Followers

తెలుగుదేశం పార్టీతోనే సుభిక్షమైన పాలన

 తెలుగుదేశం పార్టీతోనే సుభిక్షమైన పాలన




విజయనగరం,పెన్ పవర్ 

 తెలుగుదేశం పార్టీతోనే సుభిక్షమైన పాలన సాధ్యమవుతుందని విజయనగరం టీడీపీఇన్ ఛార్జ్ అదితి గజపతిరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం 38వ డివిజన్ లో , సాయంత్రం 39, 41వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ విజయనగరం అభివృద్ది చెందాలన్నా, పన్నుల భారం తగ్గాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే విజయనగరం పట్టణంలో అభివృద్ది జరిగిందన్నారు.వైకాపా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా కార్పొరేషన్  కి ప్రత్యేకమైన నిధులు తీసుకురాలేకపోయారన్నారు.జనరల్ నిధులను పూర్తిగా ఖర్చుచేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవాచేశారు.ఒక త్రాగునీటి ప్రాజెక్టును కూడా .కాంగ్రెస్, వైకాపా ప్రభుత్వాలు పట్టణానికి తీసుకురాలేకపోయాయన్నారు.కేవలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన వాటర్ స్కీమ్లు ద్వారానే పట్టణంలో త్రాగునీటి సరఫరా జరుగుతోందన్నారు. తాటిపూడిలో నీరు లేనప్పుడు ఆదుకున్న గడిగెడ్డ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయకుండా ఆ స్కీమ్ ని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో సంక్షేమ పధకాలు ఇస్తున్నారని, ఎవరి జోబులోని సొమ్ము కాదన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. ఓటు వేయలేదని అర్హులకు పధకాలు రద్దు చేస్తే, వారి తరపున తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి తిరిగి పధకాలను అందజేస్తామన్నారు. వైకాపా అక్రమ చర్యలకు సహకరిస్తున్న అధికారులను న్యాయస్థానంలో నిలబెడతామన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న వాలంటీర్ల వివరాలను, ఆదారాలను అధికారులకు, ఎన్నికల సంఘానికి పంపించి వారిపై చర్యలు తీసుకునేవరకు పోరాటం చేస్తామన్నారు. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు మేయర్ అభ్యర్థి కంది శమంతకమణి, 38వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బొబ్బాది ఉషశ్విని, 39వ డివిజన్ టీడీపీ అభ్యర్థి కొర్నాన రాజ్యలక్ష్మి, 41వ డివిజన్ టీడీపీ అభ్యర్థి అనురాధా బేగం,పార్టీ నాయకులు బొబ్బాది త్రినాథ్, బొబ్బాది విజయలక్ష్మి, విజ్ఞపు ప్రసాద్, గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...