తపాలా సేవలు వినియోగించుకోవాలి
జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్.
నెల్లికుదురు,పెన్ పవర్.
తపాలాశాఖ వినియోగులను సద్వినియోగంచేసుకోవాలని మహుబూబాబాద్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ సైదా నాయక్ అన్నారు. శనివారం మండలంలోని రత్తిరామ్ తండాలో బడితండా,నల్లగుట్ట, రత్తిరామ్ తండ,కాచికల్ గ్రామాలకు చెందిన పోస్ట్ఆఫీస్ రత్తిరామ్ తండలో మంజూరు కావడంతో శనివారం వివిధ రకాల గ్రామీణ తపాలా జీవిత బీమా ఖాతాలు తెరవడం కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గుగులోత్ బిక్కు నాయక్ తో కలిసి ఖాతాలను ప్రారంభించిన సైదా నాయక్ మాట్లాడుతూ..ఎస్బి, ఆర్ డి, సుకన్య సమృద్ధి యోజన లతోపాటు ఐపీబిమ్, ఏఇపిఎస్ సేవలను తపాల శాఖ అందిస్తుందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ భూక్యా బాలాజీ నాయక్, ఉప సర్పంచ్ విజయ బాలాజీ, నెల్లికుదురు సబ్ పోస్ట్మాస్టర్ నర్సయ్య,ఆయా గ్రామాల బీపీఎం లు నవీన్ రావు,ఉమామహేశ్వర్, ఐస్లాం,మహేశ్వరి, ప్రశాంత్, స్థానికులు చందూలాల్, శ్రీనివాస్, బిచ్చనాయక్,రఘుతో పాటు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment