Followers

వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దు

 వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దు  




విజయనగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు 

విజయనగరం,పెన్ పవర్

 వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం 16వ డివిజన్, సాయంత్రం 22, 23, 24 డివిజన్లలోని పలు ప్రాంతాల్లో అదితి గజపతిరాజు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. అదితి గజపతిరాజు ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ఆదాయాలు పడిపోయి ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు చూసి దిక్కుతోచని స్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. అలాగే ఆస్తి విలువ ఆదారంగా మున్సిపల్ పన్నులను పెంచుతూ ప్రభుత్వం జీవోలను జారీ చేయడం దుర్మార్గమన్నారు. గత ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హెూదా సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను నిండా ముంచేసారని విమర్శించారు. మద్యాపాన నిషేదం అంటూ మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక నాశిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారన్నారు. సంక్షేమ పధకాల డబ్బులన్నీ తిరిగి బ్రాందీ షాపులకే వస్తున్నాయని ఎద్దేవా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పట్టణంలో కొళాయిలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం జరిగిందని, మళ్లీ టీడీపీకే ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ అభ్యర్ధి పురుషోత్తం అనురాధ, 22వ డివిజన్, మేయర్ అభ్యర్ధి కంది శమంతకమణి, 23వ డివిజన్ అభ్యర్ధి పతంగి విజయకృష్ణ, 24వ డివిజన్ అభ్యర్ధి గొల్లకోటి హారిక, పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పార్టీ నాయకులు ఉండ్రాళ్ల వెంకటప్పారావు, విజ్జపు ప్రసాద్, గొల్లకోటి గురునాథ్, కంది మురళీ నాయుడు, ఉండ్రాళ్ల రాజేష్, గొల్లకోటి శివ, పట్టణానికి చెందిన

పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...