కలమడుగులో ప్రారంబమైన నరనారాయణస్వామి జాతర
మంచిర్యాల బ్యూరో , పెన్ పవర్
జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలోని శ్రీ నరనారాయణస్వామి దేవాలయం వార్షికోత్సవం అంగరంగ వైబవంగా ప్రారంబం అయింది. శుక్రవారం రోజున మండలంలోని కలమడుగు గ్రామంలోని అతి పురాతన దేవాలయం శ్రీ నరనారాయణస్వామి దేవాలయం వార్షికోత్సవ జాతర కార్యక్రమాలు ఆలయకమిటీ ఆద్వర్యంలో పురోహితులు కాకేర నర్సయ్యశర్మ కాకేర రాజనరేంద్రేశర్మ లు ప్రారంబించారు. ఈ సందర్బంగా ఈ రోజు మహిళలు కుంకుమ పూజలు జరిగాయి.136 మండి మహిళలు ఈ కుంకుమ పూజలలో పాల్గొన్నారు. అదేవిదంగా ఉదయం నుండే పూజారులు దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమలో శ్రీహరి మౌనస్వామి గ్రామ సర్పంచ్ కార్తీకరావు ఆలయకమిటీ సబ్యులు నర్సగౌడ్ అంజగౌడ్ గోపాల్ రావు శంకరయ్య ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment