వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతి..
వి.మాడుగుల,పెన్ పవర్
మాడుగుల మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన యువకుడు శనివారం ఉదయం వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. మాడుగుల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రామారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పర్రె అర్జున్ రావు( 30)కి గత కొంతకాలంగా మతిస్తిమితం లేదని ఇల్లు విడిచి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. ఇందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో పొలాల వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని వెలికి తీశారు. శవ పంచనామా జరిపించి పోస్టుమార్టం కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామారావు తెలిపారు.
No comments:
Post a Comment