Followers

మాధ్యమం ఎంపిక చేసుకునే బాధ్యత తల్లిదండ్రులదే


 


మాధ్యమం ఎంపిక చేసుకునే బాధ్యత తల్లిదండ్రులదే


(పెన పవర్, కంభం, బేస్తవారిపేట)


నూతన విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఏ మాధ్యమంలో చదవాలో తల్లిదండ్రులే నిర్ణయం తీసుకోవాలని కంభం, బేస్తవారిపేట ఎంఇఓలు సీహెచ్ మాధవ కృష్ణారావు, జింకా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో మాధ్యమం ఎంపిక పత్రాలను విద్యా సంక్షేమ సహాయకుల ద్వారా వాలంటీర్లకు అందించారు. ఈ సందర్భంగా ఎంఈఓలు మాట్లాడుతూ మండలంలోని వాలంటీర్లు వారికి కేటాయించిన 50 కుటుంబాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి 2020-21 విద్యా సంవత్సరంలో తరగతి మాధ్యమం ఎంపికను నిర్ధారించాలన్నారు. తెలుగు తప్పనిసరిగా బోదిస్తూ ఇంగ్లిషు మీడియం, తెలుగు మీడియం, ఇతర బాషా మీడియం అను మూడు ఎంపికల్లో తల్లిదండ్రులకు సమ్మతమైన మాధ్యమం ఎంచుకుని టిక్ చేయాలన్నారు. ఈ ప్రక్రియను శుక్రవారం సాయంత్రానికి పూర్తిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీలు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 


 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...