Followers

 నవ స్వప్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం


 నవ స్వప్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం


(పెన్  పవర్, కంభం)


స్థానిక ప్రభుత్వ ప్రాథమిక వైద్య శాల నందు నవ స్వప్న పౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ జోన్స్ చేతుల మీదుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కరోనా వైరస్ ఆపద సమయంలో ప్రజలకు అండగా నవ స్వప్న ఫౌండేషతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలైన హెల్పింగ్ హాండ్స్, బేస్తవారిపేట చేయూత మిత్రమండలి, శ్వాస స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు ఐ. భాస్కర్ రావు తో పాటు కంభం విద్యుత్ శాఖ ఏఈ నరసయ్య, పలువురు అధికారులు, ఉద్యోగస్తులు దాదాపు 60 మంది వరకు రక్తదానం చేశారు. వీరందరికీ నవ సప్న ఫౌండేషన్ అధ్యక్షుడు ఎస్ శివ సర్టిఫికెట్టు, పండ్లు, శానిటైజర్, గ్లూకోజ్, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...