Followers

అభివృద్ధి పథంలో నడిపిస్తా..వైసిపి 39వ వార్డు కార్పొరేటర్.. అభ్యర్థిని కొల్లి సింహాచలం

 అభివృద్ధి పథంలో నడిపిస్తా..వైసిపి 39వ వార్డు కార్పొరేటర్.. అభ్యర్థిని కొల్లి సింహాచలం




మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ, దక్షిణ నియోజకవర్గం 39 వ వార్డు ప్రాంతాన్నిఅభివృద్ధి పథంలో నడిపిస్తానని వైసిపి కార్పొరేటర్ అభ్యర్థిని కొల్లి సింహాచలం ప్రకటించారు.కోటవీధి,ఫెర్రీ వీధి తదితర ప్రాంతాల్లో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అడుగడుగునా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. హారతులతో ఘన స్వాగతం పలికారు.స్థానికంగా నెలకొన్న సమస్యలను త్వరితంగా పరిష్కరిస్తానని ఆమె స్థానికులకు భరోసా ఇచ్చారు.అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తానని హామీ ఇచ్చారు.దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నాని, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే నిర్విరామంగా శ్రమిస్తున్నానని, తనకు ఘనవిజయం అందించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...