రామాయపట్నంలో పోర్టు ఏర్పాటుకు భూములు అనుకూలంగా ఉన్నాయి రాష్ట్ర పరిశ్రమలు, మౌళిక వసతులకల్పన అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వళవన్
(పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్, ఒంగోలు)
రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేయడానికి అన్నివిధాల భూములు అనుకూలంగా వున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, మౌళిక వసతుల కల్పన అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కరికాల వళవన్ చెప్పారు. గురువారం ఆయన రామాయపట్నం పోర్టు ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించారు. రామాయపట్నంలో పోర్టు ప్రతిపాదిత భూములను ఆయన పరిశీలించి భూముల వివరాలను ప్రత్యేక ప్రధానకార్యదర్శి జిల్లా కలెక్టరు పోల భాస్కరను అడిగి తెలుసుకున్నారు. చేవూరు, రావూరు గ్రామాల పరిధిలో అసైన్డ్ భూములు 317.93, పట్టా భూములు 2084.59 ఎకరాలు వున్నాయని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆయనకు వివరించారు. పోర్టు నిర్మాణానికి ఎంతో అనువైన ప్రాంతమని కలెక్టర్ తెలిపారు. అటవీ భూముల అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా వున్నామని ఆయన దృష్టికి తీసకువచ్చారు. పోర్టు నిర్వహణ కోసం అవసరమైన నీటి వనరుల లభ్యత వెలిగొండ ప్రాజెక్టు నుండి కల్పిస్తామని ఆయన చెప్పారు. సుమారుగా 1.5 టి.ఎం.సిల నీరు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కందుకూరు ప్రాంతం నుండి 220 కె.వి సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి అనుకూలమైన పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పోర్టు నిర్మాణం జరిగితే ప్రకాశం జిల్లా అభివృద్ధికి దోహదపడే అంశాలు, వేలాది మందికి ఉపాధి కల్పన దొరుకుతుందన్నారు. అనంతరం కరేడు భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మారిటోరియం బోర్డు సి.ఇ.ఓ రామక్రిష్ణా రెడ్డి, బోర్డు జి.ఎం రాజగోపాల్, ఏ.సి.ఐ.ఐ.సి జోనల్ మేనేజర్ ఎమ్.ఎల్.నరసింహరావు, మత్స్య శాఖ జే.డి చంద్రశేఖర్ రెడ్డి, కందుకూరు ఆర్.డి.ఓ ఓబులేసు, ఫారెస్ట్ సెటిల్ మెంట్ అధికారి క్రిష్ణ వేణి, గుడ్లూరు తహశీల్దారు శిల్పా, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment