Followers

సత్యవేడులో మద్యం షాపుల వద్దే యదేచ్ఛగా బార్లు ..

 సత్యవేడులో  మద్యం షాపుల వద్దే యదేచ్ఛగా బార్లు 



 ప్రేక్షక పాత్ర వహిస్తున్న బేవరేజ్ కార్పొరేషన్ అధికారులు 

పెన్ పవర్ న్యూస్ సత్యవేడు

చిత్తూరు జిల్లా సత్యవేడు డివిజన్ పరిధిలో ప్రభుత్వ మద్యం షాపుల వద్ద యదేచ్చగా అక్రమ బార్లు నడుస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి .ఆంధ్ర ప్రదేశ్ ను మద్య రహిత రాష్ట్రం గా మార్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టగానే ప్రైవేటు గుప్పిట్లో ఉన్న మద్యం షాపులను సర్కారు స్వాధీనంలోకి తీసుకురావడం జరిగింది .ఇందుకు అనుగుణంగా ప్రతి ఏడాది 20 శాతం మేర మద్యం షాపులను కుదిస్తూ వీటి నిర్వహణ బాధ్యతలను బేవరేజ్ కార్పొరేషన్ సంస్థకు అప్పగించడం జరిగింది . దీంతోపాటు మద్యం షాపుల వద్ద మద్యం సేవించడాన్ని పూర్తిగా నిషేధించింది . అనధికార బార్లు మద్యం షాపుల వద్ద ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది .  సత్యవేడు డివిజన్ పరిధిలోని పలు సర్కారు మద్యం షాపుల వద్ద యదేచ్ఛగా అక్రమ బార్లు నడుస్తోంది .ఈ డివిజన్ పరిధిలోని సత్యవేడు ,వరదయ్యపాలెం ,నాగలాపురం , పిచ్చాటూరు మండలాలలో దాదాపు 24 మద్యం షాపులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి .ఇందులో భాగంగా సత్యవేడు పట్టణంలో ఐదు మద్యం షాపులు , దాసుకుప్పంలో నాలుగు మద్యం షాపులు , పెద్దఈటిపాకం ఎస్టి కాలనీ ,పాలగుంట , అప్పయ్యపాల్యం తదితర ప్రాంతాల్లో సర్కారు మద్యం షాపులు కొనసాగుతున్నాయి . అయితే సత్యవేడు పట్టణంలో రోడ్డు కు ముందు మద్యం షాపులు నడుస్తుండగా వెనుక వైపు బార్లు కొనసాగుతున్నాయి . టెంకాయ కీతుల షెడ్లలో కూర్చొని మద్యం ప్రియులు మద్యాన్ని సేవించడం సర్వసాధారణమైపోయింది .అలాగే దాసు కుప్పం ప్రాంతంలో రోడ్డు ముందు పలు టిఫిన్ సెంటర్లో మద్యం బార్లు నడుస్తుండగా వెనుక వైపు సర్కారు మద్యం షాపులు కొనసాగుతున్నాయి .మద్యం షాపుల వద్ద విచ్చలవిడిగా బార్లు కొనసాగుతున్న సంబంధిత బేవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది . పైగా చట్టానికి తూట్లు పొడిచే విధంగా మద్యం షాపుల వద్ద బార్లు కొనసాగుతున్న సంబంధిత సత్యవేడు డివిజన్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర శెట్టితిరుపతయ్య  ప్రేక్షక పాత్ర వహించడం అనుమానాలకు తావిస్తోంది .మద్యం షాపుల వద్ద తాత్కాలిక మద్యం బార్లు నడిపిస్తున్న కొందరు వ్యాపారస్తులతో బేవరేజ్ ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కు అయ్యారేమొన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి .ఇప్పటికైనా సంబంధిత బేవరేజెస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి మద్యం షాపుల వద్ద అనధికారికంగా కొనసాగుతున్న మద్యం బార్లను నిర్మూలించడానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది .

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...