Followers

Showing posts with label NATIONAL AND INTERNATIONAL. Show all posts
Showing posts with label NATIONAL AND INTERNATIONAL. Show all posts

మొబైల్ ఒక వ్యసనం అస్థిరతకు, నిద్రలేని రాత్రులకు దారితీస్తుంది

 గాడ్జెట్ ప్రభావం: మొబైల్ ఒక వ్యసనం అస్థిరతకు, నిద్రలేని రాత్రులకు దారి తీస్తుందంటున్నారు పరిశోధకులు 




న్యూస్ డెస్క్, పెన్ పవర్ 

 లండన్ కు  చెందిన  కింగ్స్ కాలేజ్  యునివర్సిటి  నుండి పరిశోధనలో  పలు  ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మొబైల్‌పై ఇటీవలి పరిశోధనలు చేసిన వీరు...   మీరు మొబైల్ వ్యసనంతో పోరాడుతుంటే, మొబైల్ నుండి దూరం కూడా ఇబ్బందికరంగా ఉందని రుజువు చేస్తోందని,  మొబైల్ నుండి దూరం కారణంగా, ప్రజలకు  రాత్రుళ్లు  నిద్ర  లేమి , మనసు  చంచలత వంటి లక్షణాలను చూపుతున్నారు. 1,043 మొబైల్ వినియోగదారులపై నిర్వహించిన ఈ పరిశోధనలో వెల్లడైందని తెలిపారు . పరిశోధనలో పాల్గొన్న వినియోగదారుల వయస్సు 18 మరియు 30 సంవత్సరాల మధ్య ఎంచుకున్నారు. 


1043 లో 406 మంది మొబైల్ వ్యసనంతో బాధపడుతున్నారు

పరిశోధనలో పాల్గొన్న వినియోగదారులలో నాలుగింట ఒకవంతు మంది రోజులో కనీసం 3 గంటలు మొబైల్ ఉపయోగించినవారే. అదే సమయంలో, 19 శాతం మంది రోజూ 5 గంటలకు పైగా మొబైల్‌తో బిజీగా ఉన్నారు. 1,043 మందిలో 406 మంది మొబైల్ వ్యసనంతో బాధపడుతున్నారు. ఈ వినియోగదారులు మొబైల్ వాడే సమయాన్ని తగ్గించలేకపోతున్నారు. మొబైల్స్ వారి నుండి దూరంగాపెట్టినప్పుడు, వారు  చాలా అసౌకర్యంగా ప్రవర్తించడం    ప్రారంభించారు. 57 శాతం మంది వినియోగదారులు నిద్రలేని రాత్రులు గడిపినట్లు పరిశోధనలో తేలింది.


స్మార్ట్‌ఫోన్ స్థాయిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి

స్మార్ట్‌లు మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా మారుతున్నాయి, వాటిని వేరు చేయడం చాలా కష్టం అని కింగ్స్ కాలేజీ మనస్తత్వవేత్త సమంతా సోని చెప్పారు. ఈ అధ్యయనం ద్వారా, ఆరోగ్యంపై స్మార్ట్ ఫోన్   ప్రభావం ఎంత చెడు ప్రభావం చూపిస్తుందో  తెలిపారు. ఇది కాకుండా, స్మార్ట్ ఫోన్    స్థాయిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.


మనస్తత్వవేత్త నికోల్ కుల్క్ మాట్లాడుతూ, మనం స్మార్ట్‌ఫోన్‌లను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తామో, నిద్రపై అంత ఎక్కువ ప్రభావం చూపుతుందని అన్నారు.


మీ మొబైల్ వ్యసనం కారణంగా ఎక్కడో ఒకటి, వాటిలో ఒకటి కాదు…

ఫేడ్ (ఫేస్‌బుక్ వ్యసనం రుగ్మత): మీరు ఫేస్‌బుక్‌లో నిరంతరం చిత్రాలను పోస్ట్ చేయడాన్ని ఇష్టపడితే మరియు మీ స్నేహితుల పోస్ట్ కంటే ఎక్కువసేపు వేచి ఉంటే, ఫేస్‌బుక్ వ్యసనం రుగ్మతగా మారి  మిమ్మల్ని ఆధిపత్యం చేస్తుందని అర్థం. ఈ కారణంగా, మీరు ఇతర సోషల్ మీడియా వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా మీ పిక్రేను కూడా రేట్ చేస్తారు.


నోమోఫోబియా: నోమోఫోబియా అంటే ఓడిపోయే భయం, మొబైల్‌ను ఉపయోగించలేకపోవడం వల్ల లేదా     ఫోన్‌లో సిగ్నల్ లేకపోవడం వల్ల లేదా బ్యాటరీ తక్కువగా ఉండటం వల్ల మీరు కలత చెందుతుంటే, అది నోమోఫోబియా యొక్క లక్షణం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది పరికరానికి మీ  అటాచ్మెంట్ ను ఒక  హానికరమైన పరిస్థితికి తీసుకుపోతుందని అంటున్నారు నిపుణులు. 


సెల్ఫిటిస్: ఇది విచక్షణారహిత సెల్ఫీలను పోస్ట్ చేయడానికి సంబంధించిన రుగ్మత. మీరు నిరంతరం సెల్ఫీ తీసుకొని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ మరియు ఇతర సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేస్తూ ఉంటే, మీరు ఈ రుగ్మత వైపు వెళుతున్నారని  అర్ధం . సెల్ఫిటిస్ అనే పదాన్ని 2014 లో కనుగొన్నారు.


IGD (ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్): మీరు కాండీ క్రష్, ఫిఫా ఆన్‌లైన్ లేదా ఇతర ఆటలను ఆడితే IGD గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆన్‌లైన్ ఆటలను ఆడాలనే అధిక కోరిక మరియు ఆట కోసం ఇతర సోషల్ మీడియా వినియోగదారులకు అభ్యర్థనలను పంపే అలవాటు అంటే మీరు ఈ రుగ్మతతో బాధపడుతున్నారని అర్థం.


ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్: ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ (పివిఎస్) అనేది ఒక రుగ్మత, దీనిలో ఫోన్ కాల్ లేకుండా కంపనం యొక్క భావన ఎప్పుడూ ఉంటుంది. ఫోన్ రింగ్ చేయనప్పుడు కూడా ఇది జరుగుతుంది. వాస్తవానికి, ఏదైనా కాల్ లేదా సందేశం తప్పిపోతుందనే భయం కారణంగా, మేము చాలా అప్రమత్తంగా ఉన్నాము మరియు ఎటువంటి కంపనం లేకుండా ధ్వనిని అనుభవిస్తాము. అయితే, మానసిక ఆరోగ్యం విషయంలో ఇది మంచిది కాదు.


ఫోమో (తప్పిపోతుందనే భయం): తప్పిపోతుందనే భయం అంటే సోషల్ మీడియాలో ఏమీ మిస్ అవ్వదు. సోషల్ మీడియాను నిరంతరం తనిఖీ చేయకుండా మీరు జీవించలేకపోతే, మీరు సోషల్ మీడియాలో ప్రతి అప్ డేట్ ను  ఇష్టపడటానికి, వ్యాఖ్యానించడానికి లేదా పంచుకునేందుకు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటారు. అలాగే సమయాన్ని వృథా చేయకుండా వెంటనే చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఫోమోలో ఉన్న అవకాశాలు బాధితులు అని అర్ధం. 


టెక్నాలజీ ఎంత పెరిగితే అంతమంచిది కానీ మనం ఆ టెక్నాలజీ ని మనం అదుపులో పెట్టుకోవాలి... మనల్ని టెక్నాలజీ అదుపులో పెట్టుకోవడం కాదు, సో  తస్మాత్ జాగ్రత్త ... 

దేశ ప్రజలకు  ఉపరాష్ట్రపతి సందేశం


కరోనా మహమ్మారి నేపథ్యంలో.. మూడో విడత లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు  ఉపరాష్ట్రపతి సందేశం


ఉమ్మడి భాగస్వామ్యం, సంఘటిత ఆచరణతో కరోనాపై పోరు సాగిద్దాం


భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు


న్యూస్ డెస్క్, పెన్ పవర్ :



కరోనా మహమ్మారి నేపథ్యంలో మే 4 నుంచి మరో 2 వారాల పాటు 3వ విడత లాక్ డౌన్ (3.O) ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించడం కోవిడ్ -19తో సాగుతున్న సమిష్టిపోరాటంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాను. నా దృష్టిలో ఈ నిర్ణయం ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత ఏజెన్సీలు, వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలతో సహా వ్యాపారుల సహకారంతో వైరస్  వ్యతిరేక పోరాటం మరింత ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ముందంజలో ఉంది. ప్రజల జీవితాల పై దృష్టి సారించి, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి యుద్ధ వ్యూహాన్ని రూపొందించి చాలా వరకూ విజయం సాధించింది. ఈ ప్రయత్నం అందించిన సానుకూల ఫలితాలను సమాజం హర్షిస్తోంది. 
లాక్ డౌన్ 3.O విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు భరోసాను అందించడం ద్వారా ప్రజల ప్రాణాలు మరియు జీననోపాధిని ఏక కాలంలో సమతుల్యం చేయవలసిన అవసరాన్ని స్పష్టంగా గుర్తించాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం మొదలు కానుంది. గ్రీన్ జోన్స్ లో చాలా భాగం, ఆరెంజ్ జోన్స్ లో కొంత భాగం ఆవసరమైన ఆర్థిక పునరుజ్జీవనానికి పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇక్కడి ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత మార్గంలో అడుగు ముందుకు వేయాలి.
ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభమౌతున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే ఇలాంటి వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదు. మొదటి, రెండవ లాక్ డౌన్ సమయాల్లో తీసుకువచ్చిన గొప్ప మార్పులు, రాబోయే కాలంలో వైరస్ పూర్తిగా అంతమొందే వరకూ అన్ని చోట్ల కొనసాగుతూనే ఉండాలి. మాస్క్ లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, సమావేశాలు నిర్వహించకపోవడం లాంటి వాటి ద్వారా ఇప్పటి వరకూ ఎంతో లబ్ధి పొందాం. ఇక మీదట కూడా ఇదే మార్గంలో పయనించాలి. ఎందు కంటే కనిపించని ఈ శత్రువు మనం ఆలసత్వం వహిస్తే మళ్ళీ విజృంభించే ప్రమాదం ఉంది. 
సమర్థవంతమైన నిర్ణయాల ద్వారా కోవిడ్ -19 వ్యతిరేకపోరాటంలో భారతదేశంలో ముందంజలో ఉంది. దీన్ని నేను కోవిడ్ – కామనాలిటి ఆఫ్ విజన్, ఇంటెంట్ అండ్ డిటర్మినేషన్ *(‘COVID’ – Commonality of Vision, Intent and Determination)* గా భావిస్తున్నాను. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో విభిన్న భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో నివసిస్తున్న 130 కోట్ల మంది భారతీయులు అనుసరించిన ఇలాంటి సాధన ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు వంటి ముందు వరుస యోధులతో పాటు రైతులు, ప్రజలు కూడా ప్రశంసలకు అర్హులే. కానీ ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోలేదు, సాధించాల్సిన విజయం చాలా ఉంది. కోవిడ్ వైరస్ అన్ని వర్గాలతో కలిసి ఎక్కువ కాలం జీవించగలదని అంచనా వేసిన నేపథ్యంలో, మనం ఈ మహమ్మారి నిజాన్ని అంగీకరిస్తూనే దూరం చేసే ప్రయత్నాలు కొనసాగించాలి.  
లాక్ డౌన్ 3.Oలో మనమంతా ప్రవర్తించే విధానం మీద ఆధారపడే కరోనా తర్వాత సాధారణ స్థితికి తిరిగి రావడానికి ఉద్దేశించిన తదుపరి చర్యలు ఉంటాయి. రెండు వారాల పరిమితి, భవిష్యత్ కార్యాచరణ కాలపరిమితిని నిర్ణయిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రాథమిక పరీక్ష. ఒక దేశంగా, మనమంతా ఇందులో కచ్చితంగా ఉత్తీర్ణులం కావడం అత్యం కీలకం. ఇందులో మనం ఏ విధంగానూ విఫలం కామని నా గట్టి నమ్మకం. ఇంతకు ముందు నేను చెప్పినట్లు తదుపరి పొడిగింపు, సడలింపు, ముగింపు నిర్ణయం తీసుకోవడం కచ్చితంగా మన చేతుల్లోనే ఉంది.
ఈ దిశలో పౌరులందరూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్! కాకినాడ మడ అడవులపై ఉన్నత స్థాయి కమిటీని నియమించిన NGT 


కాకినాడ మడ అడవులపై ఉన్నత స్థాయి కమిటీని నియమించిన NGT 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్!


 


న్యూస్ డెస్క్, పెన్ పవర్


అంథ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో పేదలందరికీ ఇళ్ళు అనే పథకంలో భాగంగా కాకినాడకు చెందిన విలువైన భూములు కల పట్టణంలో 50 వార్డులకు చెందిన 24,388 మంది లబ్ధిదారులను ఎంపికచేసి, వారికి నగరంలో పూర్తి స్థాయిలో భూమి లభించక పోయే సరికి, కాకినాడ పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన భూములు 1978/79 నుంచి అభివృద్ధి చేయలేదు అనే ఉద్దేశంతో, సర్వే నంబరు.376 పార్టు, 375/1, 1985/పార్టు మరియు 2004/పార్టులో ఉన్న 100 ఎకరాల పైన "మడ అడవులు" ఉన్న భూమిని కలెక్టరు గారు ప్రజా ప్రయోజనాల నిమిత్తం తీసుకోని పేదలకు ఇళ్ళు పథకం అమలు కింద జత చేసి, మడ అడవులను నరికివేసి, అక్కడ నేలను పూర్తిగా మట్టి పోసి చదును చేయటం, అందునా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ నిభంథనలు దేశమంతా అమలులో ఉన్న సమయంలోనే చేయటంతో, స్థానికంగా ఉన్న దుమ్మల పేట, పర్లో పేట గ్రామాలకు చెందిన పల్లేకారులు రోడ్డు పైకి వచ్చి అథికారుల ప్రవర్తనను నిరసించటం జరిగింది లాక్ డౌన్ నిబందనలను కూడా ఉల్లంఘన చేసి మరీ ప్రభుత్వం జీవవైవధ్యాన్ని ధ్వంసం చేస్తున్న విషయాన్ని ప్రముఖ పర్యావరణ పరిరక్షణవేత్త శ్రీ బోలిశెట్టి సత్యనారాయణ గారి దృష్టికి స్థానిక పల్లేకారులు తీసుకురావటంతో అయన సదరు "మడ అడవులు" CRZ ప్రకారం రక్షిత కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిథిలో ఉన్న భూములుగా గుర్తించి, దీని పైన ప్రథాన మంత్రి, కేంద్ర అటవీశాఖ మంత్రి, రాష్ట్ర   ముఖ్యమంత్రి, రాష్ట్ర పర్యావరణ సంస్థల దృష్టిలో పెట్టినప్పటికి, మడ అడవుల నరికివేత కోనసాగుతూ ఉండటంతో, సి.అర్.జెడ్. నిబంధనలు, 2011 మరియు 2019; పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986; అటవీ పరిరక్షణ చట్టం, 1980;  వన్య ప్రాణుల పరిరక్షణ చట్టం, 1972 జాతీయ జీవ వైవిధ్య చట్టం,2002 మరియు రాజ్యాంగ అథికరణాలు.48-A, 51-A(g) ఉల్లంఘనలు కింద జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసు నెంబరు.65/2020ని ది.16-04-2020న దాఖలు చేయటం జరిగింది. దీని పైన కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖలను, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టరు లను ప్రతివాదులగా చేర్చటం జరిగింది. 


దీని పైన జాతీయ హరిత ట్రిబ్యునల్ లో నేడు అనగా ది.30-04-2020న వాదనలు జరిగినవి. 


దీని పైన రాష్ట్ర హైకోర్టులో కూడా ఇదే అంశం పైన కేసు దాఖలు చేయటం జరిగింది మరియు యథాతథ స్థితిని కోనసాగించాలని ది.27-04-2020న ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది, హైకోర్టు ఉత్తర్వులు నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ అత్యవసరంగా ఈ కేసును వినాల్సిన అవసరం లేదంటూ వాదించగా, పిటిషనరు తరపు న్యాయవాది సదరు వాదనను తిప్పికోడుతూ, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ, ఇంకా అక్కడ పనులు జరుగుతున్నాయి అనే వాదన చేయటంతో, జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పందించి దిగువ తెలిపిన విథంగా ఉత్తర్వులు మథ్యంతరంగా జారీ చేయటం జరిగింది. అవి


1) ఐదుగురు సభ్యులతో కూడిన పరిశీలన బృందాన్ని నియమించటం జరిగింది. దీనిని చెన్నైకి చెందిన కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖకు చెందిన ప్రాంతీయ కార్యాలయం సీనియర్ అథికారి నేతృత్వం వహిస్తారు. దీనిలో రాష్ట్ర కోస్తా తీర ప్రాంతం అథారిటీ సీనియర్ అథికారి, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాథికారి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు మరియు కాకినాడ జిల్లా అటవీ అథికారి సభ్యులుగా ఉంటారు. 


2) సదరు పైన తెలిపిన కమిటీ  నేటి నుంచి అరు నెలల వెనుక వరకు కేంద్ర అటవీ శాఖ అథ్వర్యంలో ఉన్న కాకినాడ మడ అడవుల సాటిలైట్ చిత్రాల అథారంగా సదరు ప్రాంతాన్ని పరిశీలన చేయాలి. దీనికి చెన్నై ప్రాంతీయ కార్యాలయం సహకారం అందించాలి.


3) సదరు కమిటీ కాకినాడ మడ అడవులు నరికివేత ఏ స్థాయిలో జరిగింది, ఏంత మేరకు జరిగింది, ఏంత మేరకు మడ అడవులకు నష్టం జరిగింది, మరలా మడ అడవి పునరుద్ధరణకు ఏంత ఖర్చు అవుతుంది, మడ అడవులను నరకటం వలన పర్యావరణానికి ఏంత మేరకు నష్టం జరిగింది అనే వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలన, పరిశోధన చేసి మూడు నెలలో సదరు కమిటీ తన పూర్తి స్థాయి రిపోర్టును జాతీయ హరిత ట్రిబ్యునల్లో దాఖలు చేయాలి మరియు దాని కాపీలను పిటిషనరు, ప్రతివాదుల న్యాయవాదులకు కూడా అందచేయాలి.


4) ఒకవేళ సదరు మడ అడవులు ప్రాంతంలో ఏదైనా నిర్మాణాలు జరిగిన పక్షంలో, అవి జాతీయ హరిత ట్రిబ్యునల్ తుది తీర్పుకు మాత్రమే లోబడి ఉంటాయి. 


5) ఒకవేళ పై తెలిపిన కమిటీ నివేదికలో మడ అడవుల నరికివేత జరిగినట్లుగా తెలిసినచో, దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత ఉన్నతాథికారులు భాథ్యులు అవుతారని, పర్యావరణానికి జరిగిన నష్టానికి పూర్తి స్థాయిలో వారే భాథ్యులు అవుతారని, సదరు నష్టపరిహారం పూర్తిగా వారి నుంచే స్వాధీనం చేసుకుంటామని కూడా తెలియ చేసింది. 


6) తదుపరి విచారణను ది.18-08-2020కి వాయిదా వేయటం జరిగింది


లాక్ డౌన్ సమయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడంపై సుప్రీం కోర్టు ప్రముఖ లాయర్ శ్రీ సంజయ్ ఉపాధ్యాయ అన్నారు


పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత


ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సందేశం


 


న్యూ ఢిల్లీ , పెన్ పవర్ ప్రతినిధి


ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నేలను, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులం కావాలి. మన పెద్దలు మనకు అందించిన స్వచ్ఛమైన పర్యావరణాన్ని, యధావిధిగా మన ముందు తరాలకు అందించేందుకు ప్రతిన బూనాల్సిన అవసరం ఉంది.


నేల తల్లి అనే మాట వినపడగానే మా తాతగారు గుర్తుకు వస్తారు. చిన్నతనంలో ఆయన దగ్గరే పెరగడం వల్ల నా జీవితం మీద, నా వ్యక్తిత్వం మీద ఆయన ప్రభావం చాలానే ఉంది. నేల గురించి ఆయన చెప్పిన కొన్ని మాటలు నాకు ఇప్పటికీ గుర్తే. *“నేల... తల్లి లాంటిది. మనల్ని పెంచి పోషించడానికి అమ్మ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో, అమ్మను జాగ్రత్తగా చూసుకోవడానికి మనం కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. అమ్మ లేని మనిషే కాదు, అన్నం తినని మనిషి కూడా ఉండడు. అందుకే ప్రతి మనిషి నేలను అమ్మలాగే చూసుకోవాలి”* అని ఆయన ఎప్పుడూ చెబుతుండే వారు. అందుకే నేను పర్యావరణ పరిరక్షణ గురించి చెబుతూ ఉంటాను. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం ద్వారానే మనిషి మనుగడ సరైన మార్గంలో ముందుకు సాగుతుందని విశ్వసిస్తుంటాను.


విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి శిఖరాల్ని చూస్తున్న తరుణంలో భూ పరిరక్షణ గురించి మాట్లాడుకోవలసి రావడం ఒక్కోసారి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మన పూర్వికులు మనకు ఎంతో స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించారు. అయితే దాన్ని మనం ఎంత వరకూ కాపాడుకుంటున్నామని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నేల బాగుంటే మనమూ బాగుంటాం. అలాంటి తల్లి  అనాలోచిత మానవ చర్యల వల్ల కలుషితం అవుతూనే ఉంది. ప్రకృతి విరుద్ధంగా చేస్తున్న చర్యల వల్ల భూమి వేడెక్కుతోంది. ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల వాయు కాలుష్యం పెచ్చు మీరుతోంది. నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతున్నాయి. చివరకు నేలను అమ్మకన్నా మిన్నగా చూసుకునే అన్నదాతలు సైతం రసాయనాల వాడకంతో నేలతల్లి పట్ల చేస్తున్న అపచారాన్ని గుర్తించడం లేదు.


1970లో ప్రారంభమైన ఈ ధరిత్రి దినోత్సవం 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ ఏడాది పర్యావరణ చర్యలు (climate action) నేపథ్యంతో జరుపుకుంటున్నాం. వాతావరణ మార్పులు ప్రస్తుతం ప్రపంచానికి సవాలు విసురుతున్నాయి. అందుకే ఈ ఏడాది ఈ అంశాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో మన జీవితాలను మార్చేందుకు అదే విధంగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మన జీవన విధానంలో మార్పులు రావలసిన అవసరం ఉంది. ఇది ఒక రోజుకు కాదు మన జీవితానికి అన్వయించుకోవలసిన అవసరం ఉంది.


ఇందు కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. తరిగిపోయే వనరులకు బదులు, పునర్వినియోగించుకోగలిగే వనరుల మీద దృష్టి పెట్టాలి. పర్యావరణ పరిరక్షణతో పాటు హరిత ఆర్థికాభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలి. చౌకైన, సమర్థవంతమైన సౌర విద్యుత్ లాంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించగలిగే సాంకేతిక పరిజ్ఞానం మీద దృష్టి పెట్టాలి. అడవుల పెంపకం, జీవ వైవిధ్య సంరక్షణ కోసం ప్రతిన బూనాలి. వ్యక్తిగత రవాణా స్థానంలో సమర్థవంతమైన ప్రజారవాణాను వినియోగించుకోవాలి. వీటితో పాటు ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. రసాయనాలు వాడని వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం అందించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉందో, ప్రతి మనిషి బాధ్యత కూడా అంతే ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించగలిగితే, ధరిత్రి దినోత్సవం గురించి ఇలా మాట్లాడుకోవలసిన అవసరం రాదని భావిస్తున్నాను.


ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మన మధ్య దూరం ఉండాలని చెబుతుందే తప్ప, పర్యావణాన్ని కాపాడుకునే దిశగా మనం వేసే అడుగులను అది ఆపలేదు. అంతే కాదు భయపడి పారిపోతుంది కూడా. ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే భూతాపం మరింత పెరిగి, 2100 కల్లా భూమి మీద మానవుడు బ్రతికే పరిస్థితి ఉండబోదని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం, సస్యశ్యామలాం మాతరం వందే మాతరం... అని నిత్యం నినదించే మనం భవిష్యత్ తరాలకు ఎలాంటి భూమిని అందించబోతున్నాం. వందేమాతరం గీతం స్ఫూర్తిని ప్రతి మదిలోనూ నింపుకుని మన నేలతల్లిని మనమే కాపాడుకునేందుకు సిద్ధం కావాలి. మన పూర్వీకులు అందించిన స్వచ్ఛమైన గాలి, నీరు, నేలను యధావిధిగా ముందు తరాలకు అందించడం తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పరిశుభ్రత, పచ్చదనంతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను.


రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జాబితాను ప్రకటించిన కేంద్రం


 


రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జాబితాను ప్రకటించిన కేంద్రం


(ఎడిషన్ ఇంచార్జ్ గంట్యాడ అప్పలరాజు పెన్ పవర్, విశాఖపట్నం)


 


రెడ్ జోన్లో 170 జిల్లాలు, ఆరెంజ్ జోన్లో 207, మిగతావి గ్రీన్ జోన్లో


రెడ్ జోన్లో రెండు రకాలు. విస్తృతి ఎక్కువున్నవి 143 (లార్జ్ ఔట్‌బ్రేక్), క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలు


14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే  రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు - ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పు


ఏపీలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్


తెలంగాణలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు:    హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్


తెలంగాణలో రెడ్ జోన్ (హాట్‌స్పాట్ క్లస్టర్) జిల్లాలు: నల్గొండ


*తెలంగాణలో ఆరెంజ్ జోన్ (నాన్-హాట్‌స్పాట్) జిల్లాలు:* సూర్యాపేట, ఆదిలాబాద్. మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట


రైతులను ఆదుకునేందుకు కేంద్రం చర్యలు


లాక్ డౌన్ సమయంలో రైతులు, వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి


- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన


- రైతులతోపాటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడండి



- ఏపీఎంసీ చట్టంలో మార్పులు చేస్తూ.. రైతుల వద్దనుంచే వ్యవసాయ ఉత్పత్తులు కొనే ఏర్పాట్లు చేయాలి



- కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో ఉపరాష్ట్రపతి సమావేశం.. లాక్ డౌన్ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ



*- రైతులను ఆదుకునేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఉపరాష్ట్రపతికి వివరించిన కేంద్ర మంత్రి


 (స్టేట్  న్యూస్ డెస్క్ ఇంచార్జ్ వై. కైలాసరావు,    పెన్ పవర్)


లాక్ డౌన్ సందర్భంగా రైతులు, వ్యవసాయరంగానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వ్యవసాయ పనుల్లో, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చొరవతీసుకోవాలని సూచించారు. 
బుధవారం ఉపరాష్ట్రపతి నివాసంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తో ఉపరాష్ట్రపతి సమావేశమయ్యారు. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. అన్నదాతలతోపాటు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు చేపట్టాలన్నారు. 
‘చాలా సందర్భాల్లో వినియోగదారుల గురించి ఆలోచించినంతగా.. అన్నదాతల ఆలోచనలు, ఇబ్బందుల గురించి సమాజం, మీడియా, ప్రభుత్వాలు ఆలోచించవనే విమర్శ వినబడుతోంది. కానీ రైతుల ఇబ్బందులను పరిష్కరించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. రాష్ట్రాలు దీనిపై చొరవతీసుకోవాలి. కేంద్రం సమయానుగుణంగా రాష్ట్రాలకు ఈ విషయంలో సూచనలు చేస్తుండాలి’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. పళ్లు, కూరగాయల వంటి వాటిపై మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టాలని.. వీటిని భద్రపరిచడం, రవాణా అవకాశాలు పెంచడం, మార్కెటింగ్ విషయంలో ప్రత్యేక చొరవతీసుకోవాలని సూచించారు. రైతులు మార్కెట్ కు వెళ్లి వారి ఉత్పత్తులను విక్రయించడం కంటే.. ఏపీఎంసీ చట్టంలో మార్పులు తీసుకొచ్చి నేరుగా రైతుల వద్దకే వెళ్లి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే అవకాశం, వీటిని రాష్ట్రంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. తద్వారా వినియోగదారులకు కూడా సరిపోయేంతగా పళ్లు, కూరగాయలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉండేందుకు వీలవుతుందన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సుగమం చేసేలా అధికారులు చొరవతీసుకోవాలని.. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుత పంటకోతల సమయాన్ని గుర్తుచేస్తూ.. వ్యవసాయ యంత్రాలు, ఇతర పరికరాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచడంపై దృష్టిపెట్టాలన్నారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలను కేంద్ర వ్యవసాయ మంత్రి.. సవివరంగా ఉపరాష్ట్రపతికి తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నామని శ్రీ తోమర్ వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలో రైతులకు సహాయం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా హామీ ఇచ్చారు.


సామాజిక దూరం ఎలా ఉంది..!


 


సామాజిక దూరం ఎలా ఉంది..!
అంటరానితనం రుచి ఒకసారి స్వయంగా అనుభవించి చూస్తారా..?
సామజిక దూరం - 'కరోనా వైరస్'  వెర్సస్ 'కులం వైరస్'
కరోనా కాటుకి నన్నంటుకోకు నా "మాల" కాకి


 సీనియర్ జర్నలిస్ట్  మొయ్యేటి రమేష్ కుమార్, పెన్ పవర్ 


      ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికిస్తున్న మహమ్మారి "కరోనా వైరస్ - కోవిడ్-19 " సామజిక దూరం పేరుతో మనిషిని సాటి మనిషి దూరం పెట్టటడం చూస్తే ప్రస్తుత భారతదేశంలోని అంటరానితనం గుర్తుకొస్తుంది। కాస్త వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది। ప్రపంచానికి మనిషిని మనిషి దూరం పెట్టటం ఇది మొదటిసారి కావొచ్చు కానీ, ప్రాచీన భారత చరిత్ర నుండి, నేటి ప్రస్తుత భారతం వరకు భారత దేశానికీ ఈ తరహా వివక్ష కొత్త కాదు। ఇటీవల మన దేశాధినేతలు, అధికారుల, మీడియా మరియు  అందరినోటనుడి సామజిక దూరం అనే మాట విపరీతంగా వినిపిస్తుంది। కరోనా అనే వైరస్ ప్రాణాంతకం అని భయపడి దూరం పెట్టడం లో అర్ధం ఉంది। ఎందుకంటె ఈ వైరస్ నిరోధానికి ఎటువంటి మందు లేకపోవడం, విస్తృతంగా మనిషినుండి మనిషికి వ్యాపించడంతో కాస్త దూరం పాటించడం, ఒకరిని ఒకరు అంటుకోకపోవడం ద్వారా మాత్రమే ఈ వైరస్ ని నిరోధించడం సాధ్యం। అందుకే సామజిక దూరం వహించడం మంచివిషయం। కానీ ఎటువంటి అంటు రోగం కాకపోయినా, లేకపోయినా  కావాలనే ఒక పథకం ప్రకారం పరాన్నభుక్కులుగా బ్రతికే కొంత మంది హిందూ సామజిక విద్రోహులు బలహీనులను దోచుకోవడానికి, వారిని కట్టడి చేయడానికి అఖండ భారతావని చరిత్రలో మాయని మచ్చలాంటి వైరస్ ని సృష్టించారు। అదే "కులం" దీని మూలంగానే   "అంటరానితనం" అనే సామాజిక వెలివేత ఏర్పడింది।  అయితే కరోనా లా ఈ వైరస్ కంటికి కనిపించదు। ఇది ఒక మానసిక భావన మాత్రమే।    హిందూ మతోన్మాదులు అంటరానితనం అనే ఒక మానసిక రోగాన్ని ఎప్పటికి చెదరిపోని "కులం" అనే కంచు కోటలాంటి వైరస్ సృష్టించారు। ఈ వైరస్ భారిన పడి ఇప్పటివరకు కొన్ని లక్షలు మంది ఒక  సామజిక వర్గానికి చెందిన భారతీయులు మరణించారు। కులం పేరుతో కోట్ల మందిని కూడికి, గూడికి, తిండికి, బట్టకి, చదువుకి, సంపదకు చివరకి తాగే నీటికి కూడా దూరం చేశారు। ఒక ప్రత్యేక సామజిక వర్గాన్ని అంటరాదని, ముట్టరాదని, చూడరాదని, వారిని చూస్తే పాపమని, గోరమని , నేరమని ఇలా అనేక రకాలుగా చిత్ర హింసలకు గురి చేస్తూ చీత్కారాలతో, అవమానాలతో వారి మనుగడే ప్రశ్నర్ధకంగా మార్చేశారు।బానిసలుగా వారిని వాడుకున్నారు। భూమిపై హక్కును వారు కోల్పోయారు। వారిపై జరిగిన, జరిపిన దాడులు, మరణహోమాలు లెక్కకు మించినవే। ఇలా చెప్పుకుంటూ పోతే భారత దేశం చాల పెద్ద పాపాల మూట గట్టుకుందనే చెప్పాలి। మాల ముండా అని, మాల కాకి అని దుష్ట శకునాలతో పోల్చుతూ వారిని మానసికంగా క్రుంగ దీశారు । వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబలిజషన్ లో కూడా భారతీయుల్లో ఈ కులం పట్ల కనీస మార్పు రాకపోవడం ఆశ్చర్యం।  ప్రస్తుతం కరోనా వైరస్ పుణ్యమా అని భారత దేశంలో దాదాపు 11,000 కు చేరిన కరోనా రోగుల పుణ్యమా అని ప్రతి ఒక్కరు సామాజిక దూరం వహిస్తున్నారు। స్వీయ నిర్బంధం లోనికి కొందరు వెళ్లిపోయారు। కులం లేదు, మతం లేదు, ఫ్రెండ్స్ లేదు సొంతవారు సహితం ఒకరిని ఒకరు దూరం పెట్టుకుంటున్నారు। అంటరానితనం ని పాటిస్తున్నారు। ఇప్పటికే 21 రోజులు లాక్ డౌన్  గడిచిన సందర్భంలో దేశ ప్రజల మానసిక స్థితి రోజురోజుకు దిగజారిపోతోంది। ఇది మరికొన్నాళ్లు కొనసాగితే సాటి మనిషి పలకరింపు లేక, సహవాసం లేక మనుషులు నిజంగానే పిచ్చివాళ్లుగా మారిపోతారు।  అంటరాని తనాన్ని మరిపిస్తున్న ఈ కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికైనా సమాజంలోని మార్పు రావాలని, సాటి మనుషులను మనిషిగా గుర్తించి సమానత్వాన్ని పాటిస్తారేమో చూడాలి। అంటరానితనం మూలాలు ఎంత ఎంత భయంకరంగా ఉంటాయో కరోనా వైరస్ ద్వారా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే। అందుకే నెమో ప్రపంచం మొత్తం మీద భారత్ స్వీయ నిర్బంధం విధించుకుంది। ఈ కరోనా ద్వారా సాటి మనిషిని దూరం చేస్తే వచ్చే భాధ ఇలా ఉంటుందో ఈ పాటికైనా హిందూ మతోన్మాదులకి, మూర్ఖులకి అర్ధం అవుతుందని ఆశిద్దాం। కరోనా తగ్గిన వెంటనే ఇకపై అంటరానితనం అనే సామజిక దుర్మార్గానికి చరమగీతం పడదాం।మనుషులంతా ఒక్కటే అనే భావన పెంపొందించుకుందాం।


తెలుసుకుంటూ... తెలియజేస్తూ... అర్థవంతంగా సమయాన్ని గడుపుదాం


తెలుసుకుంటూ... తెలియజేస్తూ... అర్థవంతంగా సమయాన్ని గడుపుదాం


ఉపరాష్ట్రపతి ఫేస్ బుక్ నుంచి యధాతధంగా


పాఠకుల కోసం...... 
కొంత మంది మిత్రులు ఈ లాక్ డౌన్ (స్వీయ నిర్బంధం) సమయంలో మీరేం చేస్తున్నారు, ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతుండే మీకు ఇంట్లో పొద్దు ఎలా గడుస్తోంది అని ఆసక్తిగా అడుగుతూ ఉన్నారు. మిత్రులందరికీ సామాజిక మాధ్యమం (ఫేస్ బుక్) ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.
ముఖ్యంగా ఆందరి ప్రశ్నా ఒక్కటే... ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా అవిశ్రాంతంగా తిరిగే మీకు ఒకే చోట ఇన్నేసి రోజులు గడపడం ఎలా సాధ్యమైందా అని. లాక్ డౌన్ ప్రారంభించిన సందర్భంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫోన్ ద్వారా మాట్లాడుతూ, క్షణం కూడా తీరిక లేకుండా తిరిగే మీలాంటి వారికి ఇది మరీ కష్టం అంటూ చమత్కరించారు. దీనికి సమాధానం చెప్పాలంటే నేనెంతో అభిమానించే కవి డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని సంపాదించి పెట్టిన విశ్వంభర పుస్తకంలోని నా జీవితాన్ని ప్రతిబింబించే ఓ నాలుగు మాటలు చెబితే సరిపోతుందని భావిస్తున్నాను.
ఋషిత్వానికి పశుత్వానికీ.... సంస్కృతికీ దుష్కృతికీ....
స్వచ్ఛందతకూ నిర్బంధతకూ... సమార్ధ్రతకూ, రౌద్రతకూ...
తొలిబీజం మనసు... తులారూపం మనసు...
మనసుకు తొడుగు మనిషి... మనిషికి ఉడుపు జగతి...
ఇదే విశ్వంభరాతత్త్వం... ఇదే అనంత జీవిత సత్యం...
ఏదైనా మనసులోనే ప్రారంభం కావాలి. దేనికైనా మనసే ముందుగా సిద్ధంగా కావాలి. ఆ తర్వాత మనిషి సిద్ధం అవుతాడు. ఈ చిన్న కిటుకు తెలిస్తే... ఎవ్వరైనా సరే దేన్నైనా ఆనందంగా స్వీకరించగలరు. నిజానికి విద్యార్థి దశ నుంచి అంటే 70వ దశకం నుంచి ఈనాటి వరకూ ఎక్కువ సమయం ఒకే చోట గడిపిన సందర్భాలు లేవు. ఎప్పుడూ ప్రజల్లో తిరగడం, కలవడం, మాట్లాడడానికి అలవాటు పడిన నేను ఇలా స్వీయ నిర్బంధంలో (ఎమర్జెన్సీ మినహా) ఉండడం ఎప్పుడూ అలవాటు లేదు. ఇది కొత్త అనుభవం. మంచి పుస్తకాలు చదవడం, మంచి ఆలోచనలు పెంచుకోవడం, పంచుకోవడం లాంటి వాటి ద్వారా ఈ సమయాన్ని మరింత నిర్మాణాత్మకంగా గడిపేందుకు ప్రయత్నిస్తున్నాను.  నా కాళ్ళను కట్టేసి, మనసు వేగాన్ని మరింత పెంచి, దినచర్యలో స్వల్పమార్పులు చేసుకుని ఈ స్వీయనిర్బంధాన్ని పాటిస్తున్నాను. మనసును సిద్ధం చేయడం తప్ప, నేను దీని కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు.
ఇక రోజు వారి దినచర్య విషయానికి వస్తే ఎప్పటిలాగే ఉదయాన్నే 5 గంలకు నిద్ర లేవడంతో నా రోజు ప్రారంభం అవుతోంది. కాల కృత్యాలు తీర్చుకుని 5.30 గంటల నుంచి 6 గంటల వరకూ శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను వింటూ మనసారా ఆనందిస్తున్నాను. ఉదయాన్నే ఒక కప్పు గ్రీన్ టీ. పసుపు, జిలకర, దాల్చిన చెక్క పొడి, అల్లం, నిమ్మరసం, స్వల్పంగా తేనె కలిపిన వేడి తేనీరు తీసుకుంటాను. గ్రీన్ టీతో పాటు రాత్రి నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష, వివిధ రకాల ఆరోగ్యవంతమైన మొలకెత్తిన విత్తనాలు కూడా తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఆరోగ్యం దృష్ట్యా కొంత ప్రొటీన్స్ అవసరం.
ఇక 6 గంటల నుంచి 7 గంటల వరకూ తెలుగు, ఆంగ్లము, హిందీ భాషల దినపత్రికలను ఎక్కువ భాగం ఆన్ లైన్ ద్వారా కొన్నింటిని నేరుగా చదువుతున్నాను. వాటిలో ప్రాముఖ్యత గల అంశాలను, వ్యాసాలను అండర్ లైన్ చేసి, సహాయకులు వచ్చిన తర్వాత వాటిని వేరుగా తీయించి, జతపరచి భవిష్యత్ అవసరాల కోసం ఫైల్ చేయిస్తుంటాను. 7 గంటల నుంచి అరగంట సేపు శ్రీమతి ఉషమ్మతో పాటు ఉపరాష్ట్రపతి నివాసం చుట్టూ ఉన్న పచ్చికలో నడక, ఆ తర్వాత 15 నిముషాల పాటు తేలికపాటి యోగ చేస్తాను. 8 గంటల నుంచి కాసేపు మిత్రులతో, ఇష్టులతో ఫోన్లో సంభాషించండం, తర్వాత స్నానం పూర్తి చేసి గం. 8-45 కు ఉపాహారం. 
తర్వాత గం. 9-15 నుంచి గం.10-00 వరకూ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు, నేటి అవసరాలను, పరిస్థితులను బట్టి, నా ఆలోచనలు, ప్రజల నుంచి వచ్చిన సూచనల గురించి మంత్రులు, అధికారులతో మాట్లాడతాను. ముఖ్యమైన వాటిని అవసరమైనప్పుడు ప్రధానికి తెలియజేస్తాను. 10 గంటల నుంచి ఉపరాష్ట్రపతి నివాసం వెలుపలి ప్రాంగణంలోని పెద్ద వృక్షం కింద కూర్చుని రాజ్యసభ, ఉపరాష్ట్రపతి కార్యాలయం అధికారులతో ముఖ్యమైన అంశాలు ఫోన్లో మాట్లాడతాను. అత్యవసరమైన ఫైళ్ళు ఏవైనా ఉంటే వాటిని చూస్తాను. ఈ లోగా శ్రీమతి ఉషమ్మ తన పూజా, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని వస్తే, 11 గంటల నుంచి 12.30 వరకూ దేశంలోని, రాష్ట్రంలోని మిత్రులను, పాత సహచరులను ఫోన్ ద్వారా పలకరించి, ఈ సమయంలో ఎలా ఉన్నారో తెలుసుకుంటాము. ఉషమ్మ మా చుట్టు పక్కల గ్రామాల బంధుమిత్రులను చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ఫోన్లో పలకరించి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత మా పిల్లలతో మాట్లాడతాము. చెన్నైలో ఉన్న మా అల్లుడు, కుమార్తె, మనవడు, మనవరాలితో... తదుపరి హైదరాబాద్ లో ఉన్న కుమారుడు, కోడలు, మనుమరాళ్ళతో మాట్లాడతాము. వారి క్షేమ సమాచారం తెలుసుకుంటాము. ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే చర్చిస్తాము. 
తర్వాత సరిగ్గా 1 గంటకు మధ్యాహ్న భోజనం చేస్తాము. మేమిద్దరమే కాకుండా, మాతో పాటు ఉంటున్న పిన్నమ్మ సుశీలమ్మ గారితో కలిసి భోజనం చేస్తాము. ఆ తర్వాత ఖాళీగా ఉన్నాం కాబట్టి గంటసేపు విశ్రాంతి తీసుకుంటాము. మధ్యాహ్నం పైన 3 నుంచి 4 గంటల మధ్యలో కాస్త మనసు తేలిక కలిగించే ఘంటసాల, సుశీలమ్మ, జానకి, బాలు లాంటి వారి పాత పాటలు గానీ, చిన్న చిత్రాలు గానీ విని, చూసి కాసేపు కాలక్షేపం చేసి, 4 గంటలకు మళ్ళీ గ్రీన్ టీ తాగి బయటకు వెళ్ళి చెట్టు కింద కూర్చుని ఆఫీసు విషయాలు ఏవైనా ఉంటే శ్రీ విక్రాంత్ తదితర సహాయకుల ద్వారా తెలుసుకోవడం, సూచనలు ఇవ్వడం, వచ్చిన కాల్స్ అన్నింటికీ సమాధానం చెప్పడం, మళ్ళీ శ్రీమతి ఉషమ్మ, నేను కలిసి 5 గంటల వరకూ ఫోన్ ద్వారా మిత్రుల క్షేమ సమాచారం కనుక్కుని, కాసేపు కబుర్లు చెప్పుకుంటూ, ఆయా ప్రాంతాల విశేషాలు కనుక్కోవడం చేస్తాము. పాత రోజులను, పాత జ్ఞాపకాలను రోజుకు ఒక్కసారైనా తలచుకుని ఆనందిస్తుంటాము. అంతే కాకుండా కనీసం వారానికి ఒకరోజు స్వర్ణభారత్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని, సూచనలు అందిస్తూ, సేవచేయడంలో లభించే తృప్తిని ఆనందిస్తుంటాను.  5.30 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకూ నడక, దాని కంటే ముందు ఉపరాష్ట్రపతి నివాసం వెనుక ఉన్న తోటలో కూరగాయలు ఎలా ఉన్నాయి, ఏమేం పెరుగుతున్నాయి, వాటి మంచి చెడు చూసి, చుట్టూ ఉన్న పుష్పాలు, వాటి ప్రగతి, తోటపనుల్లో తీసుకోవలసిన చర్యల గురించి తోటమాలితో చర్చిస్తాము. మేము కూడా స్వయంగా సహకరిస్తాము. ఈ తోటలో మంచి కూరగాయలతో పాటు ఆకుకూరలు పండిస్తున్నాము. రోజూ ఇద్దరం కలిసి ఎంపిక చేసిన కూరగాయలతో చక్కని తెలుగు వంటకాలు చేసుకుని, చేయించుకుని తిని ఆనందిస్తున్నాము. వీటితో పాటు అదనంగా రోజూ కోడిగుడ్లను కూడా తింటూ ఉంటాము. స్వయంగా ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన శుచి, శుభ్రత కలిగిన ఈ కూరగాయలు తింటుంటే లభించే ఆనందం చెప్పనలవి కానిది. మేము మాత్రమే కాదు, మా దగ్గరలో ఉన్న, సహకరిస్తున్న అందరికీ ఉషమ్మ కూరగాయలు పంచి ఇచ్చి ఆనందిస్తూ ఉంటుంది.. 
తర్వాత 6.30కు వచ్చి ఆవరణలో ఉన్న చిన్న పాటి పాత ఆంజనేయ స్వామి దేవస్థానం ముందు కూర్చుని ఉషమ్మ పాత భజనల క్యాసెట్  పెడితే, ఇద్దరం కలిసి కాసేపు ఆనందిస్తాము. తర్వాత కాసేపు ఇద్దరం మాట్లాడుకుని, రేపటి వంటకాలు ఏమిటి అని చర్చించుకుంటాము. తర్వాత వంట మనిషి కేదార్ కు తగిన సలహాలు ఇచ్చి, 7 గంటలకు లోపలకు వచ్చి, 7 గంటల నుంచి 8 గంటల వరకూ ముఖ్యమైన వార్తలు ఏవైనా ఉంటే సమీక్ష చేసుకోవడం, తేలిక పాటి తెలుగు పాటలు వినడం, రాత్రి 8-30 కి త్వరగా భోజనం చేసి, 9 గంటలకు నిద్రకు ఉపక్రమించడం. ఈ మధ్యలో నేను వ్యక్తిగతంగా సేకరించిన కొన్ని పుస్తకాలను సందర్భాన్ని బట్టి చదువుతూ ఉంటాను. దేశనాయకుల జీవితాలు, రాజ్యాంగ సభల్లో, నేటి కాలపు చట్టసభల్లో చేసిన అర్థవంతమైన ప్రసంగాలు చదువుతున్నాను. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలను గమనిస్తున్నాను. మంచి సందేశాలను మిత్రులకు పంపిస్తున్నాను. సంక్షిప్తంగా ఇదీ ఈ మధ్యకాలంలో మా దినచర్య. ఈ మధ్యలో నియమాల ప్రకారం ఉపరాష్ట్రపతి కార్యాలయ వైద్యులు వచ్చి క్షేమ సమాచారాన్ని విచారిస్తుంటారు. 
ఉపరాష్ట్రపతి నివాసంలో పని చేసే సిబ్బంది చాలా వరకూ వాళ్ళ ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇక్కడకు వచ్చి పని చేసే వారిని దాదాపు ఆపేయడం జరిగింది. పారిశుద్ధ్య, వైద్య మరియు రక్షణ సిబ్బందికి మాత్రం మినహాయింపు లేదు. ఎందుకంటే అది నియమాలకు విరుద్ధం. వంటశాలతో సహా మిగతా వ్యక్తిగత సిబ్బందిని గణనీయంగా తగ్గించి, అవసరమైనప్పుడు మాత్రమే పిలుస్తున్నాం. ఐ.ఏ.ఎస్. అధికారులు సహా ఇతర సహాయ సిబ్బందిని కూడా ఇంటి నుంచే ఆన్ లైన్ ద్వారా పని చేయమని సలహా ఇవ్వడం జరిగింది. 
ఎప్పటికప్పుడు దేశం, రాష్ట్రాలు పరిస్థితుల గురించి సమీక్షించి ముఖ్యమైన విషయాలపై ఉపరాష్ట్రపతి పరిధిలో ఆలోచించి, వ్యాసాలు తయారు చేసి, అప్పుడప్పుడు వివిధ భాషల్లోని పత్రికలకు పంపడం, ప్రజల్లో చైతన్యం కలిగించండం, ముఖ్యంగా ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్ఓ, అంతర్జాతీయ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుల సందేశాలు గమనించి, వాటిలో ఉపయుక్తమైన వాటిని ట్విట్టర్ ద్వారా జన చైతన్యం కోసం అందించడం జరుగుతుంది. కొన్ని విషయాలపై వివిధ రంగాల్లో నిష్ణాతులైన మిత్రులతో కూడా చర్చిస్తుంటాము. 
నిజానికి ఈ కార్యక్రమాలను నేను చాలా కాలంగా ఆచరిస్తున్నాను. చాలా మంది మిత్రులు అడుగుతున్నారు గనుక ఇది రాస్తున్నాను. ఇదేం గొప్ప విషయం కాదు. తెలుసుకోవాలనుకున్న వారికి సమాచారం మాత్రమే. దానితో పాటు కలిగిన ప్రయోజనాలు ఏమిటంటే, నేను మా శ్రీమతి ఉషమ్మ జీవితంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ సమయం కలిసి ఉన్నాం. మాట్లాడుకుంటున్నాం. కబుర్లు చెప్పుకుంటున్నాం. (ముఖ్యంగా మా శ్రీమతి ఆనందిస్తోంది)  నేను 1970లో పెళ్లైన నాటి నుంచి పట్టుమని 10 రోజులు ఎప్పుడూ ఇంటి పట్టున ఉండలేదు. కారణం మీకు తెలుసు. రెండోది ప్రస్తుతం కుటుంబ సభ్యులు అందరం వేరు వేరుగా ఉంటున్నా, ప్రతి రోజు మాట్లాడుతున్నాను. మూడోది పెద్ద వాళ్ళను పలకరించే అవకాశం, తద్వారా వారికి కలిగే ఆనందం పొందుతున్నాం. శ్రీ అద్వానీజీ, శ్రీ జోషి, శ్రీ మన్మోహన్ సింగ్, శ్రీ దేవగౌడ, శ్రీ ఎ.కె.ఆంటోని, శ్రీ శాంత కుమార్, శ్రీ డి.రాజ, శ్రీ రామ్ నాయక్, శ్రీ మోతీలాల్ వోరా, శ్రీ అహ్మద్ పటేల్, శ్రీ కేశుభాయ్ పటేల్, శ్రీ ఎం.ఎస్. స్వామి నాథన్, శ్రీ మెట్రో శ్రీధరన్, శ్రీమతి జూపూడి హైమావతమ్మ, శ్రీ తుర్లపాటి కుటుంబరావు, శ్రీ పీవీ చలపతిరావు లాంటి పాతకాలంలో పని చేసిన అనేక మంది పెద్దలను పలకరిస్తున్నాను. వివిధ పార్టీల పార్లమెంట్ సభ్యులు, ప్రముఖ పాత్రికేయుల క్షేమసమాచారాలు కనుక్కుంటున్నాను. ఇది వారికి, నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. మన సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ శక్తివంతమైనది. అది వివిధ కారణాలతో బలహీనపడుతోంది. వేగవంతమైన జీవితంలో వేరుగావేరుగా ఉంటున్న వారందరూ ఈ సమయంలో కుటుంబంలోని వారితో కలిసి మెలసి మాట్లాడుకోవడం, అవకాశం ఉన్న చోట కలిసి ఉండడం, ఇలాంటివి మళ్ళీ మన కుటుంబ వ్యవస్థను పటిష్ట పరుస్తున్నాయి. 
ప్రకృతికి సంబంధించి కాలుష్యానికి పెట్టింది పేరైన మన రాజధాని నగరంలో కాలుష్యం గణనీయంగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. రణగొణ ధ్వనులు లేవు. మరి ఉపరాష్ట్రపతి నివాసంలో అయితే, గతంలో కన్నా పక్షుల కిలకిలారావాలు చక్కగా వినిపిస్తున్నాయి. రోజూ కొన్ని నెమళ్ళు సహా అన్ని రకాల పక్షులు వచ్చి, విహరించి, కాసేపు చెట్ల మీద గడిపి సమూహాలుగా వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ప్రకృతి సమతౌల్యతకు ఉపయోగపడుతున్నాయని పెద్దలు, శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతే కాదు అందరం అవసరాన్ని మించి ఏ వస్తువూ వాడడం లేదు. ముఖ్యంగా వాహనాలు వంటివి బయటకు తీసే పరిస్థితి లేదు. అన్నింటికీ మించి మన ఆరోగ్యాలపై శ్రద్ధ చూపించే అవకాశం అందరికీ కలిగింది. 
మన ప్రధాన మంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సకాలంలో తీసుకుంటున్న అనేక చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. సంక్షోభ సమయంలో కలిసి మెలసి ఉండి ఎలా సహకరించుకోవాలో, మనమంతా ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థం చేసుకుంటున్నాం. అనుభవం ఏం చెబుతోందంటే, ఈ వైరస్ నిరోధానికి సులభమైనది, అన్నింటికీ మించిది సామాజిక దూరాన్ని పాటించడం. రెండోది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం. వైద్యులు, శాస్త్తజ్ఞులు, ప్రభుత్వాల సలహాలు పాటించడం. ప్రపంచ దేశాల పరిణామాలు, ఆయా దేశాల జనాభా, అక్కడ సంభవించిన దుర్మరణాలతో పోల్చి చూసుకుంటే 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఈ మహమ్మారిని నియంత్రించగలగడం మన ప్రజల సహకారం, క్రమశిక్షణ దేశ నేతృత్వ దూరదృష్టికి నిదర్శనం. విశ్వంభర కావ్యంలో చెప్పినట్టు...
కుత్తుకలను నరికితే కాదు... గుండెలను కలిపితే గెలుపు
వినాశం జరిగితే కాదు... వివేకం పెరిగితే గెలుపు...
సమరం రగిలించేది భీతి... సహనం వర్షించేది ప్రీతి
అనురాగం చేసే శాసనమే... అసలైన రాజనీతి
ఈ విజయం ఒత్తిడితో సాధించింది కాదు. ప్రజల నమ్మకం నుంచి సాధించింది. ప్రజలంతా కలసి కట్టుగా గెలిపిస్తున్నది.
కోవిడ్ మహమ్మారితో జరిగే పోరులో ఐక్య భారతం తప్పక విజయం సాధిస్తుంది. ఈ మహమ్మారిని అరికట్టే సామర్థ్యం రాజకీయ సంకల్పంతోనే గాక, వివిధ రంగాల వృత్తి నిపుణులు అందించే సహకారంతో ముడిపడి ఉంది. ఈ మహమ్మారి అధిగమించే క్రమంలో కరోనా ఆందోళనను అధిగమించేందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కరోనా వార్తలను రోజుకు ఒక్కసారి తెలుసుకుంటే చాలు. రోజంతా దానినే చూడడం, ఆలోచించడం లాంటివి మంచిది కాదు.. స్వీయ నిర్బంధంలో ఉంటూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇప్పటికే మీరు కీలకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జరిగేదేదో జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మీ ఆతురత వల్ల మీరు పొందేది ఏమీ లేదు. అమితాసక్తి, ఆదుర్దా, ఆందోళన అనంతరం ఆవేదన కలిగిస్తాయి. అందువల్ల రోజుకు ఒక్కసారికి మించి కరోనా వార్తలు వినకూడదు. భయం లేకుండడం అనే గుణాన్ని ఆత్మ గొప్ప లక్షణాల్లో ఒకటిగా భగవద్గీత చెబుతోంది. ధైర్యంతో మీ మనసును నింపండి. దేవుడి మీద విశ్వాసం ఉంచండి. మరీ ముఖ్యంగా పొద్దునే నిద్ర లేచిన వెంటనే మొబైల్ చూడడం, నిద్రకు ఉపక్రమించే ముందు టీవీ, మొబైల్, కంప్యూటర్ లాంటి వాటి ముందు కూర్చోవడం అస్సలు మంచిది కాదనే విషయాన్ని గ్రహించాలి. నిద్ర లేచిన వెంటనే తలుపులు, కిటికీలు తెరచి బయటకు చూస్తూ ప్రకృతిని, సూర్యోదయాన్ని ఆస్వాదించండి. తద్వారా మంచి ఆలోచనలు వస్తాయి.
ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉల్లాసం కలుగుతుంది. వైరస్ తో చేస్తున్న ఈ యుద్ధంలో అందరితో కలిసి ఆలోచనలు పంచుకోవడమే విజయాన్ని సాధించే మార్గం.  పెద్దలు, పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని సదుపయోగం చేసుకోవాలి. పిల్లలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బామ్మ, తాతయ్యలతో తగిన సమయం గడిపి విలువైన ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలు, పెద్దలు అందరూ కూర్చుని కాసేపు అనుభవాలు, అనుభూతులు కలబోసుకోవాలి. కలిసి పంచుకోవాలి. పిల్లలు వంటపని, ఇంటి పనిలో తల్లిదండ్రులకు సహకరిస్తూ నేర్చుకోవాలి. పాత మిత్రులను బంధువులను ఫోన్ ద్వారా పలకరించేందుకు కూడా ఇదో మంచి అవకాశం.  పాఠశాలలు, కళాశాలలకు ఇచ్చిన సెలవులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మాతృభాషతో పాటు, హిందీ, ఆంగ్లంతో పాటు పొరుగు భాషలు అదనంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, వ్యాయామం, పాకశాస్త్రం, రచనలు ఇలా వేటిలో అభిరుచి ఉంటే వాటిని సాధన చేయాలి. ముఖ్యంగా ఈ సమయంలో పెద్ద బాల శిక్ష, పంచతంత్రం లాంటి విజ్ఞానాన్ని పెంచే ప్రాచీన పుస్తకాలతో పాటు అలనాటి చందమామ, బాలమిత్ర సంపుటాలను చదివే అలవాటు చేసుకోండి. పిల్లలతో పాటు పెద్దలు కూడా చదవడం వల్ల ప్రాపంచిక పరిజ్ఞానం పెరుగుతుంది.  తోటి వారికి సహకరించేందుకు, కష్టాల్లో ఉన్న అన్నార్తులను, పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థల సేవాకార్యక్రమాలకు సహకారం అందజేద్దాం.  
కరోనా మహమ్మారి మీద జరుపుతున్న ఈ పోరులో కలిసి ముందుండి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన ప్రాణాల కోసం శ్రమిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, శానిటరీ సిబ్బంది, పోలీసులు తదితరులకు సంఘీభావం తెలుపుతూ చప్పట్ల ద్వారా తెలియజేయడం గానీ, ప్రియమైన ప్రధాని పిలుపునకు దేశ వ్యాప్తంగా అద్భుతమైన రీతిలో స్పందించి, దీపాలు వెలిగించి ఆయన చెప్పిన విధంగా "మనం అన్నివైపుల నుంచీ ఒక్కొక్క దీపంతో నిలబడినపుడు ఏ సామూహిక లక్ష్యం కోసమైతే మనం పోరాడుతున్నామో ఆ దిశగా వెలుగుకు గల అద్భుత శక్తిని మనం అనుభూతి చెందగలం. ఆ వెలుగులో.. ఆ మెరుపులో... ఆ ప్రకాశంలో... మనం ఒంటరులం కామని, మనలో ఎవరూ ఒంటరిగా లేరని, 130 కోట్లమంది భారతీయులమైన మనమంతా ఓ సామూహిక లక్ష్యసాధనకు కట్టుబడి ఉన్నామని దృఢంగా సంకల్పం చెప్పుకుందాం" అనే మాటలు అనుసరించి మనందరికీ ఈ అంధకారాన్ని పారదోలే శక్తి ఉందని, ఎవరూ ఒంటరి వారిమి కాదని నిరూపించగలిగాం. ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగించాలి. ఎందుకంటే మన ఐసీఎంఆర్. శాస్త్రజ్ఞులు, ఈ వ్యాధి ఒక వ్యక్తి నుంచి 406 మందికి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ఇంకొంత కాలం మనం జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సూచనలతో పాటు, ప్రభుత్వాలు పెట్టే నిబంధనలు స్వచ్ఛందంగా పాటించాలి. మనిషి తలుచుకుంటే ఇదేమంత పెద్ద విషయం కాదు. ఆలోచనలు పెంచుకుందాం, పంచుకుందాం. అదే విధంగా ఐశ్వర్యాన్ని పంచుకుని, ఆనందాన్ని పెంచుకుందాం. ఈరోజు ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడుతూ.. సప్త పదులు అంటే సప్త విధులను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఎంతో ఆలోచించి, ప్రపంచవ్యాప్త పరిస్థితిని, శాస్త్రజ్ఞుల సలహాలను ముఖ్యమంత్రులతో సంప్రదించి ఇచ్చిన పిలుపు ఇది. లాక్‌డౌన్‌లో ఏప్రిల్ 20 నుంచి కొన్ని మినహాయింపులు ఇస్తామన్నారు. ఈ పరీక్షా సమయంలో మన ప్రవర్తనను బట్టి.. పొడగింపు, సడలింపు, ముగింపు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఉపరాష్ట్రపతికి ఉన్న సౌకర్యాలు అందరికీ ఉండకపోవచ్చు. మనకున్న పరిమితుల్లో మనసును అదుపులో పెట్టుకుని మన దైనందిన కార్యక్రమాలు రూపొందించుకోవాలి. ఇదే నా మిత్రులకు, ప్రజలకు నేనిచ్చే సలహా. మరింత పట్టుదలతో, సంయమనంతో మనం కలిసి నడుద్దాం. ఈ మహమ్మారిని ఎదుర్కొందాం. ఏదైనా, ఏమైనా మనసుని గెలిచిన మనిషికే సాధ్యం. మనం అంతిమంగా విజయం సాధిస్తాము.


కువైట్ లో  వలస కార్మికులకు భోజన పంపిణీ


 మా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో కువైట్ లో  వలస కార్మికులకు భోజన పంపిణీ


 


న్యూస్ డెస్క్, పెన్ పవర్ :గంట్యాడ అప్పలరాజు


మహమ్మారి కరోన వైరస్ వల్ల కువైట్ లో  కర్ఫ్యూ  ఉన్న నే పద్యంలోఈరోజు కువైట్ మాలియ పరిసరప్రాంతంలో  మా యూత్ వెల్ఫేరే అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో 100 మంది వలసకార్మికులకు, రోజువారీ కూలీలకు, అభాగ్యులకు భోజనం సమకూర్చి అందజేశారు. అలాగే ముర్గాప్ అనేప్రతంలో 50 మంది సభ్యులకు  ఆహార పంపిణీ చేశారు  ఈ కార్యక్రమం చేసినందుకు మా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అలీ  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సురేష్. ఖాదర్వాలి.గౌస్. త్రినాద్ మునిర్ తదితరులు నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు.


ముగ్గురమ్మలకు జేజేలు




కరోనా పై యుద్దంలో భారత్ ను అగ్రభాగాన నిలబెట్టిన  ముగ్గురమ్మలకు జేజేలు


 


న్యూస్ డెస్క్, పెన్ పవర్ 


 


అగ్రదేశాల వెన్ను విరిచిన కరోనా భారతదేశంలో తలవంచడానికి ముగ్గురు మహిళా అధికారులు కీలకమైన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత రెండు నెలల నుండి ఆఫీసు లోనే నివాసముంటూ, కుటుంబాలను కూడా కలవలేకపోయిన
ఈ ముగ్గురు భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమయ్యారు. వీరే  ప్రీతి సుడాన్, డాక్టర్‌ నివేదిత గుప్త, సైంటిస్ట్ 
రేణు స్వరూప్.  ప్రీతి సుడాన్ - హెల్త్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ  ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పీజీ చేసి వరల్డ్ బాంక్ లో కూడా పని చేశారు. ఇప్పుడు కరోనా యుద్ధంలో నరేంద్ర మోడీ గారితో ప్రత్యక్షంగా పని చేస్తూ మన్ననలు పొందుతున్నారు. చైనా లోని వూహాన్ నుండి 645 మంది భారతీయుల ను స్వదేశానికి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. .


డాక్టర్ నివేదిత గుప్త - 
స్వయంగా ఏం బి బి ఎస్  అయిన ఈమె మాలిక్యులర్ మెడిసిన్ లో పీహెచ్‌డీ చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో డెంగ్యూ, చికెన్ గున్యా, సార్స్, నిఫా వైరస్ లను ఎదుర్కోవడంలో ఈమె కృషి ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. ఇప్పుడు కరోనా యుద్ధంలో పరీక్షా పద్ధతులు, గైడ్ లైన్స్ రూపొందించడమే కాకుండా దేశ వ్యాప్తంగా 182 లేబరేటరీలను కొద్ది రోజుల వ్యవధిలో నిర్మించారు. వీటికి అవసరమైన పరికరాలు, ముడి పదార్ధాలు, టెక్నీషియన్ల శిక్షణ మొదలైన వాటిని స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రపందేశాలను సమన్వయం చేస్తున్నారు. 


 డాక్టర్ రేణు స్వరూప్ - జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ లో పీహెచ్‌డీ చేసిన  ఈ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త నరేంద్ర మోడీ గారి శాస్త్ర సలహాదారుల కమిటీలో సేవలందిస్తున్నారు. కరోనా పై యుద్ధంలో దేశవ్యాప్త పరిశోధనా సంస్థలు, పరిశ్రమలను సమన్వయం చేస్తూ మందులను, వాక్సిన్ ను తయారుచేయడంలో తలమునకలై ఉన్నారు. ఈమె 2001, 2007, 2015 లో రూపొందించిన బయో టెక్నాలజీ విజన్ డాక్యుమెంట్లు  ఎన్నో ప్రశంసలు పొందాయి.


వీరే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరో ఇద్దరు అధికారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో మొదటి వారు 
లవ్ అగర్వాల్. ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఐఏఎస్ సాధించిన ఈ 48 ఏళ్ల యోగా నిపుణుడు విశాఖ జిల్లా కలెక్టర్ గా,  ఆంధ్రప్రదేశ్ హెల్త్ కమీషనర్ గా పనిచేశారు. ఇప్పుడు ఢిల్లీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రతి రోజు ప్రెస్ బ్రీఫింగ్ చేస్తున్నారు. అనేక వినూత్న ప్రయోగాలతో ప్రపంచదేశాలకు ఆదర్శమవుతున్నారు. మొబైల్ ఫోన్ల కరోనా కాలర్ ట్యూన్, కంటైన్మెంట్ స్ట్రాటజీ, సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్, క్లస్టర్ ఔట్ బ్రేక్ స్ట్రాటజీలు ఈయన రూపొందించినవే. మరో వ్యక్తి డాక్టర్ జితేంద్ శర్మ. సత్య సాయి బాబాకు అత్యంత విశ్వాసపాత్రుడు, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ గా పని చేసిన  ఈయనను మళ్ళీ ఏపీ మెడ్ టెక్ ఎం.డీ గా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ టెక్నాలజీ అధిపతిగా నియమించారు. ఈయన పని ప్రారంభించిన కొద్ది రోజులలోనే దేశంలోనే మొట్టమొదటి గా రాపిడ్ టస్ట్ కిట్స్ ను తయారు చేయిస్తున్నారు. ఇవి కేవలం యాభై నిముషాలలో కరోనాను నిర్ధారిస్తాయి. ప్రస్తుతం రోజుకు రెండు వేల కిట్లు తయారవుతుండగా వచ్చే వారానికి ఇది ఇరవై ఐదు వేలకు చేరుతుందని అంచనా. మార్చి 31నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కేవలం 148 వెంటిలేటర్లు ఉండగా, జితేంద్ర శర్మ గారి నేతృత్వంలో నెలకు మూడు వేల వెంటిలేటర్లు తయారుచేయడానికి కృషి జరుగుతోంది. దీనితో ఆసియా మొత్తానికి ఈయన కృషి ఫలితాలు అందనున్నాయి.


గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్


గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్


- కరోనా నేపథ్యంలో ఆధ్యాత్మికవేత్తలు, మతపెద్దలతో మాట్లాడి సభలు, సమావేశాలు నిర్వహించకుండా చొరవతీసుకోవాలి


- పంటకోతలు, వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలని సూచన


- వైద్యులపై దాడులు హేయమైన చర్య.. కరోనాపై పోరాటంలో ముందుండి నడిపిస్తున్న వారిపై దాడులు జరగకుండా ప్రజలను చైతన్య పరచాలి


- వలస కూలీలకు భోజన, వసతుల ఏర్పాట్లు చేయడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి


న్యూస్ డెస్క్, పెన్ పవర్


కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆధ్యాత్మికవేత్తలు, మతపెద్దలతో మాట్లాడి.. వారి అనుచరులు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకుండా, సామాజిక దూరాన్ని పాటించేలా చొరవతీసుకోవాలని గవర్నర్లు, లెఫ్టినెంట్  గవర్నర్లకు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ.. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను అమలు చేసేలా ఆధ్యాత్మికవేత్తలు, మతపెద్దలకు సూచించాలన్నారు. గౌరవ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి ఉపరాష్ట్రపతి ఇవాళ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
ఇటీవల జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాన్ని చూపడాన్ని ఉటంకిస్తూ.. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు అప్రమత్తంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ‘మీ రాష్ట్రాల్లో ఎలాంటి ఆధ్యాత్మికపరమైన సభలు, సమావేశాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. నచ్చజెప్పండి. వినకుంటే చట్టపరమైన తక్షణ చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. ప్రజలందరు ఇళ్లలోనే ఉంటూ.. మత ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.
పంట కోతలతోపాటు వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం సేకరణ, వీటి నిల్వల కోసం ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని వారికి ఉపరాష్ట్రపతి కోరారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వ్యవసాయ యంత్రాలను సమకూర్చడంతోపాటు మిగిలిన సౌకర్యాలు కల్పించే విషయంలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు చొరవతీసుకోవాలన్నారు. 100 శాతం ధాన్యం సేకరణ జరిగేలా చూడాలన్నారు.
పలుచోట్ల డాక్టర్లపై, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను ఉపరాష్ట్రపతి ఖండించారు. దురదృష్టకరమైన ఇలాంటి ఘటనలు వైద్యుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులపై దాడులు జరగకుండా ప్రజలను చైతన్య  పరచాలన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు అందిస్తున్న సేవలను మరువలేనివని.. వారు మనకోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారనే విషయాన్ని ప్రజలకు అవగతం చేయించాలన్నారు.
విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సులు అందించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను కూడా ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.
వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పరిస్థితి, ప్రజలకు అందాల్సిన నిత్యావసర వస్తువులు, మందుల పంపిణీకి సంబంధించిన వివరాలను కూడా ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. వలస కూలీల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాయశక్తులా కృషిచేస్తున్నప్పటికీ.. సమాజం కూడా వారికి భోజనం, వసతి కల్పించడాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. 
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు సామాజిక దూరంతోపాటు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటిస్తున్నారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఇకపైనా నిబంధనలను అతిక్రమించకుండా.. ఇదే స్ఫూర్తితో ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ సూచనలకు అనుగుణంగా నడచుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునందుకుని ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 35 మంది గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వారి రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వారు వివరించారు.


ఏప్రిల్ 5న రాత్రి 9 గంట‌ల‌కు దీపాలు వెలిగించండి :  ప్ర‌ధాని మోదీ


ఏప్రిల్ 5న రాత్రి 9 గంట‌ల‌కు దీపాలు వెలిగించండి :  ప్ర‌ధాని మోదీ


న్యూస్ డెస్క్, పెన్ పవర్


ప్ర‌ధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు.  130 కోట్ల మంది ప్ర‌జ‌ల సామూహిక శ‌క్తి.. ప్ర‌తి ఒక్క‌రిలో క‌నిపించింద‌న్నారు. దేశ‌మంతా ఒక్క‌టై క‌రోనాపై పోరాటం చేసింద‌న్నారు.  ప్ర‌జ‌లు ఈశ్వ‌ర స్వ‌రూప మ‌న్నారు.  కోట్లాది మంది ప్ర‌జ‌లు ఇండ్ల‌ల్లో ఉన్నార‌న్నారు.  క‌రోనాతో ఏర్ప‌డిన నిరాశ నుంచి ఆశ వైపు ప్ర‌జ‌ల్ని తీసుకువెళ్లాల‌న్నారు.  క‌రోనాతో ఏర్ప‌డిన అంధ‌కారాన్ని పోగొట్టేందుకు దివ్య వెలుగుల్ని ప్ర‌స‌రింప‌చేయాల‌న్నారు.  ఏప్రిల్ 5వ తేదీన‌.. 130 కోట్ల మంది ప్ర‌జ‌లు మ‌హాశ‌క్తి జాగ‌ర‌ణ చేయాల‌న్నారు.  దేశ ప్ర‌జ‌లు మ‌హాసంక‌ల్పాన్ని ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఇంట్లో లైట్లు బంద్ చేసి.. దీపాల‌ను వెలిగించాల‌న్నారు. కేవ‌లం 9 నిమిషాల స‌మ‌యాన్ని కేటాయించాల‌న్నారు. టార్చ్‌లైట్ అయినా.. దీపం అయినా వెలిగించాల‌న్నారు.  ఆ ప్ర‌కాశంతో అంధ‌కారాన్ని పార‌ద్రోలాల‌న్నారు.  మేం ఒంట‌రిగా లేమ‌న్న సందేశాన్ని వినిపించాల‌న్నారు.  ఎవ‌రూ కూడా రోడ్ల‌పై వెళ్ల‌కూడ‌ద‌న్నారు.  సామాజిక దూరాన్ని ఎప్పుడూ ఉల్లంఘించ‌కూడ‌ద‌న్నారు. క‌రోనా సైకిల్‌ను బ్రేక్ చేసేందుకు ఇదొక్క‌టే మార్గ‌మ‌ని ప్ర‌ధాని తెలిపారు.  5వ తేదీన ఒంట‌రిగా కూర్చుని మ‌హాభ‌ర‌తాన్ని గుర్తు చేసుకోండ‌న్నారు. 130 కోట్ల ప్ర‌జ‌ల సంక‌ల్పాన్ని ఆలోచించాల‌న్నారు.  గెల‌వాల‌న్న ఆత్మ‌విశ్వాసాన్ని నింపుకోవాల‌న్నారు.  మ‌న ఉత్సాహాన్ని మించిన శ‌క్తి ఏదీ లేద‌న్నారు. ఈ ప్ర‌పంచంలో మ‌న‌శ‌క్తితో జ‌యించ‌లేనిది ఏదీ లేద‌న్నారు.


మీకోసం, మన సమాజం కోసం ఈ ఆదివారం ఇంట్లోనే ఉండండి

 


కరోనా సమస్య పరిష్కారానికి మీ పక్కనున్నవారికి మార్గదర్శనం చేయండి


పార్టీలకు అతీతంగా భారతీయులమందరం కరోనాపై పోరాటం చేద్దాం


 భారతీయులకు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు


బ్యూరో రిపోర్ట్ న్యూఢిల్లీ, పెన్ పవర్



కరోనా వైరస్ మరింతగా విస్తరించకుండా నిరోధించేందుకు ఉద్దేశించిన జనతా కర్ఫ్యూలో భారతీయులంతా స్వచ్ఛందంగా పాల్గొని ఈ వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగస్వాములు కావాలని  భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు  పిలుపునిచ్చారు. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. జన సమూహాలకు దూరంగా ఉండటం (సోషల్ డిస్టెన్సింగ్) ద్వారానే.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వీలుంటుందన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ ద్వారా కరోనాను అరికట్టవచ్చన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు.. ఆదివారం (మార్చి 22న) జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. కరోనా వైరస్ రూపంలో దేశం ఎదుర్కొంటున్న ఈ సమస్యను ఎదుర్కొనడంలో రాజకీయ పార్టీలు, పౌరసమాజంలోని వివిధ సంస్థలు, ప్రజలందరూ సంయుక్తంగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో మన పక్కవారిని చైతన్య పరిచేబాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.
ఉపరాష్ట్రపతి భారత ప్రజలకు ఇచ్చిన పిలుపులోని అంశాలు:
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రభావం చూపుతోంది. అన్ని దేశాలకు ఇది సవాల్ విసురుతోంది. భారత్ సహా ఇతర దేశాలన్నీ కరోనా (కోవిడ్19) వికృతరూపంతో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని భారతదేశం నుంచి తరిమికొట్టాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం అసాధారణ చర్యలు తీసుకుంటోంది. భారతీయుల ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులకు భారతదేశం అందిస్తున్న చికిత్సను, కరోనాను అరికట్టేందుకు భారత్‌లో జరుగుతున్న ప్రయత్నాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది. అంతమాత్రాన మనం అలసత్వానికి చోటివ్వకూడదు. ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలను మరింత విస్తృత పరిచడంలో భాగస్వాములవ్వాలి. కరోనా విస్తృతిలో మూడోదశ అయిన సామాజిక అంటు (కమ్యూనిటీ కంటామినేషన్) రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం. వచ్చే మరికొద్ది వారాలు మనకు అత్యంత కీలకం, రెండోదశ నుంచే వెనక్కు వెళ్లేలా చేయాల్సిన తక్షణావసరం ఉంది. 
జన సమూహాలకు దూరంగా ఉండటం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల సూచన మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భారతీయులంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మనం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సూచించిన సమయంలో ఇంట్లోనే ఉండటం ద్వారా వైరస్ చనిపోతుంది. తద్వారా సామాజిక అంటు శృంఖలాన్ని కొనసాగకుండా ఆపేసినట్లవుతుంది. ఇది మీతోపాటు మీ సమాజాన్ని పరిరక్షించుకోవడానికి తోడ్పడుతుంది. 
అందుకే దేశ ప్రజలందరినీ నేను కోరుతున్నదొక్కటే.. దయచేసి ఆదివారం మీరెవరూ ఇళ్లలోనుంచి బయటకు రాకండి. అలాంటప్పుడే ప్రపంచదేశాలకు, ప్రభుత్వాలకు, ప్రజలకు సవాల్ విసురుతున్న కరోనాను ఎదుర్కునేందుకు వీలవుతుంది. 
ఇలాంటి అత్యంత కీలకమైన సమయంలో.. అన్ని రాజకీయ పార్టీలు,  పౌరసమాజ సంస్థలతోపాటు ప్రజలందరూ సంయుక్తంగా ఈ మహత్కార్యంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
మనమంతా ఒక్కటే.. మనమంతా కలిసికట్టుగా కరోనాను తరిమేసే యజ్ఞంలో భాగస్వాములవుదాం.
రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి మనమంతా ఐకమత్యంతో ముందుకెళదాం.
పారిశుద్ధ్యాన్ని పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం ద్వారా  కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగస్వాములవడం, దీంతోపాటు పక్కనున్నవారిని చైతన్య పరచడం ప్రతి భారతీయుడి బాధ్యత.
కరోనా వ్యాప్తి వాస్తవంగానే ప్రమాదకర పరిస్థితి. కానీ ప్రభుత్వం చేసిన పలు సూచనలను పాటించడం ద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చు.
దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. దేశం, సమాజం సంరక్షణ కోసం బాధ్యతాయుతంగా మెలగడం ప్రజలు, ప్రజాప్రతినిధుల సంయుక్త బాధ్యత.
మనమంతా ఇళ్లలోనే ఉందాం. సెలవు కదా అని బయటకు, తీర్థయాత్రలకు కుటుంబసమేతంగా వెళ్లాలన్న ఆలోచనలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకుందాం. స్వచ్ఛతే.. మతం, ఆధ్యాత్మికత ముఖ్య ఉద్దేశం. అందుకే జాతిపిత మహాత్మాగాంధీ స్వచ్ఛతే దైవత్వం అన్నారు.
మన మతాలు, ఆధ్మాత్మికత.. వ్యక్తిగతంగా, బహిరంగ స్వచ్ఛతను బోధిస్తాయి. ఈ సంప్రదాయాలే పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహిస్తాయి. కరోనావంటి వైరస్‌ను తరిమేసేందుకు బాటలు వేస్తాయి.
ఈ వైరస్ గురించి విస్తృతమైన సమాచారం సోషల్ మీడియా ద్వారా చేరవేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో.. నివారణోపాయాలపేరుతో వస్తున్న  తప్పుడు, అనధికారిక సమాచారాన్ని ఎవరుకూడా గుడ్డిగా ఇతరులకు చేరవేయవద్దు.
కరోనా సమస్యను పరిష్కరించేందుకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఇతరులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్న వారి శ్రమను, ధైర్యాన్ని మనం గుర్తించాలి. వారిని ప్రశంసించాలి. అందుకే ఆదివారి సాయంత్రం ఐదుగంటలకు చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. ఇది డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, కరోనా నిర్మూలనకోసం పనిచేస్తున్న ఇతర విభాగాల సిబ్బందికి మనోధైర్యాన్ని, కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి.
కరోనా వైరస్‌ను అడ్డుకునే విషయంలో మన దేశం ఇప్పటికే చాలా ప్రగతి సాధించింది. మనందరి మూకుమ్మడి ప్రయత్నంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా చేయడం కూడా మన బాధ్యతగా భావిద్దాం.
ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కృషిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, వైద్య నిపుణులను, ఇతర సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరికొద్ది రోజుల్లోనే ఈ వైరస్‌పై మనం విజయం సాధిస్తామని భావిస్తున్నాను.
మనముందు అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో జారీ అవుతున్న హెచ్చరికలను అర్థం చేసుకుంటూ, చేస్తున్న సూచనలను పాటిస్తూ.. మనమంతా ఐకమత్యంగా నిలబడి.. సవాల్ విసురుతున్న విపత్తును ధైర్యంగా ఎదుర్కుందాం. వైద్య విభాగం హెచ్చరికలు, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును అర్థం చేసుకుని ముందుకెళ్దామాని అన్నారు.


 పగలు ఎమ్మెల్యే వద్దన్నాడు ...... రాత్రికి మంత్రి ఆహ్వానించాడు....

 



 


 


ముఖ్యమంత్రిని కలిసిన దారపునేని


తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న వైసీపీ కార్యకర్తలు


పామూరులో చక్రం తిప్పనున్న దారపునేని


దశాబ్దాల ప్రత్యర్థులు ఒక్కటైనట్లేనా !


 


కనిగిరి నియోజకవర్గంలోని పామూరు మండలం 'టీడీపీ నేత దారపునేని చంద్రశేఖర్ వైసీపీ ఎంట్రీ సుఖాంతమైంది. పలు నాటకీయ పరిణామాల మధ్య ఆయన ఆహ్వానించాడుదారపునేని దెబ్బతిన్నాయంటున్న దారపునేని ! కరోనా బారినపడకుండా ప్రజల్లో వైసీపీలో చేరారు. పగలు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ వద్దన్నాడు....రాత్రికి రాష్ట్ర మంత్రి బాలినేని పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం ఏకంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కలిశాడు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.


(పెన పవర్, కనిగిరి ఆర్ సి ఇన్‌ఛార్జి)


ప్రధానంగా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తో పాటు పామూరు మండల వైసీపీ పార్టీ బాధ్యతలు చూస్తున్న ప్రధాన నాయ కులు, కార్యకర్తలు దారపునేని ని వ్యతిరేకించినప్పటికీ ఉపయో గం లేకుండా పోయింది. అధిష్టానంలో ఎమ్మెల్యే మాటకు విలువ లేదా అని నాయకులు బహిరంగంగానే  చర్చించుకుంటున్నారు. కాని పామూరు మండల నేతలు మాత్రం ఈ తతంగమంతా ఎమ్మెల్యేనే నడిపించారని, ఎమ్మెల్యేకు తెలిసే ఆయన పార్టీలో చేరాడని మండల నాయకులు వారి అభిప్రాయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఇదిలా ఉంటే అక్కడ దశాబ్దాల పాటుగా ప్రత్యర్థులుగా ఉండే బొల్లా మాల్యాద్రి చౌదరి, దారపునేని చంద్రశేఖర్లు ఇద్దరు ఒక్కటై కలిసి పని చేస్తారా అనేది అనుమానమే. ఇప్పటి వరకు దారపునేని తెలుగుదేశంలో ఉండగా మాల్యాద్రి చౌదరి వైసీపీ మండల బాధ్యతలు చూస్తున్నారు. వారిరువురు కలిసి ఇప్పుడు వైసీపీలో పని చేయాలి. ఇద్దరు కలిసి పని చేస్తారా లేక విభేదించుకుంటారా అనేది సందేహం. అయితే తెలుగుదేశం హయాంలో పామూరులో చక్రం తిప్పిన దారపునేని ఇప్పుడు వైసీపీ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతారని ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసిన బొల్లా మాల్యాద్రి చౌదరి, హుస్సేన్‌ రెడ్డిల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ కార్యకర్తలు దారపునేనిని విభేదించినప్పటికీ ఆయనను పార్టీలో చేర్చుకోవడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నట్లు కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. మంత్రి బాలినేని ఏకంగా ముఖ్యమంత్రి చేత కండువా కప్పించడంపై వారు భగ్గుమంటున్నారు. అయితే పామూరులో రాజకీయం ఏ రంగులు మారబోతుందో వేచి చూడాల్సిందే. 


నువ్వా... నేనా..


అరిలోవ, పెన్ పవర్ తూర్పు నియోజకవర్గం 13వ వార్డు అభ్యర్థుల గెలుపు నువ్వా నేనా అన్నట్టు ఉంది, ఎక్కడలేని విధంగా ఈ వార్డులో టిడిపి. వైసిపి .వైసిపి రెబల్ .కాంగ్రెస్ .సిపిఎం. సిపిఐ. జనసేన .ఇండిపెండెంట్ అభ్యర్థులు నువ్వానేనా అన్నట్లు ఉంది ,ప్రధానంగా . ఈ వార్డు బీసీ మహిళలకు కేటాయించడంతో అనేకమంది తెరపైకి వచ్చారు  వై ఎస్ ఆర్ సి పి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ పథకాలను పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేసి వైసిపి వార్డ్ అధ్యక్షుడు కెళ్ళ సత్యనారాయణ. భార్య కెళ్ల సునీత వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతేకాకుండా వైసిపి మహిళా అభ్యర్థిని గా టెకెట్ రాక బంగపడి, స్ధానిక సామాజిక వర్గానికి చెందిన వణుము వర లక్ష్మీ.గత జీవీఎంసీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు, వైఎస్ఆర్సిపి నుండి పార్టీకి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఈమె టికెట్టు రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు, ఇదిలా ఉండగా టిడిపి అభ్యర్థిని పొత్రకొండ ఈశ్వరమ్మ. పార్టీ గెలుపునకు పావులు కదుపుతూ ప్రజల ముందుకెళుతున్నారు


వైద్య ఆరోగ్య రంగాన్ని కాపాడుకుందాం

కాకినాడ సిటీ : ప్రయివేటీకరణ కాకుండా వైద్య ఆరోగ్య రంగాన్ని కాపాడుకుందామని పిడిఎఫ్ ఎంఎల్ సి ఐ.వెంకటే శ్వరరావు పిలుపునిచ్చారు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా 5వ మహాసభలు ఐడియల్ కళాశాల ప్రాంగణంలో గుబ్బల వెంకటరమణ అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభలకు ఐవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి పాలకులు వైద్య సేవలను ప్రయివేటీకరించేందుకు చూస్తున్నారన్నారు. వైద్య, ఆరోగ్య రంగం నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. అందులో భాగంగానే ఖాళీ పోస్టులను భర్తీ చేయట్లేదని విమర్శించారు. పిడిఎఫ్ ఎంఎల్‌సిగా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నామన్నారు. పిఆర్ సి, డిఎ, సిపిఎస్ రద్దు వంటి సమస్యలపై శాసన మండలిలో ఉద్యోగుల తరపున పోరాడతామన్నారు. వీటి సాధన కోసం ఐక్యపోరాటాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పలివెల శ్రీనివాసరావు మాట్లాడుతూ యూనియన్ ఏర్పడిన 2004 నుంచి చేసిన పోరాటాల ఫలితంగా వేలాది మంది కాంట్రాక్ట్ నర్సులు, ఫార్మాసిస్టులు, వైద్యులు, పిహెచ్ సి సిబ్బంది రెగ్యులర్ అయ్యారని తెలిపారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన సిబ్బంది, డాక్టర్ల నియామకాలను చేపట్టకపోవడం వల్ల ఉన్న కొద్దిపాటి సిబ్బందిపై విపరీతమైన ఒత్తిడి పడుతుందన్నారు. తక్షణమే ఖాళీ పోస్టులను భర్తీ | చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా శేషబాబ్ది, ఎపి స్టేట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.దయామణి, జి.భవాని మాట్లాడారు. రాష్ట్రంలో తీసుకుందికరోనా వైరస్ విజృంభిస్తే అడ్డుకునే పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం, | వైద్య వనరులు రాష్ట్రంలో అందుబాటులో లేవన్నారు. వైరస్ వ్యాపించ | కుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళలపై లైంగిక | సినిమా వేధింపులను అరికట్టాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి | సమాన వేతనం చెల్లించాలని, ఇప్పటి వరకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ | మేరకు పలు తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యదర్శి కార్యక్రమాలను నివేదికను జిల్లా కార్యదర్శి డిఎ.రత్నరాజు ప్రవేశపెట్టారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికైంది. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా డిఎ.రత్నరాజు, చీకట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎమ్ డి ఇబ్రహీంసాహెబ్, పలివెల వారిపై శ్రీనివాసరావు, రాధాకృష్ణ, జిజిహెచ్ సురేష్, సహాయ కార్యదర్శులుగా కార్యక్రమాల్లో విల్సన్, జోగిరాజు, భవాని, కవీంద్ర, యోహాను, కోశాధికారిగా పి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు |


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...