Followers

మనసున్న నాయకుడు మన జగన్ అన్న..

 మనసున్న నాయకుడు  మన జగన్ అన్న..



 గిరిజన ప్రాంత రహదారులకు మోక్షం కలిగిస్తున్న సీఎం

పెన్ పవర్ బ్యూరో ,విశాఖపట్నం

 గత ప్రభుత్వాల నిరాదరణకు గురైన గిరిజన ప్రాంత రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని  ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. శనివారం సాయంత్రం  సెక్స్మాడుగుల పంచాయతీ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న రహదారులు తాగునీటి సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించింది అన్నారు. వైఎస్ జగన్ మనసున్న నాయకుడు అని సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంత రహదారులకు  మోక్షం కలిగించే విధంగా  చర్యలు జరుగుతున్నాయన్నారు. మాడుగుల మండలం శివారు రాజంపేట కొత్తవలస  ఉరక గెడ్డ  వాగుపై  బ్రిడ్జి మరియు 7:30 మీటర్ల రహదారి నిర్మాణానికి  9 కోట్ల రూపాయలు  మంజూరు అయిందని టెండర్లు పూర్తి అయ్యి త్వరలో పనులు ప్రారంభం అవుతాయి అన్నారు  మండలంలో నాలుగు రోడ్లు దేవరపల్లి మండలం లో ఒక రోడ్డు అభివృద్ధికి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుంచి ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మంజూరయ్యాయన్నారు ఈ నిధులతో కల్వర్టులు బ్రిడ్జీలు తార్ రోడ్డు  7:30 మీటర్లు విస్తరించనున్న మన్నారు మాడుగుల రామచంద్రపురం రోడ్డుని గ్రామ పంచాయతీ నిధుల నుండి 7:30 మీటర్లు వెడల్పు తారు రోడ్లు కల్వర్టు నిర్మిస్తామన్నారు. ఒక కిలోమీటర్ 800 మీటర్లు రోడ్డు నిర్మాణానికి 85 లక్షలు మంజూరు అయిందన్నరు.  కింతలి వల్లాపురం శివారు శరభన్నపాలెం నుంచి తణుకు గదబ వీధి  2 కిలోమీటర్ల  తారు రోడ్డు నిర్మాణానికి 85 లక్షలు.  పేద సారాడ  శరభన్నపాలెం  మూడు కిలోమీటర్ల 400 మీటర్లు రోడ్డు నిర్మాణానికి ఒక కోటి 85 లక్షలు  ఏ వీరనారాయణం పెద్ద గొర్రె గడ్డ 1 కిలోమీటర్ 600 మీటర్లు రోడ్డుకు  కోటి 20 లక్షలు దేవరపల్లి మండలం గర్సింగి  ఎర్ర చెరువు రెండు కిలోమీటర్ల 100 మీటర్లు ఒక కోటి 10 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మాడుగుల దేవి ఆడిటోరియం  తా చెరువు వాగు వరకు రెండు విడతల్లో రోడ్డు విస్తరణ చేపడతామన్నారు. తాడివలస గోపూర్ లో తాగునీటి సమస్యకు  మినీ వాటర్ ప్లాంట్ నిర్వహించామన్నారు. తాజాగా గెలుపొందిన గ్రామ సర్పంచులు   వార్డు మెంబర్లు బాధ్యతగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. తమ తమ పరిధిలో ప్రజాసమస్యలు ప్రతి ఒక్కటీ గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పురవీధుల్లో మట్టి రోడ్లను సిమెంట్ రోడ్ల గా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయితీ ఆస్తులను పరిరక్షించి అవసరం మేరకు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. మోదకొండమ్మ ఆలయం నుంచి రామచంద్రపురం మీదుగా కాశీపురం వరకు రోడ్డు నిర్మాణం బ్రిడ్జి ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్  కళావతి  ఉప సర్పంచ్  శ్రీనాథ్ శ్రీనివాసరావు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...