది. సంచి పురంకు  చెందిన  రామ్మూర్తి అనే రైతు  నిగనిగలాడుతున్న తాజా  వంకాయలు  10 కేట్లలో 100 కిలోలు  రోజు మార్కెట్కి  తెచ్చారు. 11 గంటల వరకు  అడిగే నాధుడు  లేరు.ఆ తర్వాత  వచ్చిన వ్యాపారి కేటు  20 రూపాయలకు  అడగటంతో  రైతు  బిత్తరపోయాడు. కిలో  రెండు రూపాయలు  రాకపోవడంతో  రైతు  విసుగు  చెంది  మొత్తం వంకాయలను  నేలపై పోసి  నిరాశతో  వెళ్లాల్సి వచ్చింది.  దేవరపల్లి మండల కేంద్రంలో  40 ఏళ్లుగా   నిత్యం  కూరగాయల మార్కెట్  జరుగుతుంది. ఈ మార్కెట్ కు  మండలంలోని రైతులు కాకుండా చీడికాడ వేపాడ  అనంతగిరి  చిన్న సన్నకారు రైతులు కూరగాయలు పండించి  తెస్తారు. వాటిని   వ్యాపారులు కొనుగోలు చేసి విశాఖపట్నం రైతు బజార్ లకు  తరలిస్తారు.  ప్రాముఖ్యత గల కూరగాయల మార్కెట్ కావడంతో   దేవరపల్లి కి  విశాఖ నుంచి ప్రతి పదిహేను నిమిషాలకి ఒక బస్సు తిరుగుతుంటాయి.లాక్ డౌన్  కారణంగా   గ్రామీణ ప్రాంతాల్లో  సంతలు  మార్కెట్లు నిలిచిపోయాయి. కానీ  కూరగాయల మార్కెట్లకు వెసులుబాటు కల్పించారు. రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో  పట్టణాల నుంచి  వచ్చే  ఒకరిద్దరు వ్యాపారులు  ఎంతో కొంత కొని  పోతున్నారు. కాస్త  తేడా కనిపిస్తే  ఆ  కాయ కూరలను  కన్నెత్తి అయినా చూడడం లేదు.  కొందరు రైతులు  గ్రామాల్లోని  ఇంటింటికి తిరిగి   ఎంతో కొంతకి  కట్టబెడుతున్నారు. మార్కెట్లలో కిలో వంకాయలు 30 నుంచి 40 రూపాయలు అమ్ముతున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం  రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదు.



 కాయకష్టం  మిగిలింది. రైతు ఆవేదన. : ఎంతో కష్టపడి  వంగతోట  సాగు చేశాను. పంట దిగుబడి కోసం  ఎరువులు క్రిమిసంహారక మందులు  వాడను. తీరా  పంట  కోతకు వచ్చాక  బజారుకి  తీసుకుపోతే  కొనేవారు లేరు. కోసిన వంకాయలు  వృధాగా  పారేయడం బాదగా ఉంది.



  శ్రీరామ్ మూర్తి  మింది పురం రైతు...

 దేవరపల్లి  మార్కెట్లో  దళారులను  అరికట్టాలి.
రైతుల వద్ద నుంచి  కూరలు  ప్రభుత్వమే కొనాలి.
   జిల్లా కలెక్టర్ కు  సిపిఎం  డిమాండ్.
దేవరపల్లి  కూరగాయల మార్కెట్ లో  దళారుల   బెడద  ఎక్కువైందని  చిన్న సన్నకారు రైతులు  తీవ్రంగా నష్టపోతున్నారని  సిపిఎం  జిల్లా  కార్యదర్శివర్గ  సభ్యుడు  దాసరి వెంకన్న  ఆరోపించారు. రైతులకు అందుబాటులో మార్కెట్  రవాణా  సౌకర్యం లేక   పండించిన  కూరగాయలు  స్థానికంగానే  అమ్ముకోవాల్సి వస్తుందని  తెలిపారు. నిత్యం కూరగాయలు పండించే  ఈ ప్రాంత రైతులకు  విశాఖ రైతు బజార్ లలో  తన కూరగాయలను  అమ్ముకునే అవకాశం కల్పించాలని  కోరారు. రైతు బజార్ లో  అమ్ముకోవడానికి  ఆకాశం కల్పిస్తూ  గుర్తింపు కార్డులు  మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్  వినయ్ చంద్ అని  కోరారు. ఈ మేరకు  కలెక్టర్ తో పాటు  దేవరపల్లి  తహసిల్దార్  మార్కెటింగ్  శాఖలకు  పత్రాన్ని  సమర్పించామని  వెంకన్న  తల్లి పాట.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...