నాలుగు వార్డుల ఇన్‌ఛార్జిగా యు వరలక్ష్మి, పిచ్చిరెడ్డి
(పెనవర్, పొదిలి)
పట్టణంలోని 7, 8, 9, 10 నాలుగు వార్డులకు ఇంచార్జిగా ఉడుముల వరలక్ష్మి, పిచ్చిరెడ్డిలను మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి నియమించారు. పొదిలి పట్టణంలోని పదో వార్డు బిసి కాలనీలో గత రెండు సంవత్సరాల నుండి సాగర్ నీరు రాక ప్రజలు త్రాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. దానికి స్పందించిన వార్డ్ ఇంచార్జ్ వరలక్ష్మి, పిచ్చి రెడ్డి ఆ డబ్ల్యుఎస్ జెఇ శ్రీకాంత్ సహకారంతో పంచాయతీ అధికారులు, వర్కర్లు మునీర్, కరిముల్లా ద్వారా పైపులు మరమ్మత్తులు చేయించి సాగర్ నీరు అందజేశారు. పదో వార్డు బిసి కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. వార్డు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ షేక్ ఖాసిమ్, దేవి రెడ్డి సుబ్బారెడ్డి, షేక్ గౌస్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment