Followers

సింహాచలం దేవస్థానం ఈవోగా సూర్యకళ నియామకం...

  సింహాచలం దేవస్థానం ఈవోగా సూర్యకళ నియామకం



  సింహాచలం, పెన్ పవర్ ...

   శ్రీ  వరాహ లక్ష్మీ నరసింహ స్వామి  దేవస్థానం ( సింహాచలం) ఈవోగా ఎం. వి  సూర్య కళను  నియమిస్తూ ప్రభుత్వం   ఉత్తర్వులు జారీ చేసింది.  విశాఖ  జాతీయ హైవే నెంబర్ 16 కు  భూసేకరణ అధికారిగా పనిచేస్తున్న సూర్య కళని,   రెవెన్యూ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా...  నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాసు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె గతంలో విశాఖ జెసి 2 గా  పని చేసిన విషయం తెలిసిందే.  కాగా  సింహాచలం దేవస్థానం పరిధిలో భూకబ్జాలు,  ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి, అనేక  సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అలాగే  గతంలో పనిచేసిన ఈ వో లు అవినీతి పరులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు రావడం తో  రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దేవస్థానం పరిధిలో భూములు అక్రమ నిర్మాణాలు యదేచ్చగా జరుగుతున్నాయని,  ప్రజాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సూర్య కళ నియామకం ప్రత్యేకత సంతరించుకుంది. అందులో జరుగుతున్న అవినీతి అక్రమాలకు...   ఆమె అడ్డుకట్ట వేస్తారని  భక్తుల విశ్వాసి స్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...