Followers

కరోనా నివారణ చర్యలు వేగవంత చేయండి : ఎమ్మెల్యే బుర్ర


 


కరోనా నివారణ చర్యలు వేగవంత చేయండి అధికారులకు ఎమ్మెల్యే బుర్ర ఆదేశం


జర్నలిస్టు లకు బియ్యం పంపిణీ


(పెన్ పవర్, కనిగిరి ఆర్ సి ఇన్ ఛార్జి)


కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో కరోనా నివారణ చర్యలు వేగవంతం చేయాలని కనిగిరి శాసన సభ్యులు బుర్ర మధుసూధన్ యాదవ్ అధికారులను ఆదేశించారు. కనిగిరి పరిధిలో కరోనా బాధితులు ఎక్కువవవుడంతో గురువారం స్థానిక తహశిల్దార్ కార్యాలయంలో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కనిగిరి మునిసిపాలిటీ పర్ధిలోని అర్బన్ కాలనీలో ఎవరు భయాందోళనకు గురికాకుండా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శాఖ అధికారులు తమ పరిధిలో కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రజల్లో అవగాహన కల్పించి వారిని ఇండ్లకే పరిమితం చేయాలన్నారు. లాక్ డౌన్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని కరోనాను అరికట్టే విధంగా చూడాలన్నారు. అనంతరం ప్రభుత్వపరంగా అక్రిడేషన్ కలిగిన మీడియా ప్రదినిధులకు ప్రభుత్వం అందించిన 10 కేజీల బియ్యంతో పాటు, కేజి కందిపప్పు, నునె ప్యాకెట్ ను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, డిప్యూటీ డిఎండిఓ, మున్సిపల్ కమిషనర్, సీఐ తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...