ఉత్తర నియోజకవర్గం ప్రచారం లో పాల్గొన్న.. వి.విజయసాయిరెడ్డి
విశాఖ ఉత్తరం, పెన్ పవర్
గ్రేటర్ విశాఖ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉత్తర నియోజకవర్గం లో 53,54,55,42 వార్డులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు మరియు స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. ముందుగా మురళీనగర్ లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో జీవీఎంసీ ఎన్నికల ప్రచార సీడీని ఆవిష్కరించారు అనంతరం. 53 వార్డు శివనగర్, 54 వార్డు మర్రిపాలెం, జ్యోతి నగర, నలంద నగర్, గజపతినగర్, 55 వార్డు గాంధీనగర్, తిక్కవాని పాలెం, ధర్మానగర్, తాటిచెట్ల పాలెం, 42 వార్డు రైల్వే న్యూ కొలనీ, నందగిరి నగర్, రెల్లి వీధి ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు పర్యటించారు. ఈ పర్యటన లో ఆ యా ప్రాంతాల్లో స్థానిక సమస్యలు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని పరిశీలించారు.వాటిలో కొన్ని వెంటనే చేయుటకు హామీ ఇచ్చారు. కొన్ని సంబంధించిన శాఖ లతో మాట్లాడి పరిష్కరిస్థానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, లోక్ సభ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, కాయల వెంకటరెడ్డి, వరుదు కల్యాణి, మాధవి వర్మ, మాజీ వుడా చైర్మన్ రవి రాజు, మిలినియం శ్రీధర్ రెడ్డి వార్డు సీనియర్ నాయకులు , మహిళలు, కార్యకర్తలు వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment