దక్షిణ నియోజకవర్గం లో 35 వేల నుండి 45 వేల మంది ప్రస్తుతం నివసిస్తున్నారు. అక్కడ ఏ పార్టీ కూడా ముస్లిం కార్పొరేటర్ అభ్యర్థిని ఇవ్వకపోవడం శోచనీయం
దాబా గార్డెన్స్ విశాఖపట్నం పెన్ పవర్ న్యూస్
విశాఖ ఇస్లామిక్ ఉమెన్స్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన VJF ప్రెస్ క్లబ్ డాబా గార్డెన్ నందు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పర్వీన్ బాబీ మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికలలో 85 శాతం పంచాయతీలను గెలుచుకొని, పల్లె ప్రజల అభిమానాన్ని చురగొన్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నామని త్వరలో జరగబోయే కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా తమ అంచనా ప్రకారం పంచాయితీ ఫలితాలు కన్నా ఎక్కువ శాతం సీట్లు సాధించి, అన్ని మేయర్ పదవులను ఆదిష్టిఇస్తారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజారంజక సంస్కరణలే అని అన్నారు. ముస్లింల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు అమలు చేసి వారి అభివృద్ధికి ఎంతో దోహదపడుతూ అనతి కాలంలోనే 100శాతం ముస్లింల అభిమానాన్ని చూరగొన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని అన్నారు. జీవీఎంసీ ఎలక్షన్ దృష్ట 98 వార్డులకు గాను 75 వార్డులలో నామినేషన్ ఒక కొలిక్కి వచ్చిందని మిగతా 25 వార్డులలో నామినేషన్ వేయవలసి ఉందని తాము భావిస్తున్నామని అన్నారు. ప్రత్యేకంగా జీవీఎంసీ ఎన్నికలలో సీటు కేటాయించిన రెండు సీట్లను గెలిపించుకోవడం తోపాటు, ఇతర వార్డులలో కూడా తమ వంతు కృషి గా ప్రచారం చేసి, అఖండ పార్టీ అభ్యర్థులు మెజార్టీ సాధించడం కోసం తాము ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. 75 వార్డులకు గాను కొంతమందికి బీఫామ్ ఇచ్చారని కొన్ని వార్డులలో అభ్యర్థులు యొక్క వార్డులలో ప్రాధాన్యం ఉన్న వర్గానికి చెందిన వ్యక్తి కాదా ఇతర కారణాల దృష్ట్యా ప్రజల్లో ఉన్న గుర్తింపుతో సేవా కార్యక్రమాలను చేస్తున్నవారిని ఆరా తీసి సెలెక్ట్ చేస్తే బాగుంటుందని తాను భావిస్తున్నాను అని అన్నారు. అందులో భాగంగా దక్షిణ నియోజకవర్గం లో 35 వేల నుండి 45 వేల మంది ప్రస్తుతం నివసిస్తున్నారు. అక్కడ ఏ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని ఇవ్వకపోవడం శోచనీయం. దీనిలో భాగంగా 3000 జనాభాతో ముస్లింలు 39 వ వార్డు లో రెండో స్థానంలో ఉన్నారని గత ఎన్నికలలో వీరు అధికంగా ప్రభావం చూపించారు. ప్రతిసారి ఒకే వర్గానికి సీట్లు కేటాయిస్తున్నారు. కానీ ఈ సారి కి తప్పనిసరిగా ముస్లింలకు ఆ సీటు కేటాయించాలని అభ్యర్థిస్తున్నాము. పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి మా విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని నామినేషన్ల పరిశీలన గడువు ముగిసినప్పటికీ ఉపసంహరణ ఇంకా గడువు ఉన్నందున ముస్లిం అభ్యర్థి దక్షిణ నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న వార్డులలో అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోప్రార్వీన్ భాబీ, రేష్మ, సీమ, నాజమా, రుబినా ఖాతున్, ఖాతీజ, మెహెరావున్నిసా, రెహానా, నగ్మా, పాల్గొన్నారు.
No comments:
Post a Comment