Followers

విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి కీనోట్

విజయనగరం,


ఆదికవి నన్నయ యూనివర్సిటీరాజమండ్రి  ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు ముంబయిలోని యంగ్ రీసెర్చ్ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12 మే నుంచి 15 మే వరకు నిర్వహిస్తున్న వెబినార్ లో ఈ రోజు కరోనా నేపథ్యంలో 'ఇన్నోవేటివ్   స్ట్రేటిజీస్  అండ్  మెథడాలజీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్అనే అంశంపై ముఖ ప్రసంగం డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి మరియు విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయి కీనోట్ ప్రసంగం చేశారు. ప్రొఫెసర్ రాయి ప్రసంగిస్తూ మారుతున్న పరిస్థితులకం అనుగుణంగా మన విద్యాభోదన  అందుబాటులో ఉన్న సాంకేతికతనుపయోగించుకొని మా అనైపుణ్యాలకు మరింత పదును పెట్టి కరోనాలాంటి పరిస్తితుల్లో  విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్ లైన్ విధానంద్వారా ఇప్పటికీ పూర్తికాని సిలబస్సును పూర్తి చేయాలనితద్వారా విద్యార్థులు విజ్ఞాన సముపార్జనలో నష్టపోకుండా అంకితభావంతో కృషిచేయాలనిపిలుపిచ్చారు. విధ్యార్ధులకో స మే అధ్యాపకులున్నామనే భావన ఈ కరోనా పరిస్థితుల్లో వారిలో కలిగించాలని అన్నారు. అభివృద్ది చెందుతున్న భారత్ లాంటి దేశాలు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మరింత వనరుల లేమి ఎదుర్కుంటాయనిఅయినప్పటికీ నాలెడ్జి బదిలీసంపద సృష్టి విషయాల్లో విద్యావేత్తలు తీవ్రంగా కృషి చేయాలని అన్నారు. అనేక కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఉద్యోగాల నిమిత్తం  ఆఫర్ లెటర్లు ఇచ్చున్నాయనిఆన్లైన్ విధానంలో త్వరితగతిన సిలబస్ పూర్తిచేసి పరీక్షలు నిర్వహిoచాలని అన్నారు. ఆన్లైన్ విద్యలో లెర్నింగ్ సామర్ధ్యం తక్కువ ఉన్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.వీడియో మాధ్యమంలో జరిగిన ఈ కార్యక్రమంలో 22 రాష్ట్రాలకు చెందిన వివిధ సబ్జెక్టుల అధ్యాపకులునన్నయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుబ్బారావు పాల్గొనగా కార్యక్రమానికి విజయనగరం ట్రైబల్ యూనివర్సిటీ అడ్మిన్ ఆఫీసర్ డాక్టర్ సూర్యనారాయణ ఆర్గనైజింగ్  సెక్రటరీ గా వ్యవహరించారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...