Followers

కన్నుల పండువగా బాలాజీ వేంకటేశ్వరస్వామి కల్యాణం..

కన్నుల పండువగా బాలాజీ వేంకటేశ్వరస్వామి కల్యాణం..

నేడు స్వామివారి రథోత్సవం..

ఉమ్మడి ఆదిలాబాద్ , పెన్ పవర్


  కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన కల్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది . స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య కల్యాణ వైభవాన్ని కడు రమణీయంగా నిర్వహించారు.రెండవ తిరుపతిగా పేరుగాంచిన గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు , తలంబ్రాలు , కంకణాలు , ప్రసాదాలు రాగా ఆలయ అర్చకులు టీటీడీ సభ్యు లకు ఘనస్వాగతం పలికారు. జాతర మొదటి రోజు భారీగా తరలిచ్చిన భక్తులు గుహలో ఉన్న స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చు కున్నారు. కల్యాణ మహోత్సవంలో పలువురు ప్రముఖులు స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.రెబ్బెన యంపిపి సౌందర్య ఆనంద రావు, గంగాపూర్ సర్పంచ్ పందిర్ల వినోద మదునయ్య,ఆలయ చెర్మన్ వోలువోజు వెంకటేశం హారిత,మాజీ ఆలయ చెర్మన్ గుర్లే చంద్రయ్య దంపతులు కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి  పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారిని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, పిఎస్సిఎస్సి చైర్మన్ సంజీవ్ కుమార్, వైస్ చైర్మన్ రంగ మహేష్ గౌడ్, సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్న సోమశేఖర్, నవీన్ జైస్వాల్,మోడెం సుదర్శన్ గౌడ్,పల్లె రాజేశ్వరరావు ఆసిఫాబాద్ అచ్చేశ్వర్ రావు పలువురు దర్శించుకు న్నారు.బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వ హించే మూడు రోజుల జాతర మహోత్సవం లో నేడు రథోత్సవం నిర్వహించనున్నారు . నేటి సాయంత్రం 6.15 గంటలకు గంగాపూర్ వాగు లో స్వామివారి ఉత్సవ విగ్రహాలతో రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ బాపిరెడ్డి, చెర్మన్ వలువోజు వెంకటేషం చారి కమిటీ సభ్యులు వినోద్ జైశ్వాల్,రాపాల శ్రీనివాస్,మడే చిన్నయ్య,ఇగురపు పర్వతాలు, అడె శంకర్ ,గోగర్ల చంద్రకళ తెలిపారు . రథోత్సవాన్ని తిలకించేందుకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలిరానున్నట్లు అంచనా స్వామి దర్శనం కోసం ఆలయ కమిటీ ధర్మదర్శనంతో పాటు శీఘ్ర దర్శనం , ప్రత్యేక దర్శన సదుపాయాలను కల్పించింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు . మండల కేంద్రం నుంచి గంగాపూర్‌లోని ఆలయం వరకూ ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అడుగ డుగునా పోలీసు సిబ్బందికి విధులు అప్పగించారు . నంబాల రైల్వే గేట్ తో పాటు ఆలయ ప్రాంగణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు , జాతరలో అల్లర్లు , అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు . ఆసిఫాబాద్ డీఎస్పీ అచ్చేశ్వర్ రావు నేతృత్వంలో రెబ్బెన సీఐ అడప సతీష్ రెబ్బెన ఎస్ ఐ భవాని సేన్,వాంకిడి ఎస్ఐ దికోండ రమేష్,తిర్యాణి ఏస్ ఐ రామరావు తో పాటు పలువురు పోలీసులు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...