Followers

సామాజిక దూరం ఎలా ఉంది..!


 


సామాజిక దూరం ఎలా ఉంది..!
అంటరానితనం రుచి ఒకసారి స్వయంగా అనుభవించి చూస్తారా..?
సామజిక దూరం - 'కరోనా వైరస్'  వెర్సస్ 'కులం వైరస్'
కరోనా కాటుకి నన్నంటుకోకు నా "మాల" కాకి


 సీనియర్ జర్నలిస్ట్  మొయ్యేటి రమేష్ కుమార్, పెన్ పవర్ 


      ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికిస్తున్న మహమ్మారి "కరోనా వైరస్ - కోవిడ్-19 " సామజిక దూరం పేరుతో మనిషిని సాటి మనిషి దూరం పెట్టటడం చూస్తే ప్రస్తుత భారతదేశంలోని అంటరానితనం గుర్తుకొస్తుంది। కాస్త వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది। ప్రపంచానికి మనిషిని మనిషి దూరం పెట్టటం ఇది మొదటిసారి కావొచ్చు కానీ, ప్రాచీన భారత చరిత్ర నుండి, నేటి ప్రస్తుత భారతం వరకు భారత దేశానికీ ఈ తరహా వివక్ష కొత్త కాదు। ఇటీవల మన దేశాధినేతలు, అధికారుల, మీడియా మరియు  అందరినోటనుడి సామజిక దూరం అనే మాట విపరీతంగా వినిపిస్తుంది। కరోనా అనే వైరస్ ప్రాణాంతకం అని భయపడి దూరం పెట్టడం లో అర్ధం ఉంది। ఎందుకంటె ఈ వైరస్ నిరోధానికి ఎటువంటి మందు లేకపోవడం, విస్తృతంగా మనిషినుండి మనిషికి వ్యాపించడంతో కాస్త దూరం పాటించడం, ఒకరిని ఒకరు అంటుకోకపోవడం ద్వారా మాత్రమే ఈ వైరస్ ని నిరోధించడం సాధ్యం। అందుకే సామజిక దూరం వహించడం మంచివిషయం। కానీ ఎటువంటి అంటు రోగం కాకపోయినా, లేకపోయినా  కావాలనే ఒక పథకం ప్రకారం పరాన్నభుక్కులుగా బ్రతికే కొంత మంది హిందూ సామజిక విద్రోహులు బలహీనులను దోచుకోవడానికి, వారిని కట్టడి చేయడానికి అఖండ భారతావని చరిత్రలో మాయని మచ్చలాంటి వైరస్ ని సృష్టించారు। అదే "కులం" దీని మూలంగానే   "అంటరానితనం" అనే సామాజిక వెలివేత ఏర్పడింది।  అయితే కరోనా లా ఈ వైరస్ కంటికి కనిపించదు। ఇది ఒక మానసిక భావన మాత్రమే।    హిందూ మతోన్మాదులు అంటరానితనం అనే ఒక మానసిక రోగాన్ని ఎప్పటికి చెదరిపోని "కులం" అనే కంచు కోటలాంటి వైరస్ సృష్టించారు। ఈ వైరస్ భారిన పడి ఇప్పటివరకు కొన్ని లక్షలు మంది ఒక  సామజిక వర్గానికి చెందిన భారతీయులు మరణించారు। కులం పేరుతో కోట్ల మందిని కూడికి, గూడికి, తిండికి, బట్టకి, చదువుకి, సంపదకు చివరకి తాగే నీటికి కూడా దూరం చేశారు। ఒక ప్రత్యేక సామజిక వర్గాన్ని అంటరాదని, ముట్టరాదని, చూడరాదని, వారిని చూస్తే పాపమని, గోరమని , నేరమని ఇలా అనేక రకాలుగా చిత్ర హింసలకు గురి చేస్తూ చీత్కారాలతో, అవమానాలతో వారి మనుగడే ప్రశ్నర్ధకంగా మార్చేశారు।బానిసలుగా వారిని వాడుకున్నారు। భూమిపై హక్కును వారు కోల్పోయారు। వారిపై జరిగిన, జరిపిన దాడులు, మరణహోమాలు లెక్కకు మించినవే। ఇలా చెప్పుకుంటూ పోతే భారత దేశం చాల పెద్ద పాపాల మూట గట్టుకుందనే చెప్పాలి। మాల ముండా అని, మాల కాకి అని దుష్ట శకునాలతో పోల్చుతూ వారిని మానసికంగా క్రుంగ దీశారు । వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబలిజషన్ లో కూడా భారతీయుల్లో ఈ కులం పట్ల కనీస మార్పు రాకపోవడం ఆశ్చర్యం।  ప్రస్తుతం కరోనా వైరస్ పుణ్యమా అని భారత దేశంలో దాదాపు 11,000 కు చేరిన కరోనా రోగుల పుణ్యమా అని ప్రతి ఒక్కరు సామాజిక దూరం వహిస్తున్నారు। స్వీయ నిర్బంధం లోనికి కొందరు వెళ్లిపోయారు। కులం లేదు, మతం లేదు, ఫ్రెండ్స్ లేదు సొంతవారు సహితం ఒకరిని ఒకరు దూరం పెట్టుకుంటున్నారు। అంటరానితనం ని పాటిస్తున్నారు। ఇప్పటికే 21 రోజులు లాక్ డౌన్  గడిచిన సందర్భంలో దేశ ప్రజల మానసిక స్థితి రోజురోజుకు దిగజారిపోతోంది। ఇది మరికొన్నాళ్లు కొనసాగితే సాటి మనిషి పలకరింపు లేక, సహవాసం లేక మనుషులు నిజంగానే పిచ్చివాళ్లుగా మారిపోతారు।  అంటరాని తనాన్ని మరిపిస్తున్న ఈ కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికైనా సమాజంలోని మార్పు రావాలని, సాటి మనుషులను మనిషిగా గుర్తించి సమానత్వాన్ని పాటిస్తారేమో చూడాలి। అంటరానితనం మూలాలు ఎంత ఎంత భయంకరంగా ఉంటాయో కరోనా వైరస్ ద్వారా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే। అందుకే నెమో ప్రపంచం మొత్తం మీద భారత్ స్వీయ నిర్బంధం విధించుకుంది। ఈ కరోనా ద్వారా సాటి మనిషిని దూరం చేస్తే వచ్చే భాధ ఇలా ఉంటుందో ఈ పాటికైనా హిందూ మతోన్మాదులకి, మూర్ఖులకి అర్ధం అవుతుందని ఆశిద్దాం। కరోనా తగ్గిన వెంటనే ఇకపై అంటరానితనం అనే సామజిక దుర్మార్గానికి చరమగీతం పడదాం।మనుషులంతా ఒక్కటే అనే భావన పెంపొందించుకుందాం।


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...