పట్టణ ప్రజలకు మెరుగైన ఆరోగ్యం...
పెన్ పవర్, విజయనగరం
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టణ ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించాలన్న సంకల్పంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించి, అందుకు కావలసిన భవనాలు, మౌలిక సదుపాయాలు సమకూర్చారని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు అన్నారు. శనివారం నాడు కోలగట్ల నివాసంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రములలో ప్రస్తుత ఉద్యోగ సిబ్బందిని కొనసాగించవలసిందిగా కోరుతూ ఆరోగ్య సిబ్బంది అందరూ కలిసి గౌరవనీయులు విజయనగరం శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారికి వినతి పత్రం అందజేశారు. ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన రిక్రూట్మెంట్ లో ముందుగా గత కొన్ని ఏళ్లుగా పని చేస్తున్నా మాకు ప్రాధాన్యతనిచ్చి మిగిలిన ఖాళీలను కొత్తవారికి ఎంపిక చేయాలని కోరారు. ఈ విషయమై కోలగట్ల సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య (UPHC) సిబ్బంది ఎస్ గణపతి (డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్),ఎం రమేష్ బాబు (సెక్రెటరీ),ఏ సంజీవ్ (జాయింట్ సెక్రెటరీ),ఎం విజయమ్మ (మెంబర్),తో పాటు సి.ఓ లు, ఏ.యన్.ఎం లు, ల్యాబ్ టెక్నీషియన్ లు, జి.ఎన్.ఎం లు, క్లీనింగ్ అసిస్టెంట్లు, వాచ్ మెన్ లు, స్వీపర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment