Followers

ఇళ్లస్థలాలు పంపిణీకి ఏర్పాట్లు.


ఇళ్లస్థలాలు పంపిణీకి ఏర్పాట్లు.- .......తహశీల్దార్ కె.పోసిబాబు

    

 గోకవరం, పెన్ పవర్

 

 

 గోకవరం మండలం లో సుమారు 40వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తహశీల్దార్ కె.పోసి బాబు తెలిపారు. గురువారం స్థానిక ది గోకవరం ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయులతో ఇష్టాగోష్టి లో తహశీల్దార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గోకవరం మండలం లో ఉన్న ప్రభుత్వ భూములను మే నెలాఖరుకు ప్యురిఫికేషన్ ఆఫ్ లాండ్ రికార్డ్స్ పనిని పూర్తి చేస్తామని అన్నారు. మండలంలో సుమారు 13 వేల మంది పట్టాడారులు ఉన్నారని, వారందరి ఖాతాలు ఆధార్ కు అనుసంధానం చేస్తున్నామని అన్నారు. విదేశాల్లో ఉన్న వారి పట్టాదారు ల ఖాతాలను కూడా త్వరలో ఆధార్ తో అనుసంధానం చేయుటకు చర్యలు తీసుకుంటున్నాం. మండలంలో ఉన్న మీసేవ కేంద్రాల్లో సర్వీసులను నిత్యం తమ సిబ్బంది  పర్యవేక్షిస్తున్నారు  అని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో మండలంలో ఉన్న ప్రతీ రేషన్ కార్డు దారునికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పంపిణీ కార్యక్రమం 100 శాతం  అందిస్తున్నామన్నారు.  మండలంలో 23 లే అవుట్ లు లో పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమం కొరకు అర్హులను గుర్తింపు జరుగుతుందన్నారు. మండలంలో 3023 మంది ఇళ్ళ స్థలాలు కు అర్హులను గుర్తించామని అన్నారు. మే 25 వరుకు ఇళ్ళ స్థలాల కు  దరఖాస్తు కు అవకాశం ఉందని తహశీల్దార్  అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాయింట్ రిజిస్ట్రార్ హోదాలో అర్హులైన వారందరికీ రిజిస్ట్రేషన్ చేసి, ఇళ్ళ స్థలాల పంపిణీ చేయనున్నామని తెలిపారు. మే నెలాఖరు లోగా లబ్దిదారులు జాబితా మరొకసారి ప్రకటిస్తామన్నారు. తొలి జాబితాలో అర్హులుగా ఉన్నవారు వివరాలను రెండోసారి క్షుణ్ణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకే పరిశీలించాక కొందరిని అనర్హులుగా ప్రకటించామని తహశీల్దార్ అన్నారు. అలాగే మండలంలో ఉన్న  రెవెన్యూ సంబంధిత సమస్యల్ని  తమ దృష్టికి తీసుకు రావాలని పాత్రికేయులకు సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, ది గోకవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రౌతు పండు, ఉపాధ్యక్షులు  కరాసు శివ రామకృష్ణ, కార్యదర్శి కర్రి శివ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...