Followers

గర్భిణీలు, బాలింతలకు రాగిపిండి, చిక్కీలు, కూరగాయలు పంపిణీ


 


గర్భిణీలు, బాలింతలకు రాగిపిండి, చిక్కీలు, కూరగాయలు పంపిణీ


 


(పెన్  పవర్, కంభం)


 


కరోనా లాక్ డౌన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం అందకుండా ఇబ్బందులు పడకూడదని ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెల్ల గ్రామంలోని 25 మంది గర్భిణీలకు, బాలింతలకు గురువారం రాగిపిండి, బెల్లం వేరుశనగ పల్లీల చిక్కీలను ఉపాధ్యాయురాలు పద్మావతి కూరగాయలను (క్యారెట్, బీట్ రూట్, ఆకుకూరలు లాంటి 6 రకాల కూరగాయలు) అంగన్వాడీ కార్యకర్తలు అందజేశారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ కృష్ణకుమారి, అర్ధవీడు మండలం పెద్దకందుకూరులో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న తురిమెల్ల గ్రామవాసి పద్మావతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. దాత ఉపాధ్యాయురాలు పద్మావతి యొక్క దాతృత్వాన్ని సూపర్వైజర్ ఆర్.కృష్ణకుమారి కొనియాడారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనవసరంగా బయటికి రావద్దని, ఎక్కువ సార్లు చేతులు శుభ్రపరుచుకుంటూ మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఇంట్లోనే తేలికపాటి నడకను కొనసాగిస్తూ రోజుకు 7-8 గంటలు తప్పక నిద్రపోవాలన్నారు. వైరస్ గురించి భయపడొద్దు, ఆందోళన చెందొడ్డని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు పద్మావతి మాట్లాడుతూ..గర్భిణీలు, బాలింతలు సరైన సమయానికి మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...