కష్ట సమయంలో వై.ఎస్ఆర్ సి.పి ముందుంటుంది
ఎమ్మెల్యే రాజన్నదొర
సాలూరు, పెన్ పవర్
ప్రజలకు కష్టమొస్తే ఆదుకోవడం రాజకీయ నాయకుల బాధ్యతని అంతే కానీ ఎలక్షన్లు ముందు వచ్చి ఓట్ల కోసం ప్రజల దగ్గరికి రావడం రాజకీయ నాయకులకు భావ్యం కాదని అందుకోసమే ఈ వార్డులో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తూన్నామని నియోజకవర్గ ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు.గురువారం సాలూరు పట్టణంలో వైఎస్సార్ పార్టీ నాయకులు పువ్వల. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 6 వ వార్డు, 19 వ వార్డు ప్రజలకు ఎమ్మెల్యే రాజన్న దొర చేతులు మీదుగా నిత్యవసర కూరగాయలు సంచులు అందజేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ వలన వైఎస్ఆర్ పార్టీ నాయకులు పేద ప్రజలకు వారికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులు అందిస్తున్నారని,ప్రజలకు కష్టం ఉన్నప్పుడే రాజకీయ నాయకుడు తోడుగా నిలబడాలని చెప్పారు.అందుకోసమే మా పార్టీలో ఉన్న నాయకులు ఈ కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ ఉండడం వలన వారికి తోచిన సహయాన్ని పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పువ్వల. నాగేశ్వరరావు ప్రజలకు కూరగాయ సంచులు ఇచ్చేటప్పుడు మీకు బాధ్యతతో ఇస్తున్నాం మీరు ప్రేమతో ఓట్లు వేయాలని కోరడంతో అక్కడ నాయకులు ముసి ముసి గా నవ్వుకున్నారు.ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్. పార్టీ పట్టణ అధ్యక్షుడు జర్జాపు సూరిబాబు, లయన్స్ క్లబ్ స్కూల్ అధ్యక్షుడు వంగపండు ప్పలనాయుడు,బిసి సెల్ కార్యదర్శి రాపాక మాధవ, మాజీ వైస్ చైర్మన్ గిరి.రఘు ,గుణమంచి. చిన్న తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment