Followers

కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల్లో రోగనిరోధక శక్కి పెంచేందుకు పౌష్టికాహారాన్ని అందించాలి


 


 


కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల్లో రోగనిరోధక శక్కి పెంచేందుకు పౌష్టికాహారాన్ని అందించాలి


అధికారులను ఆదేశించిన కలెక్టర్ పోల భాస్కర్


(పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్, ఒంగోలు)


కోవిడ్-19 వ్యాధి గ్రస్తుల్లో రోగనిరోధక శక్తి పెరగడానికి సమతుల్య మైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చిన త్రిబుల్ ఐ.టి కళాశాలను ఆయన గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఇప్పటి వరకు క్వారంటైన్ కేంద్రంగా కొనసాగుతున్న కళాశాలలో వసతులను ఆయన పరిశీలించారు. కరోనా వైరస్ సోకిన వ్యాధి గ్రస్తులు వుండటానికి వారి పడకలు భౌతికదూరం వుండేలా ఏర్పాటు చేయాలన్నారు. సంబంధిత భవనాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వ్యాధి గ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. వారికి చ్చే ఆహారంలో బలవర్ధకమైన, పోషక విలువలు వుండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్ , గృహనిర్మాణ శాఖ పి.డి సాయినాథ్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డా.శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...